For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పెంపుడు కుక్క జబ్బు పడిందని తెలిపే 5 లక్షణాలు

|

మనుషుల వలే జంతువులు కూడా జబ్బు పడుతుంటాయి. ముఖ్యంగా పెంపుడు జంతువులు అనారోగ్యానికి గురైనప్పుడు తెలుసుకోవడం కొంచెం కష్టమే. వాతావరణంలో మార్పులు, కొన్ని రకాల ఆహారపు అలవాట్లు, అలర్జీల వల్ల అవి కూడా జుబ్బు పడటాకి కారణం అవుతాయి. కాబట్టి పెంపుడు కుక్కలు జబ్బు పడినప్పుడు కొన్ని లక్షణాలను గుర్గించగలిగి నట్లైతే వాటని సురక్షితంగా ఉంచవచ్చు. పెట్స్ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం ప్రకారం పెంపుడు కుక్కలు జబ్బు పడినప్పుడు వాటి ముక్కు డ్రైగా మారుతుంది. అదే విధంగా మరికొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి...

చాలా వరకూ పెంపుడు కుక్కలు జబ్బు పడినప్పుడు, అది కొంచెం ప్రమాధ స్థితికి చేరేంత వరకూ పెంపుడు కుక్క యజమానులు వాటిని గుర్తించలేరు. కాబట్టి, ఈ క్రింది తెలిపిన కొన్ని విలువైన లక్షణాలు గుర్తుంచుకొన్నట్లైతే పెంపుడు కుక్కలు జబ్బుపడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చు. సరైన సమయంలో స్పందించి సరైన జాగ్రత్తలు మరియు మందులు ఉపయోగించవచ్చు. అంతే కాదు, పెంపుడు కుక్కలు జబ్బు పడినప్పుడు, డాగ్ ఓనర్స్ వ్యక్తిగతంగా డాక్టర్ ప్రిస్క్రిప్స్ లేకుండా వారంతట వారే ఎటువంటి మందులు ఉపయోగించకూడదు. అలా ఉపయోగిస్తే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి, పెంపుడు కుక్కలు జబ్బు పడిందని తెలుసుకోవడం కోసం...

5 Signs To Tell If A Dog Is Sick

1. చూడటానికి ఎలా ఉంది: పెంపుడు కుక్కలు ఆరోగ్యంగా లేనప్పుడు కనిపించే లక్షణాల్లో మొదటిది శారీరక లక్షణాలు. పెంపుడు కుక్కలు జబ్బు పడినప్పుడు మొదటి గమనించాల్సినది వాటి కళ్ళు ఉబ్బకొని మరియు ఎర్రగా ఉన్నాయా గమనించాలి. అలాగే వాటి ముక్కలు మరింత డ్రైగా మారిందా. సాధారణంగా కంటే మీ పెంపుడు కుక్కవద్ద చెడు వాసన వస్తున్నదా?ఈ లక్షణాలన్నీ కూడా పెంపుడు కుక్కలు జబ్బపడిందని తెలిపే ప్రారంభ లక్షనాలు.
2. ప్రవర్త: మీ పెంపుడు కుక్క, లోయల్ ఫ్రెండ్ సడెన్ గా వింత్, మరియు ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తోందా అని గమనించాలి. అకస్మాత్తుగా ప్రవర్తనలో మార్పులు, దగ్గడం, నిరంతరం తుమ్మడం, నీళ్ళు త్రాగకుండా ఉండటం, ఆకలి లేకుండా ఉండటం వంటి లక్షణాలన్నీ కూడా పెంపుడు కుక్క జబ్బు పడిందని తెలిపే లక్షణాలే. ఈ లక్షణాలన్నీ కూడా మీ పెంపుడు కుక్కలో మీరు గమనించినట్లైత డాక్టర్ ను సంప్రదించాల్సిందే.
3. చిగుళ్ళు: పెంపుడు కుక్కలు జబ్బు పడినప్పుడు వాటి నోట్లోని దంతాల యొక్క చిగుళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయో లేదో తెలుపుతుంది. చిగుళ్ళు పసుపుగా ,బ్లూగా, తెల్లగా లేదా గ్రే కలర్ లో ఉండకూడదు. పెంపుడు కుక్కల యొక్క చిగుళ్ళు ఎల్లప్పుడూ పింక్ కలర్ లో ఉండాలి.
4. వణుకు: కొన్ని పెంపుడు కుక్కలు జబ్బుపడిన వెంటనే వణుకుతున్న లక్షణాలు కనబడుతాయి. అలాగే, మూలగడం లేదా వణుకుతున్నట్లైతే అవి నొప్పితో బాధపడుతున్నట్లు గ్రహించాలి. కుక్కులు జబ్బు పడ్డాయని తెలిపే లక్షణాల్లో ఇదిఒకటి. వెంటనే చికిత్సనందించాలి.
5. యూరిన్ సమస్యలు: పెంపుడు కుక్కలు జబ్బు పడినప్పుడు తరచూ మూత్రవిసర్జన చేస్తుంటాయి. ఇది కూడా కుక్క జబ్బుపడిందని తెలిపే లక్షణాల్లో ఒకటి. అది బ్లాడర్ లేదా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లు తెలిపే లక్షణం.

English summary

5 Signs To Tell If A Dog Is Sick

Just like humans, dogs too can get sick. The change of weather, certain food habits, allergies and so forth can cause them to feel weary. These signs that a dog is sick will make you aware that a vet need to be called in for safety measures. Experts say, to tell if a dog is sick, the nose of your loyal friend gets dry. Just like this, there are other signs too!
Story first published: Thursday, June 12, 2014, 16:34 [IST]
Desktop Bottom Promotion