Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చాణక్య నీతి : ఇతరులను ఎలా ఆకర్షించాలో మీకు తెలుసా..!
ప్రస్తుతం సమాజంలో, ఉన్న పరిస్థితుల్లో ఎదుటివారిని ఆకట్టుకోవడం చాలా ముఖ్యం. ఉద్యోగంలో, నిత్యజీవితంలో కొందరిని ఆకట్టుకోవడానికి చూస్తాము. వాటి కోసం గూగుల్‌లో గంటల కొద్దీ వెతుకుతాం. కానీ చాణక్యుడు దీని గురించి వందల ఏళ్ల క్రితమే చెప్పాడు. చాణక్యుడు చెప్పిన ఎన్నో నీతి శాస్త్రాల్లో ఇది కూడా ఉంది. ఎదుటివారిని ఆకట్టుకోవడం గురించి చాణక్యుడు ఏమంటున్నాడో ఓసారి తెలుసుకుందాం.

అత్యాశగల వ్యక్తులను చాలా సులభంగా ఆకట్టుకోవచ్చని చాణ్యక్యుడు చెబుతున్నాడు. అత్యాశ గల వక్తులకు ఏదైతే అవసరం ఉందో దాని కంటే కొంచం ఎక్కువ వారికి ఇస్తే చాలా సులభంగా వారిని ఆకట్టుకోవచ్చని అంటున్నాడు.
ఇక ముర్ఖులు ప్రశంసల వల్ల పొంగిపోతారు. వారి గర్వానికి మర్యాద ఇస్తే ఖచ్ఛితంగా మీరు చెప్పిన దానిని అంగీకరిస్తారని చాణక్యుడు అంటాడు. మూర్ఖులు ప్రశంసలకు కూడా సులభంగా పొంగిపోతారు. వారిపై ప్రశంసలు గుప్పించి వాళ్లను సులభంగా దారిలోకి తెచ్చుకోవచ్చు.
బుద్ధిమంతులను మెప్పించడం అంత సులభం కాదు. అలాంటి వారిని మెప్పించాలంటే ఆకర్షించాలంటే వారి ముందు ఏదీ దాచకుండా సత్యాన్ని చెప్పాాలి. నిజం మాట్లాడినప్పుడు మాత్రమే వాళ్లని ఆకర్శించవచ్చని, సత్యానికి అంత బలం ఉందని చాణక్యుడు చెబుతాడు.
డబ్బుకు ప్రాముఖ్యతనిచ్చే వారిని డబ్బుతోనే కొనాలి. వారు ఎంత డబ్బుకైతే లొంగుతారో, వారిపై ఎంత ఖర్చు చేస్తే మనమాట వింటారో.. అంత ఖర్చు చేసి వారిని ఆకట్టుకోవాలి. అప్పుడు మాత్రమే వాళ్లు డబ్బుకు బానిసై దారిలోకి వస్తారు.
ఇతరులను ఎలా ఆకట్టుకోవాలనే కాకుండా నిత్యజీవితంలో ఎలా నడుచుకోవాలనేదానిపైన కూడా చాణక్యుడు నీతివాక్యాలు చెప్పాడు. మనిషికి అందం, ఐశ్వర్యం కంటే విద్య చాలా ముఖ్యమైందని చాణక్యుడు అంటాడు. జీవితంలో అతి నిజాయితీగా ఉండడం కూడా సరైందని కాదని అంటాడు. అతి నిజాయితీగా ఉంటే సమస్యలు వస్తాయి.
మనకు భయం ఎప్పుడు కలిగినా దానిని అసహ్యించుకోవడం ప్రారంభించాలంటాడు. అన్ని పనులూ నిర్భయంగా చేయాలి. అలా చేసినప్పుడు సంతోషంగా ఉంటారు. అత్యాష, దురాశ మంచిది కాదు. ఉన్నదాంట్లోనే తృప్తిగా ఉండేవారే ఆనందంగా ఉంటారని చాణక్యుడు చెబుతున్నాడు.



Click it and Unblock the Notifications