For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నప్పుడు ఇంటిని ఎలా శుభ్రపరచుకోవాలి

By Super
|

ఇంట్లో ఒక పెంపుడుజంతువు ఉంటే అంతకన్నా ఆసక్తికరమైన విషయం ఇంకొకటి లేదు. అవి మీ పట్ల చూపించే శ్రద్ధ వేరెవరు చూపించలేరు.

డాగ్స్ మనిషియొక్క ఉత్తమ స్నేహితులు మరియు మీరు ఒక పెంపుడుజంతువును పెంచుతున్నట్లయితే, మీరు ఈ విషయాన్నిఎప్పటికి విభేదించలేరు. కానీ, ఒక పెంపుడుజంతువుతో జీవితం గడపాలంటే కొన్ని విషయాలు కష్టంగా ఉంటాయి. అందులో ఒకటి మీ ఇంటి క్లీనింగ్ కు సంబందించిన సమస్యలు.

మీరు ఆందోళన చెందటానికి అవసరమైన ప్రధాన విషయాలలో ఒకటి వాటి జుట్టు. జుట్టు రాలని ఒక్క పెంపుడుజంతువు ఉండదు, అది ఇంట్లో ప్రతి చోటుకి వెళ్ళినప్పుడల్లా జుట్టు రాలుతుంటుంది. ఒకవేళ మీరు పూర్తిగా మీ పెంపుడుజంతువును ఆస్వాదించకుండా ఉంటేతప్ప. మీరు పెంపుడు జంతువులను పెంచుతుంటే ఇంటి క్లీనింగ్ అంత సులభంగా ఉండదు. దీని కోసం, మీరు కొన్ని ప్రాథమిక చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంటుంది.

Tips On How To Clean Your Home If You Have Pets

మంచి జాతి పెంపుడు జంతువులను పెంచుకోవటం వలన చాలా వరకు సమస్యలు ఎదురు కావు. మీరు ప్రత్యేకమైన జాతి పెంపుడు జంతువును తెచ్చుకోవాలి అని అనుకున్నప్పుడు, అప్పుడు మీరు ఇంటిలోని ప్రతి మూలను పరిగణలోకి తీసుకుని ప్రణాళిక వేసుకోవాలి మరియు శుభ్రంగా ఉంచడం ఎలా అని నిర్ణయించుకోండి. ఈ పెంపుడుజంతువుల సంరక్షణలో ప్రతి విషయం జాగ్రత్త వహించటం అవసరం.

మీరు పెంపుడు జంతువులను పెంచుతున్నప్పుడు మీ ఇంటిని క్లీనింగ్ చేయటానికి చిట్కాలు కొన్నిటిని క్రింద ఇస్తున్నాము. మీరు అవసరమైన సమాచారం పొందడానికి తగినంత పరిశోధన చేయండి. దీనిని ఏ జాతి పెంపుడుజంతువును ఎంచుకోవడం మరియు ఎలాంటి పెంపుడుజంతువును తెచ్చుకోవాలో నిర్ణయించుకునే ముందు చేయవచ్చు.

Tips On How To Clean Your Home If You Have Pets

పెంపుడుజంతువు జుట్టు
మీరు ఒక పెంపుడుజంతువును పెంచుతున్నప్పుడు, దాని జుట్టు నేల మీద, ఫర్నిచర్ మరియు దుస్తులమీద ఉంటుందని మీకు తెలుసు. మీ పెంపుడుజంతువుకు ఒక టవల్ వేసి దానిపైన విశ్రాంతి తీసుకోనివ్వండి మరియు దానిని సమయానుగుణంగా బయట దులపటం వలన దాని జుట్టును కొంతవరకు అరికట్టవచ్చు. మీ పెట్ యొక్క జుట్టును దువ్వటం వలన చాలావరకు జుట్టు రాలదు.

తివాచీలు, దుస్తులు మరియు అప్-హోల్స్తేరి
మీరు పెంపుడు జంతువులను పెంచుతున్నప్పుడు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలంటే కొద్దిగా అదనపు కృషి అవసరం. మీరు ఒక పూర్తి చూషణ వాక్యూమ్ క్లీనర్ ఉపయోగించి, వారంలో అనేక సార్లు కార్పెట్ ను వాక్యూమ్ చేయటం అవసరం. మీరు దుస్తుల నుండి జుట్టును శుభ్రం చేయడానికి ఒక టేప్ రోలర్ ఉపయోగించవచ్చు. హ్యాండ్హెల్డ్ వాక్యూమ్ క్లీనర్ అఫోల్స్తేరికి ఉత్తమం.

Tips On How To Clean Your Home If You Have Pets

మరకలు
మీరు పెంపుడుజంతువుల వల్ల కలిగిన మరకలను వెంటనే తొలగించడం ఎల్లప్పుడూ ఉత్తమం. తివాచీల మీద పెట్ మూత్రం క్లీనింగ్ చాలా సాధారణ సమస్య. పెంపుడుజంతువులకు బాత్రూమ్ లో మూత్రవిసర్జన శిక్షణ ఇవ్వటం వలన ఈ సమస్యను చాలావరకు నివారించవచ్చు. కార్పెట్ ఏ విధమైన మెటీరియల్ తో తయారయింది మరియు మరక వయస్సు మీద ఆధారపడి, అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

అఫాల్స్టెరీ
మీరు అఫాల్స్టెరీని సరి అయిన రకంతో తీసుకున్నప్పుడు, జుట్టు దానికి అతుక్కుపోకుండా, చిరిగిపోకుండ మరియు సులభంగా మీ ఫర్నిచర్ ను శుభ్రం చేయవచ్చు. మీరు తోలు వంటి సూక్ష్మ ఫైబర్ పదార్థంతో తయారయిన అఫాల్స్టెరీ కలిగి ఉన్నప్పుడు, మీకు పెంపుడు జంతువులు ఉన్నా ఇల్లు క్లీనింగ్ చేసుకోవటం చాలా సులభం. వదులుగా అల్లిన లేదా సన్నని పదార్థాలతో తయారయినవి తీసుకోవొద్దు. అఫాల్స్టెరీ నిర్వహించటంలో మీ పెట్ కు శిక్షణ ఇవ్వటం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. మీకు పెంపుడు జంతువులు ఉన్నప్పుడు ఇంటిని శుభ్రపరచడంలో మార్గాలు.

Tips On How To Clean Your Home If You Have Pets

సర్ఫేసస్ పరిరక్షించటం
పెంపుడు సంరక్షణలో భాగంగా, పెంపుడుజంతువుకు క్రమం తప్పకుండా దానికి స్నానం చేయించి, జుట్టును దువ్వటం అన్న సెషన్ చేయండి. ఇలా చేయటం వలన చాలావరకు గీతలు పడకుండా తగ్గించవచ్చు. తలుపులకు సాధారణంగా మీ పెంపుడు జంతువు గీకిన గీతలు ఉంటూనే ఉంటాయి. మీరు తలుపు చెడిపోకుండ ఉండేలా ఫ్లెక్సిగ్లాస్ షీట్ వాడవచ్చు. మీ పెట్ కు శిక్షణ ఒకసారి పూర్తయ్యింది అని నిశ్చయించుకున్న తరువాత, మీరు ఈ షీట్ తొలగించవచ్చు. ఈ పద్ధతులను ప్రయత్నించండి మరియు మీ పెంపుడు జంతువుతో ఆనందంగా గడపండి.

English summary

Tips On How To Clean Your Home If You Have Pets

There is nothing interesting than having a pet in the house. The way they care for you, no one else will.Dogs are man's best friend and you will never disagree to this statement if you are a pet owner.
Story first published: Tuesday, May 12, 2015, 9:16 [IST]
Desktop Bottom Promotion