Latest Updates
-
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు.. -
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా -
నానా పటేకర్ ప్రాణం తీసింది అదే..చాలామందికి తెలియని విషయం! -
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు! -
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ!
ఒక్క చుక్క నూనె క్రిందపడకుండా బాటిల్లో నింపడం ఎలాగో ఇక్కడ చూడండి? నెట్టింట తెగ వైరల్ అవుతోంది..
ఇంటర్నెంట్ లో ఈ మద్య కాలంలో ప్రతి చిన్న విషయం సెన్సేషన్ అవుతుంటుంది. కొన్ని విషయాలు నెటిజంన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంటాయి. ముఖ్యంగా వంటగది, వరైటి వంటలకు సంబందించి చిట్కాలను చూడటానికి చాలా ఆసక్తి కలిగి ఉంటారు. తాజాగా అలనాటి హీరోయిన్ ముచ్చర్ల అరుణ తన వంటింటి చిట్కాలను షేర్ చేశారు. ముచ్చర్ల అరుణ 1980లో ఫేమస్ నటి. సీతాకోక చిలుక హీరోయిన్ గా బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తెలుగు, తమిళం, మళయాళం మరియు కన్నడలో చాలా సినిమాల్లో నట్టించారు. కాబట్టి, ఆమె మనకు సుపరిచితురాలే. మరి ఇప్పుడు ఆమె చేసిన ఒక చిన్న పని నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం చేసింది, ఎందుకు వైరల్ గా మారిందో ఇక్కడ తెలుసుకుందాం.
నటి ముచ్చర్ల అరుణ ప్యాకెట్ నూనెను బాటిల్లో ఎలా నింపాలో చూపెడుతూ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అది కాస్త వైరల్ గా మారింది. మన రోజువారీ జీవితంలో మనం ఉపయోగించే అనేక అంశాలు ఉన్నాయి, కానీ వాటిని ఎలా ఉపయోగించాలో మనకు తెలియదు. కొన్ని సందర్భాల్లో బాటిల్స్ మూత తియ్యడం ప్యాకెట్లు ఎలా తెరవాలో తెలియక, వాటిలోని పదార్థానలు నేలపాలు చేస్తుంటాం.

మనం సాధారణంగా వారం పదిహేను రోజులు లేదా ఒక నెల సరిపోయే విధంగా కిరాణా సామాగ్రిని లేదా నిత్యవసర వస్తువులును కొని తెచ్చుకుంటాం. కానీ మనం ఒకేసారి అవన్నీఉపయోగించము కాబట్టి, చిన్న డబ్బల్లో రోజువారీ ఉపయోగం కోసం వస్తువులను విడిగా తీసి పెట్టుకోవడం చాలా మందికి అలవాటు. మిగిలిన వాటిని స్టోర్ చేసి పక్కన పెట్టుకుంటారు.
అలాంటి వాటిలో టీ పొడి, పంచదార, నూనె వంటివి. చిన్న డబ్బాల్లో అయిపోయినప్పుడు, స్టోర్ చేసున్నవి నింపుకుంటారు. అయితే ఆ నింపే క్రమంలో క్రింద పడిపోవడం సహజం. ముఖ్యంగా నూనె డబ్బాలోనిది, ప్యాకెట్స్ నుండి బాటిల్స్ లో నింపేటప్పుడు క్రింద పడిపోతే పడిన చోటి మొత్తం జిడ్డుగామారుతుంది. దానిని శుభ్రం చేయడం మరొక అదనపు పని.
అలా జరగకుండా ఉండాలంటే నటి ముచ్చర్ల అరుణ షేర్ చేసి వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. తన ఇన్ స్టాగ్రాంలో ప్యాకెట్ లోని నూనెను బాటిల్లో నింపే విధానం చాలా సులభంగా ఉందని నెటిజన్లు కమెంట్లు పెడుతున్నారు. మరి ఈ చిట్కా ఏంటో మీరు కూడా ఇక్కడ చూసేయండి.
ముందుగా ఒక గాజు బాటిల్ మరియు ఒక గరిట తీసుకుని, ఆ గాజు సీసాలో గరిటెను తలక్రిందులుగా ఉంచారు. తర్వాత ఆయిల్ పాకెట్ తీసుకుని కత్తెరతో కట్ చేసి, గాజుబాటిల్లో పోసారు. గరిట అడ్డుగా ఉండటం వల్ల ఒక్క చుక్క నూనె కూడా క్రింద పడకుండా నూనెను గాజు బాటిల్లో నింపడం చాలా చక్కగా చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆసక్తికరంగా కామెంట్లు పెడుతున్నారు. ఈ వంటగది చిట్కా చాలా సింపుల్ గా అద్భుతంగా ఉండటం వల్ల చాలా మందిని ఆర్షించింది. ఈ వీడియోను చూసిన చాలా మంది ఈ చిట్కాలను ట్రై చేయాలని డిసైడ్ అయిపోయారు. ఈ వీడియో అంతగా వైరల్ అవ్వడానికి ముఖ్యంగా ఆమె చాలా చలాకీగా.. ఫన్నీగా.. వివరించిన విధానం చాలా మంది దృష్టిని ఆకర్షించింది.



Click it and Unblock the Notifications
