For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెంపుడు కుక్కలతో మీ పిల్లలు జాగ్రత్త....

|

Kids Care about their Pets....
ప్రస్తుత కాలంలో ఇంటి సంరక్షణ కోసమో, సరదా కోసమో, హోదా కోసమో..కుక్కలను పెంచుకునేవారి సంఖ్యం పెరిగిపోయింది. అయితే ఇంట్లో పిల్లల్లు ఉన్న వారు మాత్రం కుక్కలను పెంచుకోవాలనుకొనే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో వారికి కుక్క ఏవిధంగా అవసరం? అనే విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలా కాదనుకుంటే పిల్లల వయస్సును బట్టి కుక్కను తెచ్చుకోవాలి. ఇంట్లో కొంత మంది పిల్లలు హైపర్ గా ఉంటారు. వారికి కుక్క పిల్లల జాగ్రత్తల గురించి ఎంత వివరించినా అల్లరిపనులు చేస్తూనే ఉంటారు. అంటే చెవులు పట్టి పీకడం, తోకపట్టి లాగడం, మరీ ముద్దొస్తే మూతికి మూతి ఆనించడం, ముక్కుతో రుద్దడం, మీద కూర్చొని ‘చల్ చల్’అంటూ దౌడు తీయించడం, ల్లలతో గుచ్చడం... వంటివి. అలాంటి పిల్లలుంటే మాత్రం కుక్కను పెంచుకోకపోవడమే ఉత్తమం. పిల్లలకు కుక్కలంటే అమితమైన ఇష్టం.

అందుకే వాటిని గట్టిగా పట్టుకోవాలని, హత్తుకోవాలని చూస్తారు. పిల్లలకు కుక్కలు మంచి స్నేహితులు. ఎక్కడికి వెళ్లినా వెంట ఉండే బంట్లు. అలా అని అతిగా ప్రవర్తిస్తే ‘కాటు’వేసేస్తాయి. కాబట్టి కుక్కలతో స్నేహం ‘పరిధి’లేంటో వివరించండి. వాటి వల్ల ఎదురయ్యే ప్రమాదం నుంచి పిల్లల్ని కాపాడండి. కుక్కల మూడ్స్ అన్ని పరిస్థితుల్లోనూ ఒకేలా ఉండకపోవచ్చు. ఇరుగు పొరుగు పిల్లలు వచ్చినప్పుడు తమ ఇంట్లో ఉన్న కుక్క గురించి, దానికి ఏది నచ్చదో ఆ విషయాన్ని పిల్లలకు తెలియజేయాలి. అలాగే ఆ కుక్క బాగోగులు చూసుకునే వ్యక్తి దాని వెంట ఉండాలి. లేదంటే పిల్లలు తోక పట్టుకోవడం, చెవులు లాగడం, భౌ భౌ మనడం.. లాంటివి చేస్తుంటారు. అది కుక్కకు నచ్చక పైకి ఎగబడే అవకాశం ఉంటుంది.

ఫ్రెండ్లీగా ఉంటుంది కదా అని చిన్నపిల్లలను ఒంటరిగా కుక్కకు దగ్గరగా ఉండనివ్వకూడదు. ముద్దుగా, బొద్దుగా ఉంది కదా అని మరీ దగ్గరగా తీసుకోకూడదని పిల్లలకు చెప్పాలి. వాటికి ఆహారం తినిపించి, అదే చేత్తో పిల్లలూ తినకుండా చూడాలి. అలాగే పెంపుడు కుక్కను బయటకు తీసుకెళ్లినప్పుడు మరో కుక్కతో ఆడటం, పోట్లాడటం, కొరకడం... వంటివి గమనిస్తే వెంటనే పెద్దలకు తెలియజేయమనాలి.

కొంతమంది పిల్లలు కుక్కల మీదకు రాళ్లు విసరడం, కాలు దువ్వడం, గట్టిగా అరవడం, పుల్లలు పెట్టి గుచ్చడం... వంటి పనులతో రెచ్చగొడుతుంటారు. అలాంటప్పుడు ఆత్మరక్షణ కోసం అవి తిరగబడే అవకాశం ఉంది. గీరడమో, కరవడమో కూడా చేయవచ్చు. తప్పు తమదే కాబట్టి ఈ విషయం పెద్దలకు చెబితే తిడతారో, కొడతారో అనే భయానికో, చిన్న గాయమేగా తగ్గిపోతుందిలే అనో కొంతమంది పిల్లలు ఇంట్లో చెప్పరు. దీంతో సరైన ట్రీట్‌మెంట్ అందక ప్రమాదం వాటిల్లవచ్చు.

పిల్లలు భయం లేకుండా ఏ విషయాన్నైనా చెప్పగలిగే వాతావరణాన్ని తల్లిదండ్రులు ఏర్పరచాలి. ఇలాంటి పిల్లల ప్రవర్తన గురించి తల్లిదండ్రులకు ముందే తెలుస్తుంటుంది. కాబట్టి మనం ఎలా ప్రవర్తిస్తే కుక్కలకు చిరాకో, మనం ఏం చేస్తే కుక్కలు బాగుంటాయో చెప్పాలి. కుక్క దంతాలు ఎంత వాడిగా ఉంటాయి? అవి కరిస్తే వచ్చే ప్రమాదాలు.. తదితర వివరాలను చిత్రాల ద్వారా చూపించవచ్చు. ఇందుకు ఇంటర్‌నెట్‌లో కొన్ని ఇమేజెస్‌ను డౌన్‌లోడ్ చేసి వివరించవచ్చు.

English summary

Kids Care about their Pets.... | పెంపుడు కుక్కలతో మీ పిల్లలు జాగ్రత్త....

Looking after a pet is a BIG responsibility. A pet is not just a playmate for you. A pet needs lots of care and attention (as well as love) - just like you really - so you need to show the grown-ups in your home that you are willing to help look after your pet, as well as play with him/her. The bond between pet and child can be breathtaking to behold -- unconditional love and tender care at their finest. But there's more to the kid-pet relationship than sentimental moments. Children can tend pets, but they need guidance to do the job right.
Story first published:Tuesday, April 3, 2012, 16:37 [IST]
Desktop Bottom Promotion