For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎక్కువ కాలం జీవించే టాప్ 10 శునక జాతులు

By Super
|

ప్రపంచ వ్యాప్తం గా శునకాలే ఇష్టమైన పెంపుడు జంతువులు.చాలా మంది వాటిని తమ కుటుంబం లో ఒకరిగా భావిస్తారు.దాదాపు శునక యజమానులందరికీ ఒకే ప్రశ్న ఉదయిస్తుంది, “నా శునకం ఎంత కాలం బ్రతుకుతుంది?” ఎక్కువ కాలం జీవించే శునకాలనే పెంచుకోవడానికి యజమానులు ఇష్టపడుతుంటారు.శునక జాతులలో కనీసం 10 జాతులు చాలా కాలం జీవిస్తాయి.

శునకాల జీవిత కాలం చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది.యజమానుల ప్రేమ, తీసుకునే శ్రద్ధతో పాటు వాటి జీవిత కాలం యే జాతికి చెందినది అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది.సాధారణం గా శునక జీవిత కాలం 12 లేదా 13 సంవత్సరాలు. కానీ కొన్ని జాతులు అంత కంటే ఎక్కువే జీవిస్తాయి.

సంకరజాతికి చెందిన శునకాలు ఎక్కువ కాలం జీవిస్తాయి,క్రింద ఇచ్చిన 10 జాతులకి చెందిన శునకాల జీవిత కాలం సాధారణ శునకాల కంటే ఎక్కువ.మీరు శునకాన్ని పెంపుడు జంతువు గా చేసుకునే ముందు ,వాటి జీవిత కాలాన్ని కూడా పరిగణ లోకి తీసుకోవాలి.ఒకోసారి మీ శునకం దాని సాధారణ జీవిత కాలం కంటే కూడా ఎక్కువ రోజులు బ్రతకవచ్చని గుర్తు పెట్టుకోండి.

ఎక్కువ కాలం జీవించే శునక జాతులు చూద్దామా..

1.చీహు ఆ హూఅ :

1.చీహు ఆ హూఅ :

ఎక్కువ కాలం జీవిచే శునక జాతులలో ఇది ఒకటి.ఇవి చాలా చిన్నగా ఉంటాయి.చీహు ఆ హూఅ జీవిత కాలం 15 నుండీ 20 సంవత్సరాలు.పిల్లల పట్ల సాధుస్వభావం కలిగి ఉండటం ఈ చిన్ని శునకాల ముఖ్య లక్షణం.

2. న్యూ గినియా సింగింగ్ డాగ్

2. న్యూ గినియా సింగింగ్ డాగ్

ఇది ఒక అడవి శునకం. దీని జీవిత కాలం దాదాపు 18 సంవత్సరాలు.ఇది అడవి జాతికి చెందినదైనా చాలా మృదుస్వభావం కలిగి స్నేహ పూర్వకం గా ఉంటాయి.ఎక్కువ కాలం జీవించే శునక జాతులలో న్యూ గినియా సింగింగ్ డాగ్ జాతి కూడా ఒకటి.

3. యార్క్ షైర్ టెరియర్:

3. యార్క్ షైర్ టెరియర్:

పరిమాణం లో చిన్నగా ఉండి ఎక్కువ కాలం జీవించే శునకాలలో యార్క్ షైర్ టెరియర్ జాతి ఒకటి.దీని గరిష్ట జీవితకాలం 20 సంవత్సరాలు.శునక ప్రేమికులలో ఈ జాతి అధిక డిమాండ్ కలిగి ఉంటుంది.

4.జాక్ చీ:

4.జాక్ చీ:

ఎక్కువ కాలం జీవించే శునకాలలో జాక్ చీ జాతి శునకాలు ఒకటి.ఇది జాక్ రసెల్ టెరియర్ మరియు చీహు ఆ హూఅ జాతుల సమ్మేళనం.ఈ జాతి కుక్కలు చాలా స్నేహపూర్వకం గా ఉంటాయి.వీటీ జీవిత కాలం 18 సంవత్సరాలు

5. ఆస్ట్రేలియన్ షెపర్డ్:

5. ఆస్ట్రేలియన్ షెపర్డ్:

ఈ జాతి కుక్కలు మేధస్సుతో పాటు హెర్డింగ్(ఇతర జంతువులతో గుంపు గ కలిసి ఉండుట) లక్షణాన్ని కూడా కలిగి ఉంటాయి.వీటి జీవిత కాలం 18 సంవత్సరాలు

6. షింజూ:

6. షింజూ:

చైనా రాజవంశీయులని మెప్పించిన వీటిని రాచ శునకాలు అని కూడా పిలుస్తారు.ఇవి చాలా స్నేహపూర్వకం గా ఉండటం తో పాటు నమ్మకం గా కూడా పనిచేస్తాయి. వీటి జీవిత కాలం 20 సంవత్సరాలు

7.పొమరేనియన్:

7.పొమరేనియన్:

ప్రపంచ వ్యాపం గా ఈ జాతి కుక్కలు బాగా ప్రసిద్ధి.స్నేహపూర్వహం గా ఉండే ఈ జాతి కుక్కలు ఎకువ కాలం అంటే దాదాపు 16 సంవత్సరాలు జీవిస్తాయి.

8.డాక్స్ హుండ్:

8.డాక్స్ హుండ్:

డాక్స్ హుండ్ జాతి కుక్కల పేరు, రూపు సారూప్యత కలిగి ఉంటాయి. ఇవి నిలువుగా పెరుగుతాయి. ఈ జాతి శునకాన్ని పెంచుకుంటే మీరు దాదాపు 15 సంవత్సరాలపాటు వీటి ప్రేమాభిమానాలని పొందవచ్చు.అత్యధిక కాలం జీవించే శునక జాతులలో ఇది కూడా ఒకటి

9.రాట్ చా:

9.రాట్ చా:

చాలా నమ్మకం గా పనిచేసే ఈ జాతి శునకాల జీవిత కాలం 18 ఏళ్ళు.కాని ఇవి ఇతర కుక్కలపట్ల దూకుడు గా వ్యవరించే అవకాశం ఉంది

10. కోకపూ:

10. కోకపూ:

కాకర్ స్పానియల్ మరియూ పూడుల్ జాతుల సమ్మేళనమే కోకపూ.ఇవి మందపాటి బొచ్చు కలిగి 16 సంవత్సరాలవరకూ జీవిస్తాయి.

English summary

Top 10 Longest Living Dog Breeds

Dogs are one of the favourite pets around the world. Many pet lovers consider them as a part of the family. Almost all owners may ask the question “how long will my dog live?”. Most people try to get one which has a long life expectancy. There are at least 10 dog breeds that live the longest.
Desktop Bottom Promotion