For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్స్ కు ప్రాణహాని కలిగించే డేంజరెస్ ఫుడ్స్

|

చాలా మందికి పెంపుడు జంతువులను పెంచుకోవడం అంటే చాలా ఇష్టం ముఖ్యంగా పెంపుడు కుక్కపిల్లలను ఎక్కువ మంది పెంచుకోవడం మనం మన చుట్టుప్రక్కల ఇల్లల్లో చూస్తుంటాము. అయితే వాటి శరీర తత్వాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి, వాటికి ఫీడ్ చేయడం చాలా అవసరం. ముఖ్యంగా వాటిని అంధించే ఆహారాలు ఆరోగ్యకరమైనవి ఉండాలి. మీకు తెలుసా కొన్నిమనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాలు పెట్స్ ను తీవ్ర అనారోగ్యం బారిన పడేలా చేస్తాయి. లేదా వాటి ప్రాణాపాయస్థితికి తీసుకొస్తాయి. అలాంటి ఆహారాలు మీ పెంపుడు కుక్కల కోసం ఈరోజు తెలియజేస్తున్నాము.

మనం ఏదైనా ఆహారాలు తింటున్నప్పుడు మన పెంపుడు కుక్కలకు కూడా పెట్టడం అలవాటు చేస్తుంటాము. అయితే మనం తినే ఆహారాలైనా, మన పెంపుడు కుక్కలకు ఆరోగ్యానికి మేలు చేస్తాయా లేదా హాని చేస్తాయా తెలుసుకోవడం చాలా అవసరం. అలా కాకుండా ఏది పడితే అది అందివ్వడం వల్ల కొన్ని సందర్భాల్లో వాటి ప్రాణానికే ప్రమాధం.

కాబట్టి, అప్పుడుప్పుడు పెట్స్ ను డాక్టర్ వద్దకు తీసుకెళుతుండాలి . మంచి న్యూట్రీషియన్ ఫుడ్స్ ను అందివ్వాలి. డాక్టర్ సూచన మేరకు ఆహారాలను అందివ్వాలి. సాధారణంగా మనం తినే ఆహారాలను అందించేప్పుడు ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకోవాలి.

మనం పెంచుకొనే పెట్స్ , పసిపిల్లలాంటివి. కాబట్టి, వాటికోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం మన బాధ్యత. మరి పెట్స్ కు ప్రాణ హాని కలిగించే ఈ క్రింది ఆహారాలకు దూరంగా ఉంచండి...

కెఫిన్:

కెఫిన్:

కెఫిన్, కేఫినేటెడ్ డ్రింక్స్ తీసుకోవడం మనంకు మంచిదే, కానీ, పెంపుడు కుక్కలకు అది సురక్షితం కాదు. కుక్క మరియు పిల్లిలు కెఫిన్ తీసుకోవడం వల్ల హార్ట్ బీట్ పెరగడం , ట్రీమర్స్ మరియు రెస్ట్ లెస్ నెస్ గా భావించడం జరుగుతుంది. కాబట్టి వాటికి కెఫిన్, టీ మరియు ఇతర ఎనర్జీ డ్రింక్స్ అందివ్వడం మానుకోవాలి.

చాక్లెట్స్:

చాక్లెట్స్:

చాక్లెట్స్ కుక్కలకు టాక్సిక్ ఫుడ్ మరియు ముఖ్యంగా పిల్లులకు డార్క్ చాక్లెట్ పాల కంటే హానికరం. చాక్లెట్స్ లో కోకలెవల్స్ అధికంగా ఉంటాయి. అందువల్ల వాటిలో వాంతులు మరియు డయోరియాకు కారణం అవుతుంది. ముఖ్యంగా అబ్ నార్మల్ హార్ట్ బీట్, కిడ్నీ ఫెయిల్యూర్ మరియు ఇంకా ప్రాణహాని కూడా కలిగి ఉంటుంది. కాబట్టి, చాక్లెట్స్ అందించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.

ఎండు ద్రాక్ష:

ఎండు ద్రాక్ష:

పెట్స్ కు ఎండుద్రాక్షను అందివ్వడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ కు దారితీస్తుంది . పెట్స్ కు ఇది ఒక డేంజరెస్ ఫుడ్.

ఆల్కహాల్:

ఆల్కహాల్:

ఆల్కహాల్ అది ఎంత తక్కువైనా సరే...పెట్స్ కు చాలా ప్రమాధకరం. పెట్స్ ఆల్కహాల్ త్రాగడం వల్ల వాంతులు, డయోరియా, తుమ్ములు మరియు ఇతర సైడ్ ఎఫెక్ట్ చాలా ఉంటాయి. కాబట్టి, ఆల్కహాల్ దరిచేరనివ్వకండి.

నట్స్:

నట్స్:

మనుష్యులకు నట్స్ అత్యంత పౌష్టికాహారం, అయితే పెట్స్ విషయంలో ఇది చాలా వరెస్ట్ ఫుడ్ . పెట్స్ నట్స్ ను తిన్నాయంటే వాటికి వాంతులు లేదా శరీరం యొక్క ఉష్ణోగ్రత అమాంతం పెరుగుతుంది.

 ఉల్లి మరియు వెల్లుల్లి:

ఉల్లి మరియు వెల్లుల్లి:

పెట్స్ ఉల్లి మరియు వెల్లుల్లి తినడం వల్ల ప్రాణాంత లక్షణాలైన అనీమిక్ మరియు రెడ్ బ్లడ్ సెల్స్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి, పెట్స్ కు ఉల్లి, వెల్లుల్లి దూరంగా ఉంచాలి

English summary

6 Foods That Can Kill Your Pet

6 Foods That Can Kill Your Pet. We all love having pets at home and feed them with good nutritious foods for their healthy being. But do you even realise that there are certain basic foods that can kill your pet? Well, we are here today to share about foods that can actually kill your pets.
Story first published: Monday, September 14, 2015, 17:47 [IST]
Desktop Bottom Promotion