Latest Updates
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026
అనారోగ్యంగా ఉన్న మీ కుక్కకోసం ఉత్తమ ఆహారాలు
సాదారణంగా పెట్ కి అనారోగ్యం వచ్చిందన్న విషయం తెలుసుకోవడం చాలా తేలిక. పెట్స్ గురించి బాగా తెలిసినవాళ్లు, వాటిని కొన్ని సంత్సరాలుగా పెంచుకొని అనుభం కలిగిన వాళ్లు వెంటనే ‘ఇది రోజూలాగ లేదే' అని గుర్తుపట్టేస్తారు. ముఖ్యంగా పెట్స్ కి అనారోగ్యం చేస్తే రోజూ కనిపించే హుషారు, చలాకీతనం ఉండవు. పిలిచినా పలకవు, ఆడువకోవు. రోజూ అవి ఇష్టంగా మసులుకునే వ్యక్తులు పిలిచినా స్పందించవు. ఒక మూల ముడుచుకుని పడుకుంటాయి. ఎప్పుడూ తడిగానే ఉండే ముక్కు, అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రం పొడిగా మారుతుంది.
పెట్స్ వచ్చే సాధారణ అనారోగ్యాలు స్టమక్ అప్ సెట్, జ్వరం వంటివే, స్టమక్ అప్ సెట్ అయితే దానికి అదే నయం చేసుకుంటుంది. జీర్ణవ్యవస్థ యథా స్తితికి వచ్చిన తర్వాత మాత్రమే ఆహారాన్ని ముట్టుకుంటుంది. అనారోగ్యంగా ఉన్న కుక్కలు సాధారణంగా పచ్చగడ్డిని తినడానికి ఇష్టపడుతుంది, దాంతో అది మరింత బెటర్ గా ఫీల్ అవుతుంది. ఈ పచ్చిగడ్డి స్టొమక్ అప్ సెట్ ను తగ్గిస్తుదని చెబుతుంటారు. మరియు అవి సౌకర్య వంతంగా ఉండటానికి అలా తింటాయాని చెబుతారు. పెట్స్ అనారోగ్యం పాలైనప్పుడు వెంటనే వెటర్నరీ డాక్టర్ ను సంప్రదించాల్సిందే తప్ప సొంత వైద్యాలు చేయకూడదు. వాటిని సమస్యను నివారించడానికి మందులతోపాటు కొన్ని రకాల ఆహారాలు కూడా వాటిని త్వరగా అనారోగ్యం నుండి కోలుకునేలా చేస్తాయి.
కాబట్టి, పెట్స్ అనారోగ్యం నుండి చాలా త్వరగా కోలుకోవడానికి ఇక్కడ కొన్ని సింపుల్ చిట్కాలను అందిస్తున్నాం . ఈ పెట్ కేర్ టిప్స్ ను అనుసరించి, చాలా తక్కువ సమయంలో అవి త్వరగా కోలుకొనేలా చేయవచ్చు. పెట్స్ అనారోగ్యంగా ఉన్నప్పుడు కొన్ని రకాల ఫుడ్స్ తో ట్రీట్ చేయవచ్చు. అలాగే పెట్స్ కు ఇచ్చే ఆహారాల్లో కారంగా ఉన్న వాటిని ఇవ్వకూడదు. అలా ఇవ్వడం వల్ల వాటిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది.
అనారోగ్యంగా ఉన్న మీకుక్కకు ఏలా ట్రీట్ చేయాలో క్రింది స్లైడ్ ద్వారా పరిశీలించండి:

1. ఉడికించిన అన్నం :
అనారోగ్యంతో ఉన్న మీ పెట్ కు ప్లెయిన్ రైస్ ను పెట్టవచ్చు. చాలా తక్కువగా ఉప్పు వేసి, అన్నం తయారుచేయాలి. ఇలా తయారుచేసిన అన్నంలో కొద్దిగా పాలు కూడా వేసి పెట్టవచ్చు.

2. చికెన్ స్టీవ్:
చికెన్ స్టీవ్ చాలా బెస్ట్ డైట్. దీన్ని, అనారోగ్యంగా ఉన్న మీ కుక్కకు పెట్టవచ్చు . చికెన్ సూప్ ను రెండు సార్లు అంధించండి . అనారోగ్యంగా ఉన్న కుక్క చాలా త్వరగా కోలుకోవడానికి ఈ చికెన్ స్టివ్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

3. నీళ్ళు:
అనారోగ్యంగా ఉన్న కుక్కలకు అధికంగా నీళ్ళు అవసరం ఉంటుంది. వాటికి తగినంత నీళ్ళు అంధించడం ద్వారా వాటిని హైడ్రేషన్ లో ఉంచవచ్చు.

4. ఉడికించిన వెజిటేబుల్స్:
అనారోగ్యంగా ఉన్న మీ కుక్కకు బాగా ఉడికించిన వెజిటేబుల్ ముక్కలు పెట్టవచ్చు. గుప్పెడు పచ్చిబఠానీ, క్యారెట్ మరియు మరికొన్ని ఇతర వెజిటేబుల్స్ మిక్స్ చేసి బాగా ఉడికించి వాటికి పెడితే చాలా ఇష్టంగా తింటాయి.

5. బ్రెడ్:
పాలు మరియు బ్రెడ్ ఒక మంచి ఆహారం. వీటిని అనారోగ్యంగా ఉన్న మీ కుక్కకు పెట్టవచ్చు. బ్రెడ్ కడుపుకు చాలా తేలికగా ఉంటుంది మరియు చాలా సులభంగా జీర్ణించుకోగలదు.

6. పాలు:
రోజులో రెండు కప్పుల పాలు, అనారోగ్యంగా ఉన్న మీ కుక్కలోని చెడు బ్యాక్టీరియాను నివారించడానికి సహాయపడుతుంది . అలాగే, అనారోగ్యంగా ఉన్న కుక్కకు పాలు ఒక మంచి ఎనర్జీ మూలం.

7. చిదిమిన బంగాళదుంప:
మెత్తగా ఉడికించి, చిదిమిన బంగాళదుంప చాలా తేలికైన ఆహారం. కాబట్టి, అనారోగ్యంగా ఉన్న మీ కుక్కకు దీన్ని అంధించండి. దీన్ని అలాగే పెట్టొచ్చు లేదా ఉడికించిన అన్నంతో కలిపి పెట్టవచ్చు.

8. బీఫ్:
స్ట్రైయిండ్ బీఫ్ అనారోగ్యంగా ఉన్న కుక్కకు చాలా మంచిది . అదనపు కొవ్వును తొలగించండి. బీఫ్ ముక్కలను కొద్దిగా ఉప్పు కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసి ఉడికించి పెట్టవచ్చు.

9. గ్రీన్ వెజిటేబుల్స్:
ఈ గ్రీన్ వెజిటేబుల్ అనారోగ్యంగా ఉన్న కుక్కకు మంచి ఎనర్జీని మరియు ప్రోటీనులను అంధిస్తాయి . ఈ సమయంలో పెట్స్ కు సమతుల్యమైన న్యూట్రిషియన్స్ అవసరం అవుతాయి.

10. పచ్చికూరలు:
మీ కుక్క పచ్చికూరలు తినడానికి ఇష్టపడితే. ఒక చిన్న కప్పులో పచ్చికూరలన్నింటి చిన్న చిన్నగా తరిగి అంధించండి. అనారోగ్యంగా ఉన్న మీ పెట్ కు ఒక ఉత్తమ పచ్చికూరలు బ్రొకోలీ, గ్రీన్ బీన్స్, క్యారెట్స్ వంటివి అనారోగ్యంగా ఉన్నప్పుడు తినడానికి ఇష్టపడుతుంది.



Click it and Unblock the Notifications