Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సమ్మర్ లోనూ అక్వేరియం చల్లగా ఉండాలంటే.....?

అక్వేరియం అనగానే పెద్ద పెట్టె లాగానే ఉండనవసరం లేదు. గాజు పాత్ర అయిన చాలు అనేది ఆరోగ్య ప్రియుల మాట. ఇంట్లో వసతిని బట్టి, మన సమయం కేటాయింపు, బడ్జెట్‌కు తగిన విధమైనవి తీసుకోవచ్చు. ఇప్పుడు చిన్న పాత్ర పరిమాణం నుంచి పెద్ద గాజు తొట్టె వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. విభిన్నమైన జాతులు, అనేక రంగుల్లో చేపలు మురిపిస్తున్నాయి. అక్వేరియంలో ముఖ్యంగా గోల్డ్ ఫిష్‌తో పాటుగా సీహార్స్, రెడ్ స్టార్ ఫిష్, ఏంజెల్ ఫిష్, డ్రాగన్ ఫిష్, క్లోన్ ఫిష్, బాట్ ఫిష్, సర్జియాన్ తదితర రకాల చేపలను కొనుగోలు చేయవచ్చు. ఇంట్లో స్థలాభావం ఉన్నా ఇబ్బంది లేకుండా ఎల్‌సీడీ తరహాలో ‘వాల్ మౌంటెడ్ ఆక్వేరియం’లు నేడు అందుబాటులో ఉన్నాయి.
అక్వేరియం ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఒత్తిడికి దూరమై ప్రశాంతత లభిస్తుంది అయితే అక్వేరియంను మెయింటైన్ చేయడంలో చాలా జాగ్రత్తలు తెలుసుకోవాలి పాటించాలి. ముఖ్యంగా ఎండకాలం. ముఖ్యంగా మనుష్యు ఎండలకు తట్టుకోలేక ఎయిర్ కండిషనర్ ఎయిర్ కూలర్, ఫ్యాన్స్ ఏదోరకంగా సేదతీరుతారు. ప్రత్యామ్నాయంగా స్విమ్మింగ్ చేయడం, ఎయిర్ కండిషనర్ గదుల్లో గడపడానికి అలవాటు పడుతుంటారు. మనలాగే ఇతర కొన్ని జీవరాశులు కూడా వేడిని తట్టుకోలేవు. ఉదాహరణకు చేప ఫిష్ టాంక్ లో ఉన్నాకూడా వేసవిలో అది కూడా వేడిని భరిస్తుంటుంది. కాబట్టి వేసవిలో ఫిష్ టాంక్ ను కూల్ గా ఉంచే కొన్ని చిట్కాలు మీకోసం.....
1. ప్రతి రోజూ ఫిష్ టాంక్ వాటర్ ను చేంజ్ చేయాలి: ప్రతి రోజూ వాటర్ ను మార్చడం వల్ల అందులో ఉన్న చేపలు కొత్తగా ఫీలవ్వడంతో పాటు వాటి శరీరం చల్లదనాన్ని ఆశ్వాదిస్తుంది. కాబట్టి టాంక్ హీట్ తగ్గించి ప్రతి రోజూ నీటిని మార్చుతుండాలి. అదికూడా ప్రతి రోజూ సాయంత్రం పూట మాత్రమే నీటిని మార్చాలి.
2. లైట్స్ ను ఆఫ్ చేయాలి: ఇంట్లో ఫిష్ టాంక్ లేదా అక్వేరియం ఉంటే ఆరోజంతా ఆ ఇంటికే అందం..ఆకర్షణ, ఆహ్లాదం..అలాంటి ఆహ్లాదాన్నిచ్చే ఫిష్ టాంక్ లో ఫ్లాష్ లైట్స్ ఉన్నట్లైతే వేసవి కాలంలో వేడికి ఫిష్ టాంక్ ను చల్లగా ఉంచలేవు. కొంతమంది చేపలు ఇటు అటు తిరుగుతుంటే క్లీయర్ గా కనబడాలని ఎప్పుడు ఫ్లాష్ లైట్స్ వేసే ఉంచుతారు. పగులు వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పగలు లైట్స్ ను ఆఫ్ చేయడమే ఉత్తమం. దానివల్ల అందులో ఉన్న నీళ్ళు చల్లగా ఉంటాయి. సాయంత్రం కావాలనుకుంటే మాత్రమే లైట్స్ ఆన్ చేసుకోవాలి. లేదంటే గదిలో వెలిగే లైట్స్ వెలుతురే సరిపోతుంది.
3. కిటికీలను మూసివుంచడం: వేసవికాలంలో ఫిష్ టాంక్ ను చల్లటి ప్రదేశంలో ఉంచాలి. లేదంటే వేడిగాలులు ఇంట్లోకి ప్రవేశించి చేపలు చనిపోతాయి. కాబట్టి టాంక్ ఉన్న ప్రదేశంలో కిటికీలను మూసివుంచాలి.
4. క్లిప్ ఫ్యాన్: చిన్న సైజులో ఉన్న క్లిప్ ఫ్యాన్స్ ను వినియోగించి టాంక్ కు సరిపడినంత దూరంలో ఉంచే ఫ్రెష్ ఎయిర్ ను అందించి టాంక్ ను కూల్ గా ఉంచవచ్చు.



Click it and Unblock the Notifications