Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఇంటిని ఇలా ఉంచుకుంటే చాలట.. మానసిక ప్రశాంతత మీ చెంతనే ఉంటుంది!
నేటి బిజీ లైఫ్‌లో కోట్లు కుమ్మరించినా దొరకని విలువైనది ఏదైనా ఉందీ అంటే అది మానసిక ప్రశాంతత మాత్రమే. ఉదయం నిధ్ర లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకూ జీవితం క్షణం తీరిక లేకుండా పోయింది. అలాంటి జీవన శైలి ఎప్పటికైనా ప్రమాదాన్ని చెంతకు చేరుస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. మరి అలాంటి బిజీ లైఫ్‌లో కూడా మానసిక ప్రశాంతను చేరువ చేసుకునేందుకు ఎలాంటి చిట్కాలు పాటించాలి. ఒత్తిడిని చిత్తు చేసే లైఫ్ స్టైల్ టిప్స్ ఏమైనా ఉన్నాయా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. కొన్ని నియమాలు పాటించడం ద్వారా దూరమవుతోన్న ప్రశాంతతను దగ్గర చేసుకోవచ్చట. మరెందుకు ఆలస్యం.. అలాంటి కొన్ని టిప్స్‌ను చూసేద్దామా?!
మన భారతీయ సంప్రదాయం ప్రకారం ఇంట్లో ప్రశాంతంగా ఉండాలంటే.. వాస్తు కొన్ని మార్పులు తప్పనిసరిగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి, భారతీయ వాస్తు శాస్త్రం ప్రకారం మన జీవనశైలి మార్పుకు ఇంటి వాతావరణం ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇంటి నిర్మాణ శైలితోపాటు ఇంట్లో వినియోగించే వస్తువులు కూడా మన జీవన ప్రమాణాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయట. అంచేత, మానసిక ప్రశాంతత కోసం ఇంట్లో ఉపయోగించే వస్తవులు, వాటిని అమర్చే ప్రదేశాలపైన ప్రత్యేక శ్రద్ధ అవసరమని సూచిస్తున్నారు.

- ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అప్యాయతను పెంచేందుకు అమెథిస్ట్, రోజ్ క్వార్ట్జ్ వంటివి ఉంచడం శ్రేయస్కరం. ఎందుకంటే, ఇలాంటి కొన్ని రకాల రాళ్లకు వైద్యం చేసే లక్షణాలు ఉంటాయట. ఉదాహరణకు పద్మ రాగాన్ని ఇంట్లో ఉంచుకోవడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు.
- ఇంటి పరిసరాలు నిత్యం వెలుతురుతో ఉండేలా చూసుకోవాలి. ఇంట్లోకి సూర్య కాంతి, స్వచ్ఛమైన గాలి వచ్చేలా డిజైన్ చేసుకోవడం ఎంతో మంచిది. ఇందుకు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఇంట్లోకి గాలి, వెలుతురు తగలడం వల్ల హానికరమైన బ్యాక్టీరియా, వైరస్, కీటకాల బారిన పడకుండా ఉండొచ్చు. ఆరోగ్యకరమైన వాతావరణం మన మానసిక స్థితిని మెరుగు పరుస్తుంది. అలాగే, ప్రశాంతమైన నిద్ర కోసం పడక గదిలో ఈశాన్య దిశలో తల పెట్టి పడుకోవడం శ్రేయస్కరం.
-నెగిటివ్ ఎనర్జీని పెంపొందించే వస్తువులను ఇంట్లో ఉండకుండా చూడాలి. వీటి వలన మానసిక ప్రశాంతత దూరమవ్వడమే కాకుండా.. కుటుంబ సభ్యుల మధ్య వైరాలు, మనస్పర్థలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.
- ఇంటి పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉంచుకునేలా చూడాలి. దీని వలన ఇంట్లో అడుగుపెట్టగానే ఒక రకమైన ప్రశాంత వాతావరణంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. అలా కాకుండా ఇంటిని గందరగోళంగా ఉంచడం వల్ల మన మానసిక పరిస్థితి కొంత ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications