For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెంపుడు కుక్కకు జుట్టురాలుతోందా?నివారించే ఫుడ్స్

|

పెట్ డాగ్స్ లో కూడా జుట్టు రాలడం ప్రధానం సమస్యగా ఉంది. పెంపుడు కుక్కలు జుట్టు రాలడానికి ప్రధాన కారణం అవి తినేటటువంటి ఆహారాలు. పెంపుడు కుక్కలు తీసుకొనే ఆహారంలో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉన్నా అది జుట్టు రాలడానికి దారితీస్తుంది. మరియు మీ పెంపుడు కుక్క ఇతర ఆహారాలను తినడం ఇష్టపడుటలేదా తెలుసుకోవాలి.

పెంపుడు కుక్కల యజమానులకు వాటికి రోజూ ఎటువంటి ఆహారాలను పెట్టాలనేది అలవాటు చేసుకోవాలి. మీ ఇంట్లో పెట్స్ ఉన్నప్పుడు, తరచూ వాటికి మీరు అంధించే కొన్ని ఆహారాలు వాటి స్కిన్ ఇరిటేషన్ కు గురిచేస్తుంది. వాటి చర్మం ఇరిటేషన్ కు గురియైనప్పుడు, చర్మం దురదకు కారణం అవుతుంది. ఫలితంగా జుట్టు రాలడానికి కారణం అవుతుంది. కాబట్టి, పెంపుడు కుక్కలకు స్కిన్ ఇరిటేషన్ మరియు జుట్టు రాలడానికి కారణం అయ్యే ఆహారాలను తప్పనిసరిగా నివారించాలి.

మీపెంపుడు కుక్కలు జుట్టు రాలడం తగ్గించడానికి, ఇక్కడ కొన్ని రకాల ఆహారాలున్నాయి. వీటిని జాగ్రత్తగా పరిశీలించి, మీ పెంపుడు కుక్క గురించి జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. పెంపుడు కుక్కకు జుట్టు రాలకుండా ఉండేందుకు నివారించాల్సిన ఆహారాలు:

ఉప్పు:

ఉప్పు:

ఉప్పు మన వంటల్లో ఒక ప్రధానమైనటువంటి ఆహారం. ఇది మన పెంపుడు కుక్కల డైట్ లో ఉండకూడదు. ఉప్పు అధికంగా ఉన్న ఆహారం అందివ్వడం వల్ల కుక్కలో జుట్టు రాలుతుంది. కాబట్టి మీ పెట్ మీల్లో ఉప్పు చేర్చడం నివారించండి.

పంచదార:

పంచదార:

కుక్కలకు కూడా స్వీట్స్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. అయితే, అవి తినడం వాటికి హానికరం. కాబట్టి, అధికంగా స్వీట్ పెట్టడం వల్ల పెంపుడు కుక్కలో జుట్టు రాలే సమస్యకు దారితీస్తుంది.

కార్న్:

కార్న్:

కొన్ని పెంపుడు కుక్కలకు మొక్కజొన్న అలర్జీ ఫుడ్. మీ పెంపుడు కుక్క కూడా కార్న్ తింటే అలర్జీకి కారణం అయితే, వాటినికి కార్న్ పెట్టడం నివారించండి. వీటిలో అధికంగా సాల్ట్ మరియు స్వీట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి, మీ పెంపుడు కుక్కకు కార్న్ పెట్టడం నివారించండి.

గోధుమలు:

గోధుమలు:

గోధుమలతో తయారుచేసే ఆహారాల్లో కూడా ఉప్పు అధికంగా ఉంటుంది. కాబట్టి, పెంపుడు కుక్కలకు అంధించే ఆహారంలో మైదా చేర్చడం మంచిది. గోధుమలతో తయారుచేసే వంటల్లో అధికంగా ఉప్పుఉండటం వల్ల జుట్టు రాలడానికి కారణం అవుతుంది.

బార్లీ:

బార్లీ:

మాల్ట్ బార్లీ మీ పెంపుడు కుక్కలకు అంధివ్వడం నివారించాలి మాల్ట్ బార్లీ నేచురల్ స్వీట్నర్. వీటిని అత్యధిక శాతం మంది ఉపయోగిస్తున్నారు. కాబట్టి, పెంపుడు కుక్కలకు బార్లీతో తయారుచేసిన ఆహారాలను పెట్టడం నివారించండి.

స్పైసీ ఫుడ్స్ :

స్పైసీ ఫుడ్స్ :

మీ పెంపుడు కుక్కలు స్పైసీ ఫుడ్స్ తినడానికి ఇష్టపడవచ్చు. కానీ వాటి ఆరోగ్యానికి స్పైసీ ఫుడ్స్ హానికరం. స్పైసీ ఫుడ్స్ పెంపుడుకుక్కల్లో వేగవంతంగా జుట్టు రాలడానికి దారితీస్తుంది. కాబట్టి, వాటికి స్పైసీ ఫుడ్స్ పెట్టడం నివారించడం ఉత్తమం.

గుడ్డు:

గుడ్డు:

కొన్ని రకాల డైరీ ప్రొడక్ట్స్ పెంపుడు కుక్కలకు పెట్టకూడదని సలహాలిస్తుంటారు . కొన్ని రకాల పెంపుడు కుక్కలకు గుడ్డుపచ్చసొన అలర్జీ కలుగుతుంది, దాని కారణంగా వాటిలో దురదకు కలిగి, జుట్టు రాలడానికి కారణం కావచ్చు.

నెయ్యి:

నెయ్యి:

చాలా మంది ఇళ్ళలో వంటలకు నూనెకు బదులుగా నెయ్యిని వినియోగిస్తుంటారు. మీ పెట్స్ కు ఇచ్చే ఆహారాల్లో నెయ్యి కలవకుండా జాగ్రత్త తీసుకోండి.

ఉల్లిపాయ:

ఉల్లిపాయ:

ఉల్లిపాయతో తయారుచేసే ఎటువంటి ఆహారమైనా సరే మీ పెంపుడు కుక్కలకు అంధించే ఆహారాల నుండి తొలగించాల్సిందే. పెంపుడు కుక్కల్లో ఉల్లిపాయ జ్యూస్ జుట్టు రాలడానికి కారణం అవుతుంది. కాబట్టి, ఉల్లిపాయఆహారాలు నివారించడం ఉత్తమం.

కర్జూరం:

కర్జూరం:

ఎండిన కర్జూరలాలు కుక్కల్లో అధికంగా జుట్టు రాలడానికి దారితీస్తుంది. కాబట్టి, వాటికి అంధించే ఆహారాల్లో డ్రై డేట్స్ లేకుండా చూసుకోండి.

English summary

Hair Loss In Dogs: Foods To Avoid

Hair loss is one of the main problems that affect pet dogs. The main reason for hair loss in pets is the food they eat. When their diet contains too much of sodium, it leads to hair loss. This can be avoided if you are aware of some of the other foods too which your pet should not eat.
Desktop Bottom Promotion