Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
కుక్కల పెంపకంలో వేసవి జాగ్రత్తలు...!

ఇంట్లో పెంచుకొనే కుక్కపిల్లలను వేడి నుంచి ఉపశమనం కలిగించేందుకు చల్లటి నీటిని నెమ్మదిగా స్ప్రే చేయాలి. పెంపుడు కుక్కపిల్లలు గనుక దాన్ని ఇష్టపడితే ఆ విధమైన స్ప్రేలను కొనసాగించుకోవచ్చు. ముఖ్యంగా ఎండ కాలంలో ఒక గంట సేపటికి మించి ఎక్కువ సయమం బయటకు తీసుకువెళ్ళేటట్లయితే, ఏసీ లేదా ఫ్యాన్ సదుపాయం ఉండే గదిలో కుక్కను ఉంచండి. వేసవిలో కుక్కలు ఇళ్ళలో టాయ్ లెట్ లలోని నీటిని తాగేందుకు ప్రయత్నిస్తుంటాయి. అందుకని వాటిపై ఎప్పటికీ మూత పెట్టి ఉండేలా చూసుకోవాలి. ఆ బౌల్‌లో కెమికల్ క్లీనర్లు, ఫ్రెషనర్స్ లాంటివి లేకుండా జాగ్రత్త పడాలి.
వేసవిలో పెంపుడు కుక్కలు పడుకొనే పక్కను ఎప్పుడూ చల్లగా ఉండేటట్లు చూసుకోవాలి. డాగ్ క్రేట్ నుంచి కుషనరీ బెడ్డింగ్ తొలగించాలి. బ్లాంకెట్స్ లాంటి వాటితో ఉన్న పక్కమీద కన్నా కూడా చల్లటి ఉపరితలంపై పడుకునేందుకు కుక్కలు ప్రాధాన్యం ఇస్తాయి. కాబట్టి అటువంటి వాటికే అలవాటు చేయాలి. ఇక పెంపుడు కుక్కలంటే ఎక్కువగా బొచ్చుకుక్కలనే పెంచుకుంటుంటారు. అటువంటప్పుడు అవి వేసవిలో వేడికి వాటి శరీరంపై ఉన్న బొచ్చు కూడా చిరాకు కలిగిస్తుంటుంది. బొచ్చు ఎక్కువగా ఉండే పప్పీలను వేసవిలో గ్రూమ్ చేయాలి. ఫర్ ఎక్కువగా ఉండే రకాలకు చెందిన కుక్కలను ఆ మందపాటి కోటు మరింత వేడికి గురిచేస్తుంది. అంతేకాకుండా ఆ బొచ్చు. బాక్టీరియా, పరాన్న జీవులకు నెలవుగా మారుతుంది.
పెంపుడు కుక్కతో వ్యాయామం తెల్లవారుజామున లేదా సూర్యాస్తమయం తరువాత చేయించడం మంచిది. మనుష్యులు కోరుకున్నట్లుగానే కుక్కలు కూడా చల్లదనాన్ని కోరుకుంటాయి. కుక్కను వాకింగ్ కు తీసుకెళ్ళేటప్పుడూ జాగ్రత్త వహించాలి. బ్లాక్ టాప్ వేడిగా ఉంటే అది కుక్క పాదాల ప్యాడ్స్ కు ఇబ్బంది కలిగిస్తుంది. బ్లాక్ టాప్ ను తాకి చూడండి. అది గనుక వేడిగా ఉందని మీకు అన్పిస్తే, మీ పెంపుడు కుక్కకూ అది వేడిగానే ఉంటుందని గుర్తించండి. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే వేసవిలో కూడా పెంపుడు కుక్కలు హాయిగా వాటి జీవనాన్ని సాగిస్తాయి.



Click it and Unblock the Notifications
