Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఈ వేసవిలో ఈ మొక్కలను తప్పకుండా ఇంటికి తెచ్చుకోవాలి..!
ఇంట్లో మొక్కలను పెంచుకుంటే ఇంటి మాత్రమే అందం కాదు, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. రోజూ వాటికి నీళ్లు పసి, వాటిని పూసిన పూలను చూస్తుంటే కలిగే తృప్తి ఆనందం మాటల్లో చెప్పలేనిది. మొక్కల వల్ల ఆక్సీజన్ స్థాయి కూడా పెరుగుతుంది. అయితే ఈ వేసని సందర్భంగా మీకు కొన్ని రకాలు మొక్కలను పరిచయం చేస్తున్నాం. వీటిని ఇంట్లోకి తెచ్చుకొని పెంచుకుంటే ఈ వేసవి ఆనందమయంగా గడుస్తుంది.
మాన్స్‌టెరా
ఈ మొక్క చూడ్డానికి ఓ వింతలా ఉంటుంది. వీటి ఆకులు ఎవరో కట్ చేసినట్లుగా కనిపిస్తాయ్. ఇవి ఎండవేడిని తట్టుకొని కొన్ని నీళ్లతో బాగా పెరగగలవు. సుమారు 10 ఫీట్ల వరకు ఈ మొక్కలు పెరుగుతాయ్.

షెఫ్లెరా మొక్కలు
ఇక షెఫ్లెరా మొక్కలును పెంచుకుంటే వాటిని చూస్తూ కాలక్షేపం చేసేయవచ్చు. ఎందుకంటే ఇవి చూడటానికి చాలా ముచ్చటగా ఉంటాయ్. ఈ మొక్కలు గొడుగులా ఉంటాయ్ కాబట్టి వీటిని గొడుగు మొక్కలని కూడా అంటారు. ఎప్పటికప్పుడు నీరు పోసి సరిపడా మట్టి ఉంటే 8 ఫీట్ల వరకు పెరుగుతాయ్.

క్రోటన్
క్రోటన్ మొక్కలను చాలా మంచి పెంచుకుంటూ ఉంటారు. ఎరుపు, పచ్చ, పింక్ రంగుల్లో ఈ మొక్కలు చాలా ఆకర్షనీయంగా ఉంటాయ్. వీటికి అనువుగా ఉండే తొట్టిలో పెటి పెంచాలి.

కలబంద
అలొవెరా మొక్కలు దాదాపు చాలా మంది ఇళ్లల్లో చూసే ఉంటాం. మొక్కలను పెంచే అలవాటు ఉన్నవారి ఇంట్లో ఈ కలబంద చెట్లు ఖచ్ఛితంగా ఉంటాయ్. నీరు లేకపోయినా ఈ మొక్కలు బాగా పెరుగుతాయ్. వీటిలో ఔషధ గుణాలే కాదా ఇంటిని కూడా ఆకర్షణీయంగా కనిపించే విధంగా ఉంటాయ్.

రబ్బర్ మొక్కలు
ఈ రబ్బర్ మొక్కలను కూడా ఈ వేసవిలో ఇంటికి తెచ్చుకుంటే బాగా పెరుగుతాయ్. ఈ ఎండాకాలంలో వాతావరణాన్ని తట్టుకొని పెరగ్గలిగే సామర్ధ్యం వీటికి ఉంటుంది. అయితే వీటికి రెగులర్‌గా నీటిని అందిస్తూనే ఉండాలి.




Click it and Unblock the Notifications