Latest Updates
-
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి!
Dhanteras 2022: ధనత్రయోదశి పూజా ప్రాముఖ్యత, శుభ మహూర్తం, ఆచారాలు
ధనత్రయోదశి ఈ సంవత్సరం అక్టోబర్ 22న రాత్రి 07:00 నుండి 08:17 గంటల మధ్య ధనత్రయోదశి పూజ ముహూర్తాన్ని జరుపుకోనుండగా, పండుగను అక్టోబర్ 23న జరుపుకుంటారు.
Dhanteras 2022: ధనత్రయోదశి అని కూడా పిలువబడే ధంతేరాస్, భారతదేశంలో దీపావళి ప్రారంభానికి గుర్తుగా ప్రతి సంవత్సరం మొదటి రోజుగా జరుపుకుంటారు.
ఐదు రోజుల పాటు జరిగే దీపావళి సంబరాలు ధంతేరాస్ రోజు ప్రారంభం అవుతాయి. ఇది సాధారణంగా కృష్ణ పక్షం యొక్క పదమూడో చాంద్రమాన రోజుతో సమానంగా ఉంటుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం అశ్విని మాసంలో వస్తుంది. ఈ సంవత్సరం, అక్టోబర్ 22న రాత్రి 07:00 నుండి 08:17 గంటల మధ్య ధనత్రయోదశి పూజ ముహూర్తాన్ని జరుపుకోనుండగా, పండుగను అక్టోబర్ 23న జరుపుకుంటారు.

ఆయుర్వేద దేవుడిగా భావించే ధన్వంతరిని ధనత్రయోదశి రోజున పూజిస్తారు. క్షీరసాగర మథనం సమయంలో పాల సముద్రం నుండి లక్ష్మీదేవి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి.
ధంతేరాస్ అనే పదాన్ని రెండు పదాలుగా విభజించారు - 'ధన్', ఇది సంపదను సూచిస్తుంది. 'తేరాస్' పదమూడో రోజును సూచిస్తుంది. ఈ రోజున, ప్రజలు ఇత్తడి, వెండి మరియు బంగారు వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎందుకంటే ఇది ఖరీదైన ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి అత్యంత పవిత్రమైన మరియు అనువైన రోజులలో ఒకటిగా పరిగణించబడుతుంది.
ప్రతి సంవత్సరం, హిందువులు, జైనులు, సిక్కులు దీపావళిని చెడుపై మంచి, చీకటిపై కాంతిపై, నిరాశపై ఆనందం యొక్క విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు.
దీపాల పండుగగా ప్రసిద్ధి చెందిన దీపావళిని దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ప్రజలు పూజలు చేస్తారు. ఆచారాలను పాటిస్తారు. వారి ఇళ్లలో దీపాలు, రంగోలీలతో అలంకరిస్తారు. రుచికరమైన స్వీట్లు, భోజనాలను ఆస్వాదిస్తారు. కొత్త సాంప్రదాయ వస్త్రధారణ మరియు మరిన్ని చేస్తారు.
రావణుడిని సంహరించి, 14 సంవత్సరాలు వనవాసం చేసిన తర్వాత దీపావళి రోజున రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. దీపాల పండుగలో భాగంగా ప్రజలు లక్ష్మీ దేవి, గణేషుడిని, కుబేరుడిని పూజిస్తారు. ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు కోసం దేవతలను ఆరాధిస్తారు.



Click it and Unblock the Notifications