Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
దీపావళి రోజు ఇంట్లో బల్లి కనిపిస్తే వెంటనే ఇలా చేయండి.. ఎందుకంటే?
దీపావళి పండగ రోజు సాయంత్రం ఇంట్లోని తలుపులన్నీ తెరిచి ఉంచాలని చెబుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని భావిస్తుంటారు. అయితే దీపావళి రోజు ఇంట్లో బల్లి కనిపించినా అది అదృష్టమైన పేర్కొంటారు. బల్లి కనిపిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చిందనే దానికి సూచకమని భక్తులు నమ్ముతుంటారు. అయితే దీపావళి రోజు బల్లి కనిపిస్తే ఏం చేయాలి, బల్లిని ఎందుకు దేవతగా చూస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
బల్లిని ఎందుకు ఆహ్వానిస్తారంటే..
దీపావళి రోజున ఇంట్లోకి బల్లిని ఆహ్వానించడం, బల్లి ఆశీస్సులు పొందడం శుభప్రదమని పండిత నిపుణులు చెబుతున్నారు. దీపావళి రోజున ఇంట్లో బల్లి పాకుతున్నట్లు కనిపిస్తే.. లక్ష్మేదేవి మన ఇంట్లోకి కూడా అలానే వచ్చిందని నమ్మాలని అలాగే మనపై లక్ష్మీ కటాక్షం ఉందనే నమ్మకం అని చెబుతున్నారు. మిగిలిన సమయాల్లో బల్లి చూడడం అశుభమనే భావన ఉన్నప్పటికీ.. దీపావళి రోజున మంచిదట. బల్లి చూడడం వల్ల ఆదాయ మార్గాలు పెరిగి, ఎక్కువ డబ్బు వస్తుందని పేర్కొంటున్నారు.

కోరికలు నెరవేరాలంటే ఇలా చేయాలి..
ప్రతి ఇంట్లో బల్లులు కనిపిస్తూ ఉంటాయి. అయితే దీపావళి రోజున బల్లులు కనిపిస్తే.. వెంటనే ఇంట్లోకి పూజ గదిలో ఉండే బియ్యాన్ని తీసుకొని ఆ బల్లిపై చల్లాలట. అలా చల్లే క్రమంలో మనసులో ఏదైనా కోరుకుంటే అది తప్పనిసరిగా నెరవేరుతుందని భక్తులు నమ్ముతుంటారు. ఈ దీపావళికి మీకు కనుక బల్లి కనిపిస్తే మీరూ ఓసారి ఇలా చేసి చూడండి. ఆ లక్ష్మీదేవి మీపై కటాక్షం చూపిస్తే మీ జీవితం కూడా బాగుపడొచ్చేమో.
బల్లి వల్ల ఏం జరుగుతుంది?
దీపావళి నాడు కనిపించే బల్లిని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా చెబుతూ ఉంటారు. దీపావళి నాడు బల్లిని పూజిస్తే ఆర్ధిక సమస్యలు తీరిపోయాతని చెబుతున్నారు. అలాగే ఆదాయ మార్గాలు పెరుగుతాయని, కొత్త కొత్త మార్గాల ద్వారా ఐశ్వర్యం పొందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. బల్లులు ఎలా ఇంటి గోడలకు అతుక్కుంటాయో, ఇంట్లో సంపదలు, డబ్బుకు లోటు లేకుండా.. సిరి సంపదలు కూడా అలానే నిలదొక్కుకుంటాయని నమ్మకం.
గమనిక: ఈ స్టోరీలో మేము పొందుపరిచిన విషయాలన్నీ కచ్చితమైనవని మేము ఎక్కడా చెప్పలేదు. ఇవి జోతిష్య నిపుణులు, పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా మీకూ మేలు చేయాలంటే ఉద్దేశంతో అందించబడింది. ఈ విషయాలను విశ్వసించడం అనేది పూర్తిగా మీ ఇష్టం. అలాగే ఈ అంశాలను పాటించే ముందు లేదా అనుసరించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకోవాలి. అలాంటప్పుడే ఏదైనా దోషం ఉన్నా, లేకపోయినా వేరే ఏ మార్గాల గురించి అయినా స్పష్టమైన అవగాహన వస్తుంది.



Click it and Unblock the Notifications