For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పెంపుడు జంతువు ఆహారం తినకపోవటానికి కారణాలు

By Super
|

యజమానులు తమ పెంపుడు జంతువులకు ఆహారాన్ని అందిస్తారు. అవి ఆహారాన్ని తీసుకోకపోతే వారు చాలా బాధ పడతారు. చాలా సార్లు పెంపుడు జంతువులు ఆహారాన్ని కొంచెం మాత్రమే తీసుకోని ఆ తర్వాత తినటం మానేస్తాయి.

ఈ సమయం 24 గంటల కంటే ఎక్కువగా ఉంటే మాత్రం పెంపుడు జంతువులను తనిఖీ చేసి, పెంపుడు జంతువులు ఆహారాన్ని ఎందుకు తీసుకోవటం లేదో గుర్తించి సరైన కారణాలను అన్వేషించాలి.

పెంపుడు జంతువులలో ఆకలి లేకపోవటాన్ని అనోరెక్సియా అని అంటారు. అయితే అనోరెక్సియా అనేది మనుషుల్లో కన్నా జంతువుల్లో బిన్నంగా ఉంటుంది. ఈ సమస్య అనేది జంతువులలో కొన్ని కారణాల వల్ల సంభవిస్తుంది.

కొన్ని సమయాల్లో ఈ సమస్యను వైద్య పరంగా మరియు పిజికల్ గా కూడా నయం చేయవచ్చు. కాకపోతే కొంత పరిశీలన అవసరం. ఇవన్నీ ఉంటె తొందరగానే ఈ సమస్యను నయం చేయవచ్చు.

పెంపుడు జంతువులలో అనోరెక్సియా అనేది వాటి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. అంతేకాక పెంపుడు జంతువుల ఆకలి మీద కూడా ప్రభావం ఉంటుంది. మీ పెంపుడు జంతువు ఈ సమస్యతో బాధ పడుతూ ఉందని భావించినప్పుడు, మీరు తప్పక తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.

పెంపుడు జంతువులు తినే పద్దతిపై ఒక కన్నేసి ఉంచాలి. ఇప్పుడు పెంపుడు జంతువులు తినకపోవటానికి గల కారణాలను తెలుసుకుందాం.

1. జంతువులకు పెట్టె మానవ ఆహారం పట్ల జాగ్రత్త తీసుకోవాలి

1. జంతువులకు పెట్టె మానవ ఆహారం పట్ల జాగ్రత్త తీసుకోవాలి

మానవ ఆహారం పెంపుడు జంతువులకు బాగా ఇష్టంగా ఉన్నప్పటికీ, రోజులో వాటికీ పెట్టె ఆహారంలో మానవ ఆహారం 25 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. మీరు తరచుగా మానవ ఆహారాన్ని పెట్టటం వల్ల పెంపుడు జంతువుల ఆహారాన్ని తినటానికి ఇష్టం చూపదు. అందువల్ల పెట్ ఆహారాన్ని తినకుండా ఉండిపోతుంది.

2. మానవ ఆహారం కారణంగా కడుపు నొప్పి

2. మానవ ఆహారం కారణంగా కడుపు నొప్పి

మానవ ఆహారం అలవాట్లు ఉన్నప్పుడు పెంపుడు జంతువుల జీర్ణ వ్యవస్థలో లోపాలు వస్తాయి. స్పైసి ఆహారాలు,ఎక్కువ తీపి మరియు పాల ఆహారాలను పెంపుడు జంతువులకు పెట్టినప్పుడు వాటిలో అతిసారం మరియు కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఈ కారణం వల్ల కూడా పెంపుడు జంతువులు తినటం మానేస్తాయి.

3. దంత సమస్యలు ఏమైనా ఉన్నాయేమో అని తనిఖీ

3. దంత సమస్యలు ఏమైనా ఉన్నాయేమో అని తనిఖీ

మీ పెంపుడు జంతువులకు చిగుళ్ళ మరియు దంతాల సమస్యలు కూడా ఒక కారణం కావచ్చు. పెంపుడు జంతువులకు తరచుగా ఆకలి లేకపోతే వాటి వెనక ఉన్న కారణాలను అన్వేషించాలి. దంత సమస్యల కారణంగా ఆహారం నమలటంలో సమస్యలు రావచ్చు. అందువలన ఈ సమస్యలను గుర్తిస్తే వెంటనే పశు వైద్యుని దగ్గరకు తీసుకువెళ్ళాలి.

4. రోటీన్ బిన్నంగా ఉంటే ఒత్తిడి

4. రోటీన్ బిన్నంగా ఉంటే ఒత్తిడి

పెంపుడు జంతువులకు రోజులో రోటిన్ కి బిన్నంగా ఉంటే వాటికీ ఒక రకమైన ఒత్తిడి కలుగుతుంది. కాబట్టి వాటి రోటిన్ లో ఎటువంటి మార్పులు లేకుండా చూసుకోవాలి.

5. వయస్సు పై బడటం కారణం అవుతుంది

5. వయస్సు పై బడటం కారణం అవుతుంది

వయస్సు ఎక్కువగా ఉన్న పెంపుడు జంతువు తినటానికి కొంత అసౌకర్యం ఉండవచ్చు. కాబట్టి వృద్ధాప్యం కారణంగా వచ్చే సమస్యలను నివారించటం ముఖ్యం. ఈ పరిస్థితిలో, మీరు ఒక వెట్ అభిప్రాయం కోరుకోవాలి. అలాగే పెంపుడు జంతువు తినే సౌలభ్యం కోసం పెంపుడు జంతువు ఆహారంలో కొన్ని మార్పులు తీసుకురావలసిన అవసరం ఉంది.

6. ప్రవర్తనలో సమస్యలు

6. ప్రవర్తనలో సమస్యలు

కొన్ని సార్లు పెంపుడు జంతువులు తినకుండా ఉండటానికి ఇంటిలో ఉండే ఇతర పెంపుడు జంతువులు కారణం కావచ్చు. ఈ ప్రవర్తన సమస్య ఉన్నప్పుడు మీ పెంపుడు జంతువుకు ఒంటరిగా ఆహారం పెట్టాలి.

7. ప్రేగుల్లో వర్మ్స్ సమస్యలు

7. ప్రేగుల్లో వర్మ్స్ సమస్యలు

ప్రేగుల్లో వర్మ్స్ సమస్యలు ఉంటే అనోరెక్సియా కి కారణం అవుతుంది. ఇటువంటి పురుగుల నుండి పెంపుడు జంతువులను రక్షించాలి. ఈ సమస్య నుండి బయట పడాలంటే అపరిశుభ్ర పరిస్థితులు, జన సమూహం, ఒత్తిడితో కూడిన పరిసరాలు , తక్కువ నాణ్యత కలిగిన పెంపుడు ఆహారాలు లేదా అక్రమ పరిమాణంలో పెంపుడు ఆహారాలు వంటి పరిస్తితులు లేకుండా జాగ్రత్త పడాలి.

English summary

Reasons Why Your Pet Is Not Eating

Pet owners are accustomed to their pets instantly gobbling off the food as soon as it is offered to them. Hence, it is obvious for people to be bothered when their pets do not eat their meals.
Story first published: Wednesday, May 25, 2016, 17:57 [IST]
Desktop Bottom Promotion