For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో మీ పెంపుడు కుక్కల సంరక్షణ ఇలా....

|

చలికాలంలో ప్రారంభమైపోయింది. ఈ చలికాలంలో మనకు లాగే మన ఇంట్లో పెంచుకొనే పెంపుడు జంతులకు కూడా సంరక్షణ చాలా అవసరం. అన్ని రకాల పెంపుడు కుక్కలు ఎక్కువ ఫర్(బొచ్చు)ను కలిగి ఉండవు. వాటి శరీరం మీద ఎక్కువ బొచ్చుకలిగి ఉండటం వల్ల రక్షక కవచంగా సహాయపడుతుంది. లేదంటా వాటికి వెచ్చదానాన్ని కల్పించాలి. అందుకు అనువైన సౌకర్యాలు ఏర్పరచాలి. మరి అందుకు మీరు ఏం చేస్తారు?మరి చలికాలంలో మీ పెంపుడు కుక్కల కోసం తీసుకోవల్సి జాగ్రత్తలను తెలుపడానికే మేమిక్కడున్నాము....

ఇంట్లో పెంచుకొనే పెంపుడు కుక్కలకు ఈ చలికాలం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మరీ ముఖ్యంగా వాటిని ఇంట్లో ఉంచడానికి ఒక అనుకూలమైన ప్రదేశంను ఎంపిక చేసుకోవాలి. అలాగే, వాటికి ఇచ్చే ఆహారం, వాటి బరువు విషయంలో, బాడీ టెంపరేచర్ మరియు హైడ్రేషన్, విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అవి మనలా ఏ విషయాన్ని ఎక్స్ ప్రెస్ చేయలేవు కాబట్టి, వాటి అవసరాలను మనమే గుర్తించి, అవి జబ్బు పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

మరి చలికాలంలో పెంపుడు కుక్కల కోసం తీసుకోవల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం...

1. డైట్: చలికాలంలో ఉష్ణోగ్రత చాలా వరకూ తగ్గుతుంది. ఈ చల్లటి వాతావరణంలో మనకు అసౌకర్యంగా ఉండటం వల్ల వాటిని బయటకు తీసుకెళ్ళడం చాలా వరకూ తగ్గించేస్తాము. వాటికి తక్కువ వ్యాయామం ఉన్నప్పడు తక్కువ క్యాలరీలు ఖర్చుఅవుతాయి. ఎప్పుడైతే పెంపుడు కుక్కలో క్యాలరీలు పెరుగుతాయో అప్పుడు వాటికి డైటరీ క్యాలరీలు మరియు తక్కువ ఆహారం అవసరం అవుతుంది. అలాకాకుండా ఎప్పటిలాగే ఫీడ్ చేస్తుంటే చలికాలంలో బరువు పెరిగి అనారోగ్యం పాలవుతాయి. కాబట్టి, పెంపుడు కుక్కలకు అందించే డైట్ మరియు వ్యాయామం విషయంలో జాగ్రత్తలు కలిగి ఉండాలి.

2. చలికాలంలో వాటికి వెచ్చని సౌకర్యం కల్పించాలి: చలికాలంలో పెంపుడుకుక్కలను బయట త్రిప్పడం తగ్గించాలి. సాధ్యమైనంత వరకూ వాటిని ఇంట్లో ఉంచే వెచ్చని వాతావరణ సౌకర్యం కల్పించాలి. కుక్కులు పడుకోవడానికి ఒక వెచ్చని ప్రదేశంను ఎంపిక చేసుకోవాలి. వాటిని డ్రాఫ్ట్స్, లేదా చల్లగా ఉండే టైల్స్ లేదా ఫ్లోవర్స్ మీద అలాగే వదిలేయకూడదు.

3. ఊహించని ప్రమాధాల నుండి వాటిని రక్షించండి: చలికాలంలో పెంపుడుకుక్కలు వెచ్చగా ఉండే షల్టర్స్ క్రింద ఉండటానికి ఇష్టపడుతాయి. ముఖ్యంగా కార్ల క్రింద, లేదా ల్యాంప్స్ లేదా హీటింగ్ డివైజస్ క్రింద ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటాయి . కాబట్టి, అవాంఛిత ప్రమాధాలు జరగకుండా వాటిని గమనిస్తుండాలి. లేదా కార్లను తీసే ముందు వాటి క్రింద ఒకసారి చూడటం మంచిది.

Winter Care Essentials For Your Dog

5. కుక్కలకు ఎప్పుడూ హైడ్రేషన్ లో ఉంచాలి: చలికాలం కాదా కుక్కకు ఎక్కువ నీరు అవసరం ఉందు అనుకోకూడదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ ను ఎప్పటి లాగే వాటికి సరిపడా నీరు అందివ్వడం ద్వారా వాటి శరీరం ఎప్పుడూ హైడ్రేషన్ (తేమ)గా ఉంటుంది.

6. సరిగా డ్రై చేస్తుండాలి : చలికాంలో పెంపుడు కుక్కలకు స్నానం చేయించిన తర్వాత వాటిని వెంటనే బాగా తడి ఆర్పాలి. లేదంటే మీ పెంపుడు కుక్కలు జలుబు చేసి జబ్బు పడుతాయి.

7. ప్రత్యేకమైన మందులు: చలికాలంలో పెంపుడు కుక్కలకు కూడా ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఎదుర్కొంటుంటాయి. కాబట్టి, వాటికి వ్యాయామంతో పాటు, అవసరం అయిన మందులను ఇంట్లో ఉంచుకోవడం ఉత్తమం.

English summary

Winter Care Essentials For Your Dog

Winters have started and your dog needs special attention during the season. All dogs are not blessed with the furry coats and pads on their paws. Neither can you expect them to wear sweaters like humans. So, what do you do? We are here to guide you on how to take care of your dog during the winter season.
Story first published: Wednesday, November 26, 2014, 16:30 [IST]
Desktop Bottom Promotion