Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
Dhanteras 2022: ధనత్రయోదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి
ధనత్రయోదశి రోజున షాపింగ్‌తో పాటు ఇతర పనులు కూడా చేయవచ్చు. ధంతేరాస్ రోజు దానాలు చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని నమ్ముతారు. అయితే ధంతేరాస్ రోజు ఏయే వస్తువులు దానం చేయాలి. ఎలాంటివి విరాళం ఇస్తే శుభం కలుగుతుందో ఇప్పుడు
Dhanteras 2022: ధనత్రయోదశి దీపావళి పండుగ ప్రారంభాన్ని సూచిస్తుంది.కోట్లాది మంది హిందువులు ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవిని, ధన్వంతరి భగవంతుడిని, కుబేరుడిని, యముడిని పూజిస్తారు. అందుకే ఈ రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.

ధనత్రయోదశిని దేశవ్యాప్తంగా సాంప్రదాయ ఉత్సాహంతో మరియు ఉల్లాసంగా జరుపుకుంటున్నారు. ధంతేరాస్ రోజు షాపింగ్ చేస్తే మంచి జరుగుతుందని భావిస్తారు. ధంతేరాస్ సమయంలో, ప్రజలు సాధారణంగా బంగారం, వెండి, పాత్రలు, బట్టలు మొదలైనవాటిని కొనుగోలు చేస్తారు. అయితే ధంతేరాస్‌లో శుభ ముహూర్త సమయంలో షాపింగ్ చేస్తే, అది మరింత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.
ధనత్రయోదశి నాడు కొనుగోలు చేసే వస్తువుల విలువ భవిష్యత్తులో 13 రెట్లు పెరుగుతుందని నమ్ముతారు. కార్తీక మాసంలోని కృష్ణ పక్ష త్రయోదశి రోజున ధంతేరాస్ పండుగను జరుపుకుంటారు. ఈసారి అక్టోబర్ 23న పండుగను జరుపుకుంటున్నారు.
ధన్‌తేరాస్‌లో షాపింగ్‌తో పాటు ఇతర పనులు కూడా చేయవచ్చు. ధంతేరాస్ రోజు దానాలు చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని నమ్ముతారు. అయితే ధంతేరాస్ రోజు ఏయే వస్తువులు దానం చేయాలి. ఎలాంటివి విరాళం ఇస్తే శుభం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1. వస్త్రదానం
ధనత్రయోదశి సమయంలో పేదవారికి బట్టలు దానం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందని భావిస్తారు. బట్టలు ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే వాటిని అదృష్టవంతులుగా పరిగణిస్తారు. ధంతేరాస్ నాడు వస్త్రదానం చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుందని హిందువులు బలంగా విశ్వసిస్తారు.

2. ధాన్యం
ధంతేరాస్ నాడు వస్త్రదానం చేసిన తర్వాత, ఆహార ధాన్యాలను దానం చేయడం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ మతంలో అన్నాన్ని అన్నపూర్ణగా భావిస్తారు. ధంతేరాస్ రోజున ఆహార ధాన్యాలు దానం చేస్తే లక్ష్మీ దేవి సంతోషిస్తుందని నమ్ముతారు.

3. స్వీట్లు, కొబ్బరి
బట్టలు, ఆహార పదార్థాలను దానం చేయడంతో పాటు, మీరు లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ధంతేరస్ నాడు స్వీట్లు మరియు కొబ్బరికాయను కూడా దానం చేయవచ్చు. ధంతేరాస్ సమయంలో కొబ్బరి కాయను దానం చేయడం శుభ కార్యంగా పరిగణించబడటానికి ఇదే కారణం.

4. ఇనుముతో చేసిన వస్తువులను దానం చేయండి
ధనత్రయోదశి రోజు ఇనుముతో చేసిన వస్తువులను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇనుమును శని దేవుని లోహంగా కూడా పరిగణిస్తారు. ధన త్రయోదశి ఇనుప వస్తువులను దానం చేయడం శని దేవుడిని సంతోష పరుస్తుంది.

5. చీపురు
ప్రజలు ధన త్రయోదశి నాడు చీపురును లక్ష్మీ దేవిగా భావించి పూజ చేస్తారు. అయితే మీ స్నేహితులు లేదా బంధువులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లయితే, మీరు లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకునేందుకు ధంతేరాస్ రోజున చీపురును దానం చేయవచ్చు. అయితే మీరు చీపురును దగ్గరి స్నేహితుడికి లేదా దగ్గరి బంధువుకు దానం చేయాలి.

దానం చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు:
* సూర్యాస్తమయం తర్వాత దానం చేయవద్దు.
* పాలు, పెరుగు, తెల్లటి స్వీట్లు.. తెల్లని వస్తువులను ఎవరికీ దానం చేయవద్దు.
* దానం చేసేటప్పుడు, మీ ముఖాన్ని తూర్పు దిశలో ఉంచండి. మరియు మీరు ఎవరికి దానం చేస్తున్నారో వారి ముఖాన్ని ఉత్తరం వైపు ఉంచండి.
* నువ్వులు, నీరు, అన్నం వంటి ధాన్యాలను దానం చేస్తుంటే, ఆ దానాన్ని చేతితో పట్టుకోండి, లేకపోతే దాని ఫలం మీకు లభించదు.



Click it and Unblock the Notifications