Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
Vastu Tips: ఈ వాస్తు దోషాల వల్ల సంతానం కలగడం కష్టమే!
Vastu Tips: ఇల్లు, కార్యాలయాలు, పెద్ద పెద్ద భవంతులు కట్టేటప్పుడు వాస్తు చూస్తారు. ఏ దిక్కులో ఏది ఉండాలన్నది పక్కాగా ప్లాన్ చేస్తారు. ఈ మధ్యకాలంలో చాలా మందికి వాస్తు స్పృహ పెరిగింది. వాస్తు యొక్క ప్రాముఖ్యతను అందరూ అర్థం చేసుకుంటున్నారు.

ఇంట్లో చిన్న వాస్తు దోషాల వల్ల ఇంటిల్లిపాది సమస్యలు ఎదుర్కొంటారని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఆరోగ్య సమస్యలు వస్తాయని పండితులు వివరిస్తున్నారు. వాస్తు దోషాల వల్ల ఆరోగ్యంపైనా ప్రభావం పడినట్లుగానే, గదుల స్థానం వల్ల సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుంది. కొన్ని దోషాల వల్ల ఆ ఇంట్లో ఎవరూ సంతానం పొందలేరు. ఏళ్ల తరబడి సంతానం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది.

సంతానోత్పత్తి సమస్యలకు వాస్తు చిట్కాలు:
* వివాహిత జంట ఎప్పుడూ బెడ్‌రూములో ఆగ్నేయ భాగంలోనే పడుకోవాలి. ఎందుకంటే అది అగ్ని మూలకంతో అనుసంధానించబడి ఉంటుంది. ఇది మంచి శృంగార జీవితాన్ని కలిగి ఉండేందుకు సహకరిస్తుంది. అలాగే గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
* ఎల్లప్పుడూ మీ తల దక్షిణం వైపు, పాదాలు ఉత్తరం వైపు ఉంచే నిద్రపోవాలి.
* తల పడమర వైపు, పాదాలు తూర్పు వైపు ఉంచినా మంచిదే.
* బెడ్‌రూము లోపల సానుకూల ఆకర్షణల వాతావరణాన్ని కల్పించాలి.
* అందమైన ల్యాండ్ స్కేప్‌లు, పెయింటింగ్‌లు, చిన్న పిల్లల ఫోటోలు అంటించవచ్చు. ఇది కళ్లకు ఆహ్లాదకరంగా ఉంటుంది.
* సువాసనగల పువ్వులను కూడా పడకగదిలో ఉంచుకోవచ్చు.
* మీ జీవిత భాగస్వామిని గుర్తు చేసే వస్తువులను కనిపించే చోట పెట్టుకోవాలి.
* బెడ్‌రూములో నాణ్యమైన సమయాన్ని గడపాలి. బెడ్రూమ్ అంటే దంపతులది. అక్కడ మీకు సంబంధించిన విషయాలు మాత్రమే చర్చించుకోవాలి.

గర్భధారణ సమయంలో పాటించాల్సిన వాస్తు చిట్కాలు:
* గర్భిణీ స్త్రీలు బిడ్డపై ఆశావాద ప్రభావాన్ని చూపుతారు కాబట్టి గర్భధారణ సమయంలో ప్రేరణాత్మక సినిమాలు చూడటం, మంచి పుస్తకాలు, మ్యాగజైన్‌లు చదవడం మంచిది.
* గర్భిణీలు రోజు ఈశాన్య దిశలో ధ్యానం చేయాలి.
* గర్భం కోసం పడకగది వాస్తు శాస్త్రానికి సంబంధించి, పడకగదిలోని అనవసరమైన వస్తువులను తీసేయ్యాలి. గదిలో ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
* పడక గది ప్రశాంతంగా, సానుకూల భావన కలిగే విధంగా అలంకరించుకోవాలి.

గర్భం దాల్చినప్పుడు చేయకూడని పనులు:
* పడకగదిలో ఎలక్ట్రానికి గాడ్జెట్స్‌ను ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. వాటి నుండి వెలువడే లైట్ వల్ల నిద్రలేమి సమస్య తలెత్తుతుంది.
* పడకగదిలోని అద్దం ఎప్పుడూ మంచానికి ఎదురుగా ఉండకూడదు. ఎందుకంటేదాని ప్రతిబింబం నిద్ర విధానాలకు భంగం కలిగించడమే కాకుండా లైంగికతపై ప్రభావం చూపుతుంది.
* గర్భిణీలు ముదురు ఎరుపు, నలుపు మరియు ఆరెంజ్ వంటి ముదురు రంగులను ధరించవద్దు. పాస్టెల్ ఆకువచ్చ, నీలం, పసుపు, తెలుపు వంటి లైట్ కలర్స్ వేసుకోవచ్చు.
* బెడ్‌రూములో హింస, యుద్ధం, డ్రాగన్‌లు లేదా ఏదైనా ప్రతికూల అంశాల పెయింటింగ్‌లను ఉంచవద్దు. ఉంటే తీసేయడం మంచిది.
* దంపతుల మధ్య నిరాశావాదాన్ని ప్రభావితం చేసే ఏవైనా భావాలు ఉంటే పడకగది బయటే చూసుకోవాలి.
* రౌండ్ మ్యాట్రెస్ వాడకపోవడం ఉత్తమం.
* బెడ్‌పై లంచ్, డిన్నర్, స్నాక్స్ లాంటి తినకూడదు.
* బెడ్‌పై ఉన్నప్పుడు మందులు లాంటివి తీసుకోవచ్చు కానీ ఆహారం తీసుకోవద్దు.
* పెళ్లి అయిన కొత్త జంటలు బెడ్‌రూములోని ఈశాన్య మూలను ఎట్టిపరిస్థితుల్లో ఉపయోగించవద్దు. ఆ మూలలో ఎలాంటి వస్తువులు పెట్టవద్దు. బరువైన వస్తువులను అక్కడ ఉంచవద్దు.
* బెడ్ లేదా, స్లీపింగ్ సోఫాను ఆగ్నేయ మూలలో మాత్రమే ఉంచాలి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications