Latest Updates
-
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు!
మీ పెంపుడు కుక్కలు ఖచ్చితంగా తినకూడని ఆహారాలు...!
సాధారణంగా చాలా మంది పెట్ ఓనర్స్ వారు పెంచుకొనే పెంపుడు కుక్కలకు తినడానికి ఏవైనా పెట్టొచ్చు అనుకుంటారు. మరికొంత మంది వారు పెంచుకొనే కుక్కలు మనుష్యులతో సమానం అందుకే అవి అన్ని తినగలవు అందుకే మనుష్యలు తినేటటువంటి ఆహారాలన్నింటిని వారు పెంపుడు కుక్కలకు పెడుతున్నాం అంటుంటారు. రీసెంట్ గా ఒక ఫ్రెండ్ తన కుక్క పెరుగు అన్నం తింటుందని, ఎందుకంటే అతను స్వచ్చమైన తమిళకుంటుంబం నుండి వచ్చినాను అన్నాడు. అయితే, మీకుక్క తీసుకొనే ఆహారానికి మీ వ్యక్తిగత ప్రాధాన్యత వర్తించదు.
మీకుక్క చిన్న పిల్లలు కాదని అర్ధం చేసుకోవాలి. మీరు కుక్క ఆకారాన్నిబట్టి ఆహారాన్ని ఇవ్వకూడదు. తన జీర్ణ వ్యవస్థను సరిపోయే ఆహారాన్ని ఇవ్వాలి. మీ పెంపుడు కుక్కకు కుక్కలకు సంబంధించిన ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలి. కొన్ని ఆహారాలు కుక్కలకు విషపూరితమైనవి. అయితే, విషపూరితమైన ఆహారాలు గుర్తించనట్లైతే అవి కుక్కల యొక్క మొటబాలిక్ సిస్టమ్ కు సరిపడవు. మరి కుక్కలకు సరిపడని అటువంటి ఆహారాలు కొన్ని:

ఉల్లి మరియు వెల్లుల్లి: కుక్కలకు ఫెడ్ కర్రీస్ పెట్టకూడదని చాలా మంది నిపుణులు చెప్తుంటారు. కర్రీస్ లో ఉల్లిపాయ మరియు వెల్లుల్లి ఉండటం వల్ల , అవి కుక్కల్లో రెడ్ బ్లడ్ సెల్స్ ను క్షీణించేలా చేస్తాయి. అలా జరిగితే కుక్కలకు అనిమియాకు గురిఅవుతాయి లేదా వీక్ గా మారుతాయి. మీ కుక్క చాలా క్రియారహితంగా (ఇన్ యాక్టివేట్)గా ఉన్నట్లైతే, ఉల్లి మరియు వెల్లుల్లి రెండూ ను కుక్కలకు హనికలిగించవచ్చు.
చాక్లెట్స్: చాక్లెట్స్ కు ఉపయోగించే కోకాలో థయోబ్రొమైన్ అనే హానికరమైన పదార్థం కలిగి ఉంటుంది . అవి సరిగా పనిచేయకపోతే కుక్కలకు ఆకస్మిక ప్రాణాంతకం కావచ్చు. మీ పెంపుడు కుక్కలకు చాక్లెట్స్ అంటే ఇష్టం కావచ్చు, అయితే వాటికి చాక్లెట్స్ ను ఇవ్వడం ఉత్తమ పద్దతి కాదు.
డైరీ ప్రొడక్ట్స్: బాగా పెరిగే కుక్కలకు పాల ఉత్పత్తల అవసరం ఉండదు. అయితే కుక్కలకు ప్రత్యేకంగా మార్కెట్లో దొరికే పప్పీ మిల్క్ ఇవ్వవచ్చు.అయితే కుక్కలు పెద్దగా పెరిగే కొద్ది డైరీ ప్రొడక్ట్స్ ఇవ్వడం నిలిపివేయాలి. కుక్కల యొక్క జీర్ణ వ్యవస్థ పాలను జీర్ణం అవ్వకుండా చేస్తుంది.
ద్రాక్ష మరియు ఎండు ద్రాక్ష: ద్రాక్ష ఒక పండు, వీటిని పెంపుడు కుక్కలు తినకూడదు. మరియు ఎండు ద్రాక్ష కూడా ద్రాక్షతోనే తయారు చేస్తారు కాబట్టి ఎండు ద్రాక్షను కూడా కుక్కలకు పెట్టకూడదు. ద్రాక్షలో ఉండే కొన్ని అంశాలు కుక్కల కిడ్నీ ఫెయిల్యూర్ కు కారణం కావచ్చు.
అవొకాడో: మనుషులకు, అవొకాడో పండు మంచి న్యూట్రిషియన్ పండు. అయితే కుక్కలకు ఈ పండు చాలా హానికరం.



Click it and Unblock the Notifications