Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
కనులకు విందు అక్వేరియం షార్క్ చేపలు..!
ఇళ్లలో ప్రేమగా జంతువులను ఎలా పెంచుకుంటామో.. కొందరు అక్వేరియంలో చేపల్ని కూడా అలానే పెంచుతారు.. మరికొందరేమో ఇంటి అందానికి అక్వేరియం పెట్టుకుంటారు.. ఏదేమైనా అక్వేరియం ఇంట్లో ఉంటే మనకు ఉపయోగాలు కూడా ఉన్నాయట..ఈదుతున్న చేప పిల్లలను కాసేపు చూస్తూ కూర్చుంటే అలసిన మనసుకు కాస్త విశ్రాంతి దొరుకుతుందని, దైనందిన వ్యవహారాలతో సొలసిన తరుణంలో స్వేచ్ఛగా తిరుగాడే ఆమీనాల కేసి చూసే ఒక్క క్షణం వీక్షణం మన ఆలోచనల్లో మార్పు తెస్తుం దని శాస్త్రజ్ఞులు అంటారు. పెంపుడు జంతువులతో ఆడుకోవడం విశ్రాంతి నిచ్చినట్లుగానే ఆక్వేరియంలో తిరుగాడే రంగుల చేప పిల్లలను చూస్తూ గడిపే క్షణాలు కూడా మనసుకు సాంత్వన కలిగిస్తాయని అంటున్నారు.
అక్వేరియంలో చేపలు సందడి చేస్తేనే సంబర పడతాం. మరి అవి మిలమిలా కాంతులతో మెరిసిపోతే? కేరింతలు కొడతాం కదూ! అలాంటి చేపలు ఎక్కడున్నాయో తెలుసా? తైవాన్‌లో సందడి చేస్తున్నాయి. అక్వేరియంలో పెంచుకునే చేపలు దాదాపు 25 రకాలు. రకాలను బట్టి వాటి రేట్లూ ఉంటాయి. ముఖ్యంగా అక్వేరియంలో ప్రత్యేకంగా పెంచేటటువంటి వివిధ రకాల సొరచేపలు ఉన్నాయి. ఈ సొర చేపలు సముద్రాల్లో తప్పు మరే ఇతర ప్రదేశాల్లోనూ పెద్దగా పెరగవు. నిజానికి అక్వేరియంలో ఉంచే సొరచేపలు చాలా వరకూ మంచి నీటిలో పెరిగేటివే. అక్వేరియంలో ఉప్పునీటి చేపలు పెంచుకోవడం చాలా కష్టమైన పనే..
కొంత మంది సొర చేపలు అక్వేరియంకు సూటబుల్ కావని పెంచకుండా ఉంటారు. మరికొంతమంది ఈ సొర చేపలు ఇతర చేపలతో కలిసి ఉండలేవని భావిస్తారు. అందుకే ఒకే రకమైన చాపలను పెంచుతుంటారు. అయితే అన్ని రకాల సొర చేపలు అలా దూకుడుగాఉండవు. నిజానికి కొన్ని చిన్న రకానికి చెందిన సొర చేపలు ఇంట్లో ఉంచుకొనే అక్వేరియంలో ఆరోగ్యంగా పెరగగలవు. అయితే ఆ సొరచేపలు ఆరోగ్యంగా పెరగడం అనేది అక్వేరియం సైజుమీద ఆధారపడి ఉంటుంది.
అటువంటి కొన్ని షార్క్(సొరచేపలు)రకాలు ఫిష్ టాంక్ లో ఉంచగలిగినవి..ఉదా: రెడ్ టైల్ షార్క్ మరియు క్యాట్ షార్క్ చాలా ప్రసిద్ది.. అటువంటివి, మన ఇంట్లోని ఫిష్ ట్యాంక్ కు సరిపోయే షార్క్ చేపలు చూడండి..

రెడ్ టైల్ షార్క్: అక్వేరియంలో పెంచుకోగలిగి షార్క్ చేపల్లో ఇది చాలా ప్రసిద్ది చెందినది. ఈ చేప డీప్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. అయితే తోక మాత్ర ఆరెంజ్ రెడ్ కలర్ లో మెరిస్తుంటుంది. ఈ షార్క్ చేప అదే సైజ్ లో ఉన్న ఇతర చేపలు(గోల్డ్ ఫిఫ్ )వంటి వాటితో కలిసి పెరుగుతుంది.

బాలా షార్క్: ఈ షార్క్ చేప మూడు కలర్స్ లో మెరిసిపోతుంటుంది. సిల్వర్, వైట్ మరియు బ్లాక్ కలర్ షార్క్ చేప. ఇది చూడటానికి అచ్చు షార్క్ చేపలాగే ఉంటుంది. అయితే దానిక మొప్పలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇవి చాలా పెద్దగా పెరుగుతాయి.

బాంబు షార్క్: బాంబు షార్క్ పెద్దగా పెరగలేందు. మరియు చారల శరీరంతో చూడటానికి అందంగానే ఉంటుంది. కానీ ఇది చాలా నిదానం మరియు సొరచేపలకు ఇవి రెండు కలిసి పెరగగలవు.

రైంబో షార్క్: ఇది చూడటానికి చాలా పొడవుగా ఆరెంజ్ రెడ్ తోకతో ఉంటుంది. కానీ ఇది బాంబు షార్క్ కంటే మరింత శక్తివంతమైనది. అయితే ఇది దాని అవసరాన్ని మాత్రమే చూసుకొంటుంది. అలా పొందలేనప్పుడు ఫిష్ ట్యాంకులోని ఇతర చేపల మీద దాడి చేస్తుంది.

కోరల్ క్యాట్ షార్క్: ఇవి సముద్రపు అడుగుబాగంలో ఉన్న పగడపు దిబ్బలు వీటి నివాసాలు మరియు మీరు మీరు ఈ సొరచేపలు ఉంచుకుంటే మీ ఆక్వేరియం లో కొన్ని పగడాలు లేదా మొక్కలు ఉండాలి. ఈ చేపలు చిన్నవి మరియు శాంతియుతమైనవి. అందుకు మీ ఫిష్ ట్యాంక్ విశాలంగా ఉండాలి.

చైనీస్ హై-ఫిన్ బ్యాండెడ్ షార్క్: ఈ మనోహరమైన సొరచేపలు చూడటానికి అందంగా ఉన్నాయి కానీ, ఇతర సొర చేపల్లాగ మొప్పలు పొడవుగా ఉండువు. ఇవి రు చాలా మంచి వడపోత కలిగి చల్లని నీరు ఆక్వేరియంలు మాత్రమే జీవించగలను.

చైన్ క్యాట్ షార్క్: మీ అక్వేరియం మరింత అద్భుతమైన విందు కనబరచాలంటే ఇటువంటి చైన్ క్యాట్ షార్క్ ను ఒకటి ఫిష్ ట్యాంక్ లో ఉంటే చాలు. అవి చర్మంలో ప్రతిదీప్తి కలిగి మరియు శాంతియుతంగా తిరుగుతుంటాయి.



Click it and Unblock the Notifications