Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
మీ ఇంటి పెరట్లోనే పుచ్చకాయ సాగు..ఈ చిట్కాలతో అద్భుతాలు
ఎండాకాలం ప్రారంభం నుంచి రోడ్ల మీద ఎక్కడ చూసినా పుచ్చకాయలు అమ్మేవాళ్లు కనబడుతుంటారు. మండే ఎండల్లో చల్లని పుచ్చకాయ తింటుంటే కడుపు చల్లగా హాయిగా ఉంటుంది. పుచ్చకాయల్లో 90శాతం వరకు నీరే ఉంటుంది కాబట్టి సమ్మర్ లో ఇది మనల్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోడానికి పర్ఫక్ట్ ఫ్రూట్. పుచ్చకాయలతో జూస్ లు, స్మూతీలు అనేక రకాల వంటకాలు కూడా తయారుచేస్తుంటారు. పుచ్చకాయ తొక్కతో చేసే పచ్చడి అయితే టేస్ట్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది.
అయితే పుచ్చకాయలను కొనుక్కునే బదులు మీ ఇంటి గార్డెన్ లోనే లేదా మీ పెరట్లోనో లేదా దొడ్లోనే వాటిని ఈజీగా పండించుకోవచ్చు. చాలామంది అవి ఇంటి పెరట్లో పెరగవని పోరబడుతుంటారు. వాస్తవానికి ఇంటి పెరట్లో కూడా వాటిని పెంచుకోవచ్చు. మన వాతావరణం దానికి పూర్తిగా అనువైనదిగా ఉంటుంది. అయితే పుచ్చకాయలను ఇంటి పెరట్లో పెంచుకోడానికి కొన్ని చిట్కాలను పాటించడం తప్పనిసరి. అవేంటో ఇక్కడ చూడండి.

విత్తనాలు
ముుందుగా అసలు మంచి విత్తనాలను సిద్ధం చేసుకోవాలి. మీరు తిన్న పుచ్చకాయలను విత్తనాలు అయినా లేదా మీ ప్రాంత వాతావరణానికి అనువైన పుచ్చకాయ విత్తనాలను మీరు మార్కెట్ నుంచి లేదా నర్సరీ నుంచి కొనుగోలు చేయవచ్చు. విత్తనాలు రెడీ చేసుకున్నాక మీ పెరట్లో రోజులో కనీసం 8 గంటలు సూర్యకాంతి పడే చోటు సెలక్ట్ చేసి అక్కడ విత్తనలను భూమిలో పెట్టాలి. అదేవిధంగా పెరిగే పుచ్చకాయ మొక్క తీగలు బాగా పాకడానికి, వేర్లు విస్తరించడానికి తగినంత స్థలం ఉండేలా విత్తనాలు విత్తాలని గుర్తుపెట్టుకోండి.
మట్టి
పుచ్చకాయలకు కొద్దిగా ఆమ్ల గుణం ఉన్న నేలలు ఇష్టం. మొక్క వేర్లు స్వేచ్ఛగా గాలి పీల్చుకోవడానికి, తోట మట్టి, కంపోస్ట్, కొద్దిగా ఇసుక కలిపిన మిశ్రమాన్ని సిద్ధం చేసుకోండి. మొక్క ఆరోగ్యంగా, బలంగా పెరగడానికి ఆవు పేడ లేదా సేంద్రియ ఎరువులను ధారాళంగా కలపండి. ఇదే మీ పంటకు బలాన్నిస్తుంది.
క్రమం తప్పకుండా నీళ్లు
మొక్కలకు నీరు పోయడం తేలికైన పనే అయినా ఇక్కడే ఓ చిన్న కిటుకు ఉంది. ముఖ్యంగా పూత, కాయలు కాసే స్టేజ్ లో ఉన్నప్పుడు నీరు వేర్ల వరకు చేరేలా లోతుగా నీరు పెట్టాలి. అదే సమయంలో, నీరు నిలిచి వేర్లు కుళ్లిపోకుండా జాగ్రత్తపడాలి. వర్షాకాలంలో ఇది చాలా ముఖ్యం.
పరాగసంపర్కం
కొన్నిసార్లు సహజంగా పరాగసంపర్కం జరగనప్పుడు కాయలు ఏర్పడవు. అప్పుడు మీరే పరాగసంపర్కరం చేయించాలి. ఆడ పువ్వులను గుర్తించడం సులభం. వాటి కింద చిన్న పిందె (బల్బ్) ఉంటుంది. ఒక ఇయర్ బడ్ సహాయంతో మగ పువ్వులోని పుప్పొడిని సేకరించి ఆడ పువ్వు అండాశయంపై సున్నితంగా రాయండి. ఈ ప్రక్రియను ఉదయం పూట చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.
కోత సమయం
సుమారు మూడు నెలల మీ ఓపిక, శ్రమ ఫలించే సమయం రానే వస్తుంది. పుచ్చకాయ అడుగు భాగం నేలకు ఆనుకుని ఉన్నచోట తెల్లగా కాకుండా, లేత పసుపు రంగులోకి మారినప్పుడు అది కోతకు సిద్ధమైనట్టు లెక్క. సరైన సమయంలో కోయడం చాలా ముఖ్యం. ఆలస్యం చేస్తే పండు అతిగా పండిపోయి రుచి తగ్గే ప్రమాదం ఉంది.



Click it and Unblock the Notifications