చూసుకొంటే అరుపులే కాదు... ప్రేమ కూడా....!

ఇంట్లో కుక్కలను పెంచుకోవడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. కొంత మంది ఒంటరిగా గడిపేవారు ఇలా కుక్కలను, మొక్కలను పెంచుకొంటూ ఆనందమైన జీవితాన్ని గడుపుతుంటారు. ముఖ్యంగా కుక్కలను పెంచుకొనే వారు ఇంట్లో స్థలం వాటి కోసమని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఒక కుక్కను పెంచుకొనే వారు కొంత స్థలం కేటాయిస్తే సరిపోతుంది. రెండు కుక్కలను పెంచుకోవాలంటే కొంచెం ఇబ్బందే. రెండో కొత్త కుక్కను ఇంటికి తీసుకు రావాలనుకొన్నప్పుడు వారి యజమానులకు చాలా ఆలోచనలే ఉంటాయి.

Pet Care

కొత్త కుక్కను తీసుకొచ్చినప్పుడు అది ముందు నుండి ఇంట్లో ఉన్న పాత కుక్కకు ఇబ్బంది కలగకుండా చూడాలి. రెండు కలసిపోయే విధంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రెండు కుక్కలను మెయింటైన్ చేయడం కష్టం అనిపించకపోయినా అవి స్నేహంగా మెలగడానికి ఒకదానితో ఒకటి సహకరించాలి. ఇంట్లో పెంచుకొనే కుక్కలను స్నహపూర్వకంగా పెంచాల్సిన బాధ్యత వాటి యజమానులదే. యజమానులు ఇచ్చే ట్రైనింగ్ ను బట్టే అవి కూడా మెలుగుతాయి. అయితే దాని కోసం కొంత అదనపు బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే రెండు కుక్కలు ఒకే ఇంట్లో పెంచుకోవడం వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి.

ఎప్పుడైతే రెండు కుక్కలు ఒకే ఇంట్లో కలసి మెలసి ఉంటాయో అప్పుడు అవి చాలా చురుకుగా, హుషారుగా, తమాషాగా, ఆరోగ్యంగా కూడా ఉండడానికి సహాయపడుతుంది. రెండు కుక్కలకు సమయానికి ఆహారం ఇవ్వడం వల్ల, అవి రెండు కలసి తినడం వల్ల అవి చాలా యాక్టివిగా ఉంటాయి. కాబట్టి రెండు కుక్కలను కలిపి పెంచుకోవడం వల్ల అటు ఆ రెండు జంతువులకు కానీ, వాటి పెంచుకొనే యజమానికి కానీ ఎటువంటి హాని జరగదు. అయితే ఆ రెండు కుక్కలకు సంరక్షణ కల్పించడం కొంచెం కష్టమైనా కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే సరిపోతుంది. ఇంట్లో రెండో కుక్కను కూడా పెంచుకోవాలనుకొనే వారి కోసం కొన్ని సూచనలు..

రెండో కుక్కను ఇంటికి తీసుకోరావాలనుకొన్నప్పుడు మొదటి కుక్క ఆ ఇంట్లో నివసించే కుటుంబ సభ్యులందరితో స్థిరపడి ఉండాలి. స్నేహంగా మెలుగుతుండాలి. కాబట్టి రెండో కుక్కను తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నప్పుడు మొదటి కుక్కు ఇంట్లో వారిందరితో స్నేహంగా ఉండేటట్లు చూడాలి. అప్పుడు దానికి కంపెనీ(జోడీ)గా మరో కుక్కను తీసుకొచ్చినా అది స్నేహపూర్వకంగా ఆ కొత్త కుక్కతో మొలగడానికి ప్రయత్నిస్తుంది.

ఆ రెండు కుక్కలు ఆదర్శంగా మెలగడానికి ముఖ్యంగా లింగ బేధం ఉండాలి. అప్పుడే అవి స్నేహంగా మెలగుతాయి. ముందే ఇంట్లో పెంచుకొంటున్న కుక్కకు ఆపోసిట్ కుక్కను మాత్రమే తీసుకొంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అప్పుడే ఆ రెండు కుక్కలను మెయింటైన్ చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. దాంతో ఆ రెండు కుక్కల మధ్య శత్రుత్వం తక్కువగా ఉండి, వాటి మద్య కాదు కుటుంబ సభ్యుల మధ్య కూడా ఆప్యాయత మరి ఎక్కువగా పెరుగుతుంది.

కొత్త కుక్కను ఇంటికి తీసుకొచ్చే ముందే పాత కుక్క ఒక్క సంవత్సరం ముందే తీసుకొచ్చి ఉండాలి. కాబట్టి ఒక సంవత్సరం నుండి ఇంట్లో మనుషులకు బాగా దగ్గరై ఉండాలి. అందుకు కనీసం ఒక సంవత్సరమైనా అయితేనే కుక్కలు మనుషులకు దగ్గరౌతాయి.

కొత్త కుక్కను తీసుకొచ్చేటప్పటికీ ఆ కుక్కకు ఆరు నెలలు గడిచి ఉండకూడదు. అది పుట్టి ఆరు నెలల కంటే చిన్నదిగా ఉండాలి. ఒక వేళ రెండు కుక్కలు ఒకే వయస్సు ఉంటే కనుక అవి స్నేహపూర్వకంగా మెలగడం కొంచెం కష్టమే అవుతుంది. అయితే రెండు కుక్కలను ఒకే చోట ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. రెండింటిని ఇంట్లో ఒంటరిగా వదలకూడదు.

కుక్కను కలిసి పెంచుతున్నప్పుడు కుక్కల పట్ల అభధ్రత భావం కలిగి ఉండకూడదు. ఎప్పుడూ వాటి మీద సాధారణ భావనతో ఉండాలి. కొత్త కుక్క మీద కూడా అలాగే సాధరణ ప్రేమను మాత్రమే చూపాలి. కాబట్టి పెంపుడు కుక్కల యజమాని రెండు కుక్కల మీద ఒకే భావనతో మెలగాలి. కుక్కలను ఫీడింగ్ చేసేటప్పుడు రెండింటికీ సపరేట్ గానే అందించాలి. అవి ఒక ఇంట్లో ఉన్నప్పుడు, తిరిగేటప్పుడు అవి ఒకదానితో ఒకటి అడ్జెస్ట్ అయ్యేవిధంగా వాటికి ట్రైనింగ్ ఇవ్వాలి. ముఖ్యంగా కొత్త దాన్ని తీసుకొచ్చినప్పుడు (ఆ రెండు మంచి స్నేహితులు అయ్యేంత వరకూ)రెండింటికి రెండు బౌల్స్ లో ఆహారాన్ని అందించాలి.
కాబట్టి కొత్త కుక్కను తీసుకు రావాలని ఆలోచనలు ఉన్నవారు ఇటువంటి సూచనలు పాటిస్తే కొంత వరకూ ఇబ్బంది పడకుండా ఉంటారు.

Desktop Bottom Promotion