Latest Updates
-
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.!
పెంపుడు కుక్కపిల్లల సంరక్షణ చిట్కాలు
ప్రతి ఒక్కరు పెంపుడు జంతువులను ప్రేమిస్తారు. నిజానికి అవి మనోహరముగా ఉంటాయి! మీరు పెంపుడు జంతువుల ప్రేమికులు అయితే అప్పుడు మీ ఇంటి వద్ద కనీసం ఒక పెంపుడు జంతువు ఉంటుంది. సాదారణంగా ఎక్కువ మంది ప్రజలు ఒక కుక్క లేదా కుక్క పిల్లను పెంచుకుంటారు. కుక్క మనిషికి ఉత్తమ స్నేహితుడు అని చెప్పవచ్చు. ఎందుకంటే మీ ఇంటికి కాపలా ఉంటే మీరు హాయిగా రిలాక్స్ అవవచ్చు. ప్రతి రోజు మీ కుక్క పిల్లతో ఆడుతూ రోజువారీ ఆందోళనల నుండి ఉపశమనం పొందవచ్చు. మీరు చాలా సౌకర్యవంతంగా మరియు వెచ్చని అనుభూతిని పొందవచ్చు. మీ పిల్లలు వాటితో స్నేహంగా ఉండి ఆడుకుంటారు. మీ కుక్క పిల్ల చివరికి మీ కుటుంబంలో ఒక సభ్యునిగా మారుతుంది. అందువలన కుక్కపిల్ల సంరక్షణ చేయటం అనేది అవసరం.
కుక్కపిల్ల సంరక్షణ కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. కానీ కొద్దిగా సమయం కేటాయిస్తే మీ కుక్కపిల్ల బాగా కనిపించేలా చేయవచ్చు.మీ కుక్కపిల్ల మీకు ఇష్టమైనదిగా ఉంటుంది. అందువలన దానికి ఏమైనా చెడు జరిగితే మీరు తట్టుకోలేరు. ఈ సందర్భంలో,అప్పుడు మీరు ఖచ్చితంగా కుక్కపిల్ల సంరక్షణ చిట్కాలు తెలుసుకోవాలి. కుక్కపిల్ల సంరక్షణ నేర్చుకోవటం అనేది పెద్ద క్లిష్టము కాదు. కేవలం కొన్ని సాధారణ మార్గాలు అనుసరించి మీ కుక్కపిల్లకు ఉత్తమ సంరక్షణ చేయవచ్చు.
మీరు మీ కుక్కపిల్లకి ఏమైనా చేస్తే దాని కన్నా ఎక్కువగా మీ పప్పీ మిమ్మల్ని ప్రేమిస్తుంది. మీ కుక్కపిల్లను ఉత్తమ మార్గంలో శ్రద్ధ వహించడానికి ఈ కుక్కపిల్ల సంరక్షణ చిట్కాలను ప్రయత్నించండి. మీ కుక్కపిల్ల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారో తెలుసుకోవడానికి ఈ వ్యాసాన్ని చదవండి.

1. జాబితాలో మొదటిది
కుక్కపిల్ల సంరక్షణలో మొదటి విషయం ఏమిటంటే ఒక మంచి కుక్క పిల్లను గుర్తించడం అని చెప్పవచ్చు. ఒక కుక్క పిల్లను కనుగొనటానికి వచ్చినప్పుడు మీరు మీ జీవన శైలి సరిపోయే ఒక జాతిని ఎంచుకోండి. మీకు సమయం మరియు బడ్జెట్ లేని సందర్భంలో బాగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవలసిన కుక్క పిల్లను కొనుగోలు చేయకూడదు.

2. ఆహారం
మీకు ఒక మంచి కుక్క పిల్ల దొరికిన తరువాత,దాని కొరకు ఆహార మార్గాలను తెలుసుకోవాలి. ఆహారంను జాగ్రత్తగా ఎంపిక చేయాలి. ఇది ఒక కుక్కపిల్ల కోసం పట్టించుకోనే ఉత్తమ మార్గాలలో ఒకటి. అది కోరుకొనే ఆహారాన్ని ఇవ్వాలి. మీ కుక్కపిల్లకు కొన్ని ఆహారాలు పడకపోవచ్చు. కాబట్టి మీరు వాటిని గుర్తించాలి.

3. అవసరమైన వస్తువులు
ఒక కుక్కపిల్ల సంరక్షణ కొరకు కొన్ని అవసరమైన వస్తువులు ఉన్నాయి. ఇక్కడ కుక్కపిల్ల సంరక్షణ కొరకు ఫీడింగ్ గిన్నె,దువ్వెన,బ్రష్,కాలర్ పట్టీ మొదలైన కొన్ని అవసరమైన వస్తువులు ఉన్నాయి.

4. కలిసేలా చేయండి
ఒక కుక్కపిల్ల సంరక్షణ కోసం ఉత్తమ మార్గం ఏంటంటే అందరితో కలిసేలా చేయాలి. ముందు మీ కుటుంబంతో పరిచయం చేయాలి. కానీ ఇది నిదానమైన పద్ధతిలో జరగాలి. దానిని ఆ సమయంలో కుటుంబములో ఒక సభ్యునిగా చేయాలి. నిశ్శబ్దం మరియు ప్రశాంతత ఉండేలా చూడాలి. ఆరంభంలో పిల్లలు కుక్కపిల్లతో ఆడుకోవటానికి అనుమతి ఇవ్వకుండా ఉండటం ఉత్తమం. మీ కుటుంబంతో బాగా పరిచయం అయ్యాక పిల్లలను ఆడుకోవటానికి అనుమతి ఇవ్వవచ్చు.

5. ఇతర పెంపుడు జంతువుల పరిచయం
మీరు చెయ్యాల్సిన తదుపరి విషయం ఏమిటంటే మీ ఇంట్లో ఉన్న ఇతర పెంపుడు జంతువులను పరిచయం చేయాలి. ఒక పిల్లి లేదా ఒక జత లవ్ బర్డ్స్ ఉంటే వాటిని పరిచయం చేయాలి. కొన్ని రోజుల తర్వాత వాటితో సహజంగా ఉంటాయి.

6. ప్రత్యేక శ్రద్ధ వహించాలి
కొన్నిసార్లు మీ కుక్కపిల్లకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీ ఇంటిలో కుక్కపిల్లకు అవసరమైతే భరోసా ఇవ్వాలి. దాని అవసరాలను గుర్తించి మరియు తగిన సంరక్షణ ఇవ్వాలి.

7. హలో డాక్టర్!
మీరు ఒక క్రమ పద్దతిలో పశువైద్యుడుని సందర్శించవలసిన అవసరం ఉంది. ఇది మీ కుక్కపిల్లకు అవసరమైన సంరక్షణ నిర్ణయానికి సహాయం చేస్తుంది.

8. గ్రూమింగ్ కు సహాయపడుతుంది
గ్రూమింగ్ అనేది కుక్కపిల్ల సంరక్షణకు ఒక అనివార్యమైన భాగంగా ఉంటుంది. మీరు ఉత్తమ సంరక్షణ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నప్పుడు మీ కుక్క పిల్లలు గ్రూమింగ్ చేసే సమయంలో ప్రయత్నించండి. దువ్వెన లేదా బ్రష్ లను తరచుగా ఉపయోగించాలి. గోళ్లు మరింత క్లిప్ చేయండి.

9. ఒక నడక కోసం తీసుకువెళ్ళాలి
మీ కుక్క పిల్లను నడక కోసం బయటకు తీసుకువెళ్ళాలి. దానికి కొంత వ్యాయామం కావాలి! ఒక నడక కోసం బయటకు తీసుకొని వెళ్ళటం వలన మీకు మరియు కుక్కకు ప్రయోజనం ఉంటుంది. ఎందుకు దీనిని ప్రయత్నించకూడదు??

10. మానవ ఆహారాలను నివారించండి
మీరు తీసుకొనే ఆహారాన్ని కుక్క పిల్లకు దూరంగా ఉంచటం తప్పనిసరి. మానవులు తినే ఆహారం కుక్క కోసం సమతుల్య ఆహారం కాకపోవచ్చు. మీ కుక్కకు చాక్లెట్లు ఇవ్వడం మానుకోండి. అవి కుక్కకు విషపూరితం.



Click it and Unblock the Notifications