For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పెంపుడు జంతువులను చంపే 12 సాధారణ ఆహార పదార్ధాలు

By Super
|

కొన్ని రకాల ఆహార పదార్ధాలను పెంపుడు జంతువులకు తినిపించకూడదు, కొన్ని ఆహార పదార్ధాలు పెంపుడు జంతువులను చంపుతాయి. చాలామందికి పెంపుడు జంతువులు ఉంటాయి, వాటిని వారు తమ కుటుంబంలో వొకటిగా చూసుకుంటారు. కొన్ని ఆహార పదార్ధాలు వాటికి మేలు చేస్తాయి, రుచిని ఇస్తాయి కానీ అవ్వి వాటికి ప్రమాదం కూడా కావచ్చు. వాటిలో కొన్ని కడుపు నొప్పితో బాధపడుతుంటాయి, మరికొన్ని ప్రాణాంతకంగా కావచ్చు.

మీ పెంపుడు జంతువుకు సరైన ఆహరం ఇవ్వండి, మీరు అసాధారణ విషయాలపై ఒక కన్ను వేసి ఉంచితే, విషపు ఆహారాన్ని గుర్తించడం కష్టం కాదు, మీ పెంపుడు జంతువు చాలా రోజులపాటు మీతో పాటు సరదాగా ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఉంటే ఫరవాలేదు, మీ పెంపుడు జంతువు ఏమి తిన్నా సరిపోతుంది. మీ పెంపుడు జంతువుకి ఫుడ్ పాయిసన్ అయిందనే అనుమానం వస్తే, వెంటనే పశువుల డాక్టరును సంప్రదించండి లేదా దగ్గరలోని అత్యవసర క్లినిక్ కి తీసుకువెళ్ళండి.

ఈరోజు బోల్డ్ స్కై వారు పెంపుడు జంతువులకు పెట్టకూడని పదార్ధాల గురించి ఒక జాబితా ఇచ్చారు.

పెంపుడు జంతువులను చంపే అత్యంత సాధారణ పదార్ధాలను గమనించండి.

గ్జైలిటోల్ (కాలరీలు లేని పంచదార)

గ్జైలిటోల్ (కాలరీలు లేని పంచదార)

మధుమేహం కలవారు ఉపయోగించే గ్జైలిటోల్ పంచదారకు ప్రత్యామ్నాయం. అనేక పండ్లు, కూరగాయల ఫైబర్ లో తక్కువ సాంద్రత కలిగిన వాటిలో సహజంగా సంభవించే షుగర్ ఆల్కాహాల్. దీనిని కొన్ని చ్యూఇంగ్ గమ్ లు, కాండీ లు, బేకరీ పదార్ధాలలో, పంటి గారను, నోరు ఎండిపోవడాన్ని నివారించడానికి టూత్ పేస్ట్ లాంటి ఇతర ఓరల్ కేర్ పదార్ధాలలో కలుపుతారు. ఈ గ్జైలోటోల్ ని పెంపుడు జంతువులకు చుట్టుపక్కల ఉంచొద్దు, ఇవి కొద్దిగా తీసుకున్నా అవి వాటికి ప్రాణాంతకమౌతాయి.

కెఫీన్

కెఫీన్

ఇది పెంపుడు జంతువులకు పెట్టకూడని పదార్ధాలలో ఒకటి. కెఫీన్ ఎక్కువ మొత్తంలో తీసుకుంటే, దీనివల్ల కుక్కలకు, పిల్లులకు అనారోగ్యాలు, భయాలు, గుండె స్పందన ఎక్కువై విశ్రాంతి లేకుండా పోతుంది. పెంపుడు జంతువులకు కాఫీ, టీ, కోకో, చాకొలేట్, సోదాలు, ఎనర్జీ డ్రింక్ లతోపాటు కెఫీన్ పదార్ధాలు పెట్టకూడదు.

చాకొలేట్

చాకొలేట్

చాకొలేట్ కుక్కలకు, పిల్లులకు విషం లాంటిది, డార్క్ చాకొలేట్ లో కోకో అధిక శాతం ఉండడం వల్ల ఇది మిల్క్ చాకొలేట్ కంటే విషపూరితమైనది. పెంపుడు జంతువులు చాకొలేట్ లు తింటే, వాంతులు, డయేరియా, అసాధారణ గుండె స్పందన, అనారోగ్యం, కిడ్నీ ఫెయిల్ కావడం, చావు కూడా సంభవించవచ్చు. ఈ విషపూరిత ఆహార ప్రభావం పెంపుడు జంతువు బరువుపై ఆధారపడి ప్రత్యామ్నాయం ఉంటుంది. అందువల్ల చిన్న పెంపుడు జంతువులకు ఇది చాలా ప్రమాదకరం.

ద్రాక్ష, ఎండుద్రాక్ష

ద్రాక్ష, ఎండుద్రాక్ష

ద్రాక్ష, ఎండుద్రాక్ష కొన్ని జంతువులకు హాని కలిగిస్తాయి ఎందుకో తెలీదు, కానీ అరగక పోతే కిడ్నీ ఫెయిల్ అయి, ప్రాణాలకు హానికలగవచ్చు. వీటిని పూర్తిగా నివారించడం మంచిది. ద్రాక్ష, ఎండుద్రాక్ష పెంపుడు జంతువులకు పెట్టకూడని ఆహార పదార్ధాలలో ఒకటి.

ఆల్కహాల్

ఆల్కహాల్

కుక్కలకు కొద్దిపాటి ఆల్కాహాల్ తాగించడం వల్ల వాంతులు, డయేరియా, సహకరించకపోవడం, చనిపోవడం వంటి వివిధ సమస్యలు వస్తాయి, ఈ సమస్యలన్నీ అవి తీసుకున్న ఆల్కాహాల్ మోతాదుపై ఆధారపడి ఉంటుంది. ఇది మనుషులకు లాగానే లివర్, బ్రెయిన్ మీద ప్రభావం చూపిస్తుంది. కుక్క ఎంత చిన్నదో, ప్రభావం అంత పెద్దగా ఉంటుంది. ఈ సూక్ష్మాన్ని గ్రహించండి.

గింజలు, ముఖ్యంగా వాల్నట్

గింజలు, ముఖ్యంగా వాల్నట్

గింజలు తినడం మంచిదే, ఎక్కువ గింజలు తినడం కుక్కలకు మంచిది కాదు, ప్రత్యేకంగా వాల్నట్ లు. వాల్నట్ గింజలు, వాటికి సంబంధించినవి తి౦టాయి. వాటివల్ల మీ కుక్కకు వాంతులు, త్రేమార్ లు, నీరసం, శరీర ఉష్ణోగ్రత అధికమవడం జరుగుతుంది. ఇతర గింజలు అంత తేలికగా అరగవు, అంతేకాక అవి మీ కుక్క పొట్టను అప్సెట్ చేస్తాయి.

అవోకేడో లు, పీచ్ లు, ప్లం లు

అవోకేడో లు, పీచ్ లు, ప్లం లు

కుక్కలు అవోకేడో లను అధికంగా తినడం వల్ల వాంతులు, డయేరియా సంభవించవచ్చు. పెర్సిమోన్ గింజలు కూడా పేగుల మీద ప్రభావితం చూబిస్తాయి. పీచ్, ప్లమ్ కూడా మీ పెంపుడు జంతువులపై విషంగా పనిచేస్తాయి.

పులిసిన పిండి

పులిసిన పిండి

పులిసిన పిండిని పెట్టినప్పుడు మీ పెంపుడు జంతువు జీర్ణవ్యవస్థ ప్రభావితమౌతుంది, దానివల్ల గాస్ అదనంగా చేరి, పొత్తికడుపు నొప్పి వస్తుంది. ఆ పిండి పూర్తిగా పులిసినప్పుడు కూడా, మీ దగ్గర బ్రెడ్ ఉంటే, పెంపుడు జంతువులకి బ్రెడ్ ముక్కలను చిన్నవిగా చేసి చికిత్స గా ఇవ్వొచ్చు. ఇది పిల్లులు, కుక్కలను చంపే మనుషులు తినే ఆహార పదార్ధాలలో ఒకటి.

పాలు, పాల పదార్ధాలు

పాలు, పాల పదార్ధాలు

ఇవి పెంపుడు జంతువులకు మంచి ఆహరం కాదు. పాల ఉత్పత్తులు పొట్టను అప్సెట్ చేసి, వాటికి డయేరియా వస్తుంది, ఎందుకంటే పాల ఉత్పత్తులలో లాక్తోజ్ విచ్చిన్నం చెంది పెద్ద మొత్తంలో లాక్తోజ్ ఎంజైమ్ ఉండదు కాబట్టి.

ఉప్పు

ఉప్పు

అధికంగా ఉప్పు తింటే పెంపుడు జంతువులు విషపూరితమౌతాయి. వాంతులు, డయేరియ, త్ర్మర్లు, అనారోగ్యం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, చివరికి మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంది.

పంచదార

పంచదార

పంచదార విషం కాదు, కానీ ఎక్కువగా తీసుకుంటే మనుషులు లాగానే పెంపుడు జంతువులు కూడా ప్రభావితమౌతాయి, దీనివల్ల పళ్ళ సమస్యలు, ప్రవర్తనలో మార్పులు, బరువు పెరగడం, మధుమేహం కూడా సంభవించవచ్చు.

ఉల్లి వెల్లుల్లి:

ఉల్లి వెల్లుల్లి:

ఉల్లి వెల్లుల్లి మీ పెంపుడు కుక్కలకు అంత ఆరోగ్యరమైనది కాదు, పూర్వకాలం నుండి వెల్లుల్లి ఒక మెడిసినల్ హెర్బ్ గా ఉపయోగిస్తున్నారు. పెట్స్ వెల్లుల్లి మరియు ఉల్లిపాయలను పచ్చిగా, లేదా పౌడర్ చేసి లేదా ఉడికించినవి ఎక్కువగా తీసుకోవడం ద్వారా గ్యాస్ట్రోటెస్షినల్ సమస్యలు పెరుగుతాయి. ఇది ప్రాణాంతక అనీమియాకు దారితీస్తుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ను డ్యామేజ్ చేస్తుంది. ఈ విషయంలో పిల్లలకు ఎక్కువ ప్రమాదం. అయితే కుక్కలకు కూడా ప్రమాదకరమే.

English summary

12 Common Foods That Can Kill Your Pets

There are some foods to avoid feeding pets as there are some foods that kill pets. Many people have pets and they treat them as an integral part of their family. There are some foods that are safe and delicious for us but they might be dangerous for our pets.
Desktop Bottom Promotion