Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కుక్క ఉంటే చాలు జిమ్ కు ఎందుకు దండగా....

మనుష్యులు మరింత చురుగ్గా ఉండడంలో ఇంట్లోని వారిని చలాకీగా ఉంచడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. కుక్కలను పెంచుకుంటున్న వారు సామాజికంగా మరింత చురుగ్గా ఉంటున్నారని, వారు బయట గడిపే సమయం, వ్యాయామంలాంటి శారీరక శ్రమ కూడా ఎక్కువేనని ఈ అధ్యయనంలో తేలింది. జంతువుల్లో కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయని అందరికీ తెలుసు. పెంపుడు కుక్కలు మంచి నేస్తాలే కాదు...కుక్కలు తెలివైనవి కూడా. అందుకే వాసన పసిగట్టి నేరస్థులను పట్టుకోవడానికి కుక్కలను ఉపయోగిస్తుంటారు.
పెంపుడు జంతువైన శునకం పోషణ, ఇంట్లో పిల్లల భౌతిక చర్యలపై వర్జీనియా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బద్ధకంగా సోఫాలో అతుక్కుపోయే పిల్లల్ని కదిలించి చురుగ్గా మార్చడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయని తేలింది. కుక్కలతోపాటు నడవడం, పరుగెత్తడం వంటివి కూడా మనిషిని చైతన్యపరుస్తాయని తమ అధ్యయనంలో తేలిందంటున్నారు. కుక్కలను పెంచుతున్న 600 మంది యుక్తవయస్కులపై చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. వ్యాయామం చేసే వారితో పోల్చి చూసినప్పుడు కుక్కలతో నడక, పరుగెత్తడం వంటి పనులు చేసే వారు అంతే ఆరోగ్యంతో ఉన్నట్లు తేలింది.



Click it and Unblock the Notifications