Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
ఇంట్లో మొక్కలు పెంచుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఇంట్లో మొక్కలు పెంచుకోవడం అంటే చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది. అవి ఇంటికి సహజ సౌందర్యాన్ని తీసుకువస్తాయి. ఇల్లు చూడటానికి పచ్చగా కలకలలాడుతుంది. ఇంట్లో మొక్కలు పెంచుకోవడం ద్వారా కేవలం ఆకర్షణగా మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. ఇండోర్ ప్లాంట్స్ వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు. ఇంట్లో మొక్కలు పెంచడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది:
పచ్చని మొక్కలతో సమయం గడపడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుందని పలు పరిశోధనలు తేల్చాయి. మొక్కల్లో ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ తక్కువ స్థాయిలో ఉంటుంది. దాని వల్ల ప్రశాంతత, విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. అందువల్లే ఈ మధ్య చాలా ఆసుపత్రులు తమ డిజైన్లలో మార్పులు చేసి మరీ మొక్కల పెంపకంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు.
2. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
ఇండోర్ మొక్కల పెంచుకోవడం వల్ల ఒత్తిడి స్థాయిలను చాలా వరకు తగ్గించుకోవచ్చు.మొక్కల చుట్టూ ఉండడం వల్ల మీరూ చాలా ప్రశాంతంగా ఫీలవుతుంటారు. దీని వల్ల ఒత్తిడి తగ్గడమే కాదండోయ్ జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
3. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
ఇంట్లో మొక్కలు ఉండడం వల్ల రోగనిరోధక వ్యవస్థను పెంచుకోవచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మొక్కలుపైటో సైడ్లను విడుదల చేస్తాయి. ఇవి హానికరమైన బ్యాక్టీరియా మరియు వైరస్ లతో పోరాడడానికి సహాయపడే సహజ రసాయనాలు. మీ ఇంట్లో మొక్కలు ఉండడం వల్ల మీరు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలను తగ్గించుకోవచ్చు.
4. మెరుగైన నిద్ర
మొక్కలు ఒత్తిడిని తగ్గిస్తూ.. విశ్రాంతిని ప్రోత్సహిస్తాయి. లావెండర్ సహా జాస్మిన్ తో సహా కొన్ని మొక్కలు మంచి నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడే ఉపశమన ప్రభావాలను కల్గి ఉంటాయి.
కాబట్టి మీరు ఇంట్లో, ఇంటి ఆవరణలో వీలైనంత ఎక్కువగా మొక్కలను పెంచుకోండి. మీ మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని బాగు చేసుకోండి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
