For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెంపుడు కుక్కల నుండి దుర్వాసన నివారించే చిట్కాలు!

By Super
|

కుక్కల నుంచి వచ్చే వాసనల వల్ల ఓ కుక్కను పెంచుకోవడానికి గానీ దాంతో ఇంట్లోనో, కార్ లోనో సమయం గడపడానికి గానీ ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. కుక్కల నుంచి వచ్చే వాసనలలో చాలా రకాలు వున్నాయి - నోటి దుర్వాసన, కడుపుబ్బర౦, శుభ్రం చేయని బొచ్చు, లేదా అశుద్ధం తొక్కడం లాంటివి. చివరిగా, అవి ఎంత అందంగా ఉన్నా వాసన వచ్చే కుక్కలతో కాలక్షేపం చేయడం కష్టమే కనుక అవి మంచి వాసన వచ్చేలా చేయడం చాలా ముఖ్యం. కుక్కల నుంచి వచ్చే దుర్వాసన పరీక్షించి, నిరోధించే కొన్ని పనులు, మీరు చేయగలిగినవి కొన్ని ఇక్కడ ఇచ్చాం.

1. మీ కుక్క మీద పెర్ఫ్యూమ్ లు, సుగంధ భరిత ఉత్పత్తులు ఏవీ చల్లకండి. ఇవి కేవలం దుర్వాసనను కప్పి పుచ్చుతాయి, కానీ వాటిని తొలగించవు. ఏదైనా లోతైన సమస్య వుంటే దాన్ని కూడా ఇవి కప్పి పుచ్చుతాయి. పైగా మీరు మీ కుక్కల మీద చల్లాలనుకున్నవి వాటికి పడక పోవచ్చు, సురక్షితం కాక పోవచ్చు.

2. మీ కుక్కలను సాధ్యమైనంత త్వరగా తడి ఆరేలా చేయండి. తడిగా వుండే కుక్కల చర్మం మీద వుండే సహజ తైలాల మీద బతికే బాక్టీరియా వల్ల భరించలేని దుర్వాసన వస్తుంది. చాలా ఇతర రకాల బాక్టీరియాల్లాగే అవి వెచ్చగా, తేమగా వుండే చోట ప్రబలుతాయి. ఈ సమస్యను నివారించాలంటే మీ కుక్కను తరచుగా స్నానం చేయించి, మళ్ళీ స్నానానికి తీసుకు వెళ్ళే లోగా బాగా పొడిగా వుంచడం ఉత్తమ మార్గం.

3. మీ కుక్క చెవుల్లో గుబిలి పేరుకోకుండా ఉండడానికి, దాన్ని తొలగించడానికి వాటిని శుభ్రం చేయండి. చెవి శుభ్రం చేసే పరికరాలు లేదా ద్రవం కొనండి.

4. మీ కుక్కను రోజూ బ్రష్ చేయండి లేదా దువ్వండి. దీని వల్ల చెత్తా చెదారం పోయి, దుమ్ము, బాక్టీరియా పేరుకోకుండా వుంటాయి. వెనక్కి దువ్వడం వల్ల ఊడిపోయిన బొచ్చు కూడా తొలగించవచ్చు. తడి దువ్వెనతో అయితే మరింత బొచ్చు తొలగించవచ్చు.

5. మీ కుక్కకు దంత పరిశుభ్రత ఉండేలా చూసుకోండి. పాడైపోయిన పళ్ళ వల్ల నోటి దుర్వాసన వస్తుంది. మీ కుక్క నోటికి సరిపోయే కుక్కల టూత్ బ్రష్ ఎంచుకోండి. కుక్కలకు పనికి వచ్చే టూత్ పేస్ట్ వాడండి. (ఎప్పుడూ మనుషులు వాడేది వాడకండి). కుక్కల టూత్ పేస్ట్ లు ఎద్దు మాంసం లేదా కోడి మాంసం రుచిలో తయారు చేస్తారు.

English summary

How to Make Your Dog Smell Better

Dog odor can often cause people to think twice about either owning a dog or letting the dog spend time indoors or in a car with them. Dog odors can be many and varied, including bad breath, flatulence, poorly maintained fur and stepping or rolling in do-do.
Desktop Bottom Promotion