For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పెంపుడు జంతువుల పట్ల ప్రేమగా మెలగడం ఎలా?

|

ప్రతివారికీ తమ పెంపుడు జంతువుల పట్ల ప్రేమగా ఉండడం ఎలాగో తెలియాలి. పెంపుడు జంతువులని, ఇతర ప్రాణులని ఈ క్రింది ఉపాయాలతో ప్రేమించవచ్చు.

1. మీ కుందేలు, కుక్క లేదా పిల్లిని బాగా ముస్తాబు చేయండి. చాలా వరకు పెంపుడు జంతువులూ మీరు ముస్తాబు చేస్తే సంతోషిస్తాయి, కానీ వాటికి అది ఇష్టం లేకపోతే చేయకండి, ఎందుకంటే అవి మిమ్మల్ని ద్వేషి౦చేలా చేస్తుంది.

2. వాటికీ మరీ ఎక్కువ కానీ, మరీ తక్కువ కానీ ఆహరం ఇవ్వకండి. వాటికి బాగా ఆకలిగా ఎపుడు ఉందొ కేవలం ఆహరం కోసం ఎపుడు ప్రయత్నిస్తున్నాయో ఈ రెంటికీ మధ్య తేడాను గమనించండి.

3. రోజుకొకసారైనా ఆహరం, పానీయం తీసుకునే బౌల్ ని శుభ్రం చేయండి. అదీ మనకులాగానే అవసరం. మీరు అదే పళ్ళెంలో వారం రోజుల పాటు తినరు, అదే మగ్గులో నీళ్ళు నెలపాటు తాగరు కదా!

4. పెంపుడు జంతువులపై శ్రద్ధ వహించండి. పెంపుడు జంతువులు సాధ్యమైనంత ఎక్కువ ధ్యాసను కోరుకుంటాయి, ప్రత్యేకంగా కుక్కలు, అయితే, ఆ శ్రద్ధ మీ నిబంధనల ప్రకారం ఉండాలి. సాధారణంగా, మీ పెంపుడు జంతువుల ఉనికిని గుర్తించండి; "హాయ్, ఏమి చేస్తున్నావు?" అనండి, మీరు ఏమన్నారో దానికి స్పష్టంగా అర్ధంకాదు, కానీ మీరు దానిని చూస్తున్నారు అని అది గమనిస్తుంది.

How to Be Nice to Your Pets

5. కుక్కలను షికారుకు తీసుకువెళ్ళండి. చాలా కుక్కలకు ఇంట్లోనో, పెరట్లోనో రోజంతా పడుండడం ఇష్టం ఉండదు; అవి బైటికి వెళ్లి షికారు చేయలనుకుంటాయి. దారిలో ఇతర కుక్కలని కూడా కలుస్తాయి; నడకదారిలో మీకు ఎవరైనా కనిపిస్తే మీరు సంతోషి౦చరా?

6. భౌతిక స్పర్శ జంతువులకు చాలా ముఖ్యం, దీనివల్ల అవి మరింత స్నేహంగా ఉంటాయి. మీ పెంపుడు జంతువులతో ఆడుకోండి, తట్టండి లేదా కేవలం అలా గడ్డి మీద కూర్చుని ఆడించండి.

7. కుక్కని పిల్లలుగా భావించకండి. కుక్క జంతువు కాబట్టి మార్గదర్శనం కావాలి. మీరు అభద్రతకు గురవ్వకండి, ధైర్యంగా ముందుండి మార్గదర్శనం చేయండి.

8. దాన్ని కొట్టడం, తిట్టడం వంటి బాధపెట్టే పనులు చేయకండి! దానివల్ల మీ పెంపుడు జంతువులు మిమ్మల్ని అసహ్యించుకునే ప్రమాదం ఉంది.

9. క్రమం తప్పకుండా వాటిని పశు వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్ళండి. మీకు నచ్చక పోవచ్చు కానీ మొదట్లోనే డానికి కాస్త అసౌకర్యం కల్పిస్తే, ముందే నిరోధించ గలిగిన పురుగులు పడ్డాయని తెలుసుకుని తరువాత బాధపడాలి. అప్పుడపుడు దానికి బహుమానం ఇవ్వండి.

10. మీ పెంపుడు జంతువుకు మీరే యజమాని. దాని పట్టీని బిగిచ్చడం, లేదా దెబ్బ వాయడం లాంటివి చేసి భయపెట్టవద్దు కానీ అది ఏమీ చేసినా చెల్లుతుందని అనుకోనీయవద్దు.

11. మీ పెంపుడు జంతువుతో అసహనంగా ఉండకండి. వాటికి మీ మాటలు అర్ధం కావు.

English summary

How to Be Nice to Your Pets | మీ పెంపుడు జంతువుల పట్ల ప్రేమగా మెలగడం ఎలా?

Everyone needs to know how to be nice to their own pets! Here are a few tips to being nice to your pets and other animals.
Story first published: Friday, February 1, 2013, 11:48 [IST]
Desktop Bottom Promotion