For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సరైన పెంపుడు కుక్కని ఎన్నుకోవడానికి 8 మార్గాలు

By Super
|

మీరొక పెంపుడు జంతువుని ఇంటికి తెచ్చుకోవాలనుకుంటున్నారా??పెంపుడు జంతువులు మన జీవితాలని అనందమయం చేసి ఆరోగ్యకర జీవనం గడపడం లో సాయపడతాయి. కానీ వాటిని ఇంటికి తెచ్చుకునే ముందు కాస్త ఆలోచించండి.మన మనస్సు బాగోలేనప్పుడు ఇవి మనల్ని నవ్వించి మనసు తేలికపడేటట్లు చేస్తాయి.

కుక్కలు, పిల్లులు,ఇంకా చెప్పాలంటే బల్లులు కూడా క్యూట్ గా ఉంటాయి. అలా అని ఏ జంతువైనా మీ జీవన విధానానికి సరిపోతుందనుకోవడం పొరపాటు. ఒక పెంపుడు జంతువు ని పెంచుకోవాలనుకున్నాపుడు చాలా విషయాలని దృష్టిలో ఉంచుకోవాలి. మనకి అనువైన పెంపుడు జంతువుని ఎంచుకోవడానికి కొన్ని మార్గదర్శక సూత్రాలివిగో.

మీకు ఏ రకమైన జంతువంటే ఇష్టం

మీకు ఏ రకమైన జంతువంటే ఇష్టం

అసలు మీకు ఏ రకమైన జంతువంటే ఇష్టమో నిర్ణయించుకోవాలి.మీకు పిల్లి, కుక్క లుఇష్టముండచ్చు. లేదా హ్యాంస్టర్ అనబడే చిట్టెలుక,చేప,తాబేలు,కప్ప, గినియా పిగ్ నచ్చచ్చు లేదా ఒక పాముని పెంచుకోవాలి అని మీకెప్పుడూ అనిపిస్తూ ఉండచ్చు.మీకు ఏ రకమైన జంతువంటే ఇష్టమో నిర్ణయించుకున్నాకా దానిని ఇంటికి తెస్తే కలిగే లాభ నష్టాలని బేరీజు వేసుకున్నాకే దేనిని ఇంటికి తీసుకురావాలో నిర్ణయించుకోవాలి.

.ఎక్కడ నుండి తెచ్చుకోవాలి

.ఎక్కడ నుండి తెచ్చుకోవాలి

మీకు ఏది ఇష్టమో నిర్ణయించుకున్నాకా ఎక్కడ నుండి తెచ్చుకుందామనుకుంటున్నారో ఆలోచించాలి.పెంపుడు జంతువులు చాలా చోట్ల లభిస్తాయి.కొంతమంది స్వచ్చందం గా జంతువులని పెంచుకోవడానికిస్తుండొచ్చు. దగ్గరలోని పెట్ స్టొర్ లేదా జంతువులకి ఆశ్రయం ఇచ్చే చోటికి వెళ్ళచ్చు.పెట్ స్టోర్ యజమానులు లేదా ఆశ్రయ సంస్థ నిర్వాహకులతో వివిధ రకాల జంతువుల గురించి కూలంకుషం గా చర్చించాలి.జంతువులని దత్తత తీసుకోవడం ఉత్తమం కానీ కొన్ని జంతువులని దత్తత తీసుకోవడం కుదరదు.

జంతువుల ఆరోగ్యం

జంతువుల ఆరోగ్యం

మీరు ఎక్కడనుండి పెంపుడు జంతువుని తెచ్చుకోవాలన్నా సరే ముందు వాటి ఆరోగ్యాన్ని పరీక్షించడం ముఖ్యం.పశువైద్య నిపుణులతో పరీక్షింపచేయడంతో పాటు మీరు కూడా దానిని కాస్త తేరిపారా చూసి, దాని కళ్ళు లేదా ముక్కులోచి స్రావాలేమైనా వస్తున్నాయేమో, లేదా తుమ్ములు దగ్గులు వంటివేమైనా ఉన్నాయా,అది ఎలా తిని తిరుగుతోంది, కడుపుకి సంబంధించిన సమస్యలేమైనా ఉన్నాయేమో గమనించాలి.ఒక వేళ ఏదైనా సస్య ఉండి,ఆ సమస్య కి వైద్యం చేయించాలనుకుంటున్నారా?? ఆలశ్యమెందుకు,మనిషినైనా జంతువునైనా రక్షించడమే మీరు చేసే ఉత్తమ కార్యం.ఇలా చేస్తే ప్రపంచాన్ని నివశించడానికి మరింత అనువైన ప్రదేశం గా మార్చినవాళ్ళవుతారు.

ప్రణాళిక

ప్రణాళిక

మీకు ఏ పెంపుడు జంతువంటే ఇష్టమో నిర్ణయించుకున్నారు కదా. మరిప్పుడు వాటిని జాగ్రత్తగా ఎలా చూసుకోవాలో ఆలోచించాలి.ప్రతీ పెంపుడు జంతువు కీ సరైన శ్రద్ధ,పోషణ అవసరం.పశు వైద్య నిపుణుడు లేకుండా మీరొక్కరి వల్లే ఇది సాధ్యం కాదు. కొన్ని జంతువులకి కొన్ని రకాల రోగాలు రాకుండా టీకాలు వేయించాలి.కొన్ని జంతువులలో పునరుత్పత్తి అవయవాలని తొలగించాల్సి ఉంటుంది.మీ పెంపుడు జంతువు కి ముందుగానే భీమా తీసుకోండి.

జీవితాంతం పోషణ కి సిద్ధమేనా

జీవితాంతం పోషణ కి సిద్ధమేనా

పెంపుడు జంతువుల జీవిత కాలం అన్నింటిలో ఒకేలా ఉండదు.కానీ చాలా మటుకు ఎక్కువ కాలమే జీవిస్తాయి.చేపలు,హ్యాంస్టర్ అనే చిట్టెలుక విషయం కాదు కాదీ సాధారణం గా కుక్కలు,పిల్లులు ,పక్షులు దీర్ఘకాలం జీవిస్తాయి. కొన్ని కుక్కలు 15 నుండీ 20 సంవత్సరాలపాటు బ్రతికితే,కొన్ని రకాల రామచిలుకలు 80 సంవత్సరాలు,చిట్టెలుకలు ఒక సంవత్సరం పాటు జీవిస్తాయి.కానీ కొన్ని రకాలా చేపలు గంటలోపే మరణిస్తాయి.వాటి జీవితాంతం మీరు వాటిని శ్రద్ధగా చూసుకోగలరో లేదో ఆలోచించండి.

సమయం

సమయం

ప్రతీ పెంపుడు జంతువు కీ కొంత సమయం కేటాయించాలి.ఇంట్లో పెంపుడు జంతువుందంటే పిల్లలున్నట్లే.సహనం తో ఉండి వాటికి తగిన సమయం కేటాయిస్తూ మీ బాధ్యతలని కూడా నిర్వహించగలరో లేదో చూసుకోవాలి.కుక్కలు,పిల్లులు,కుందేళ్ళకి మూత్ర,మల విసర్జనల కి ఓపికగా,తగినంత సమయం వెచ్చించి శిక్షణ ఇవ్వవలసిఉంటుంది.వీటన్నింటికీ మీ దగ్గర తగిన సమయం ఉందంటేనే పెంపుడు జంతువు ని ఇంటికి తెచ్చుకోవడానికి ఆలోచించాలి.

.పెంపుడు జంతువుల సంరక్షణ

.పెంపుడు జంతువుల సంరక్షణ

పైన చెప్పినట్లు ఏ జంతువుకైనా సంరక్షణ చాలా అవసరం.మీ అంతట మీరు తెలుసుకోవడం ద్వారానో లేదా పశు వైద్య నిపుణుడిని సంప్రదించో పెంపుడు జంతువుల సంరక్షణ గురించి తెలుసుకోవాలి.దీనివల్ల మీకు మీ పెంపుడు జంతువు కి కావాల్సిన పోషకాహారం,సరైన రీతిలో సంరక్షించడం,వాటి నివాసం ఎక్కడ ఎలా ఏర్పాటు చెయ్యాలో తెలుసుకోగలరు.

మీ పెంపుడు జంతువు గురించి తెలుసుకోండి

మీ పెంపుడు జంతువు గురించి తెలుసుకోండి

మీరు ఒక పెంపుడు జంతువు ని ఇంటికి తెచ్చీ తేగానే అది మీకు ప్రేమతో మచ్చికైపోతుందని ఊహించుకోవద్దు.దానికి కాస్త సమయం పడుతుంది.ఒక్కోసారి మీ ఇంటికి వచీ రాగానే మీ పెట్ మిమ్మల్ని నీడలా అంటి పెట్టుకుని ఉండవచ్చు. ఆలా అయితే దానితో ఆడుకుని,మరింత సమయం వెచ్చించి దాని గురించి మరింత తెలుసుకోండి.అందువల్లా మీరిద్దరూ ఒకరికొకరు బాగా అలవాటవుతారు.

English summary

8 Wise Ways to Choose the Right Pet

Want to have a furry friend? Think twice before you get one home. Pets make our lives happier and healthier. They can make us smile and feel better, when we feel so awful inside.
Story first published: Monday, February 22, 2016, 18:02 [IST]
Desktop Bottom Promotion