Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
తీవ్ర ఏకాగ్రత – జ్ఞానోదయం!

ఓ జెన్ సాధకుడు ఒక జెన్ సూత్రం పై బాగా శ్రమిస్తున్నాడు, అతనికి దాని అర్థం అంతుబట్టలేదు. బాగా కష్టపడ్డాడు కానీ, అతని వల్ల కాలేదు. గురువుగారు బాగా మందలిస్తారని అతను భయపడసాగాడు. అవసరమైతే శిష్యుడిని కొట్టేంత కఠినంగా కూడా జెన్ గురువులు ఉంటారని చెప్పుకునే వారు.
అలా భయ పడుతూనే ఆ సూత్రం మీద కృషి చేసాడు ఆ శిష్యుడు - నిద్రలోకి జారి పోయే అంత తీవ్రంగా దాని పై ధ్యానం చేసాడు.
కలలో అతనికి జెన్ గురువుల పరమ గురువు బోధిధర్ముడు కనబడ్డాడు - పెద్ద, భయంకరమైన కళ్ళతో అతనినే చూస్తూ. బోధిధర్ముడికి భయంకరమైన మొహం వుండేదని చెప్తారు. ఈ సాధకుడికి బోధిధర్ముడి కళ్ళ గురించి బాగా భయమేసి మేల్కొన్నాడు. అది మామూలు నిద్రలోంచి లేవడం కాదు - ఎన్నో జన్మల సుషుప్తిలోంచి లేచినట్టుంది. అది నిరంతర జాగృతిలా అనిపించింది. దాంతో అతనికి జ్ఞానోదయం అయింది - భయం అతనికి జ్ఞానోదయం కలిగించింది.
జెన్ గురువుల సాధనలో తీవ్ర ఏకాగ్రత జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. దేని గురించైనా తీవ్రంగా ధ్యానం చేయడం వల్లనే ఫలితం వస్తుంది.
ఓ సమాధానం దొరకడమే అసలు మార్గం కాదు, ఎరుక కలిగిన జ్ఞానోదయం లభించడం ముఖ్యం. అవగాహన కలిగే క్రమంలో ప్రశ్న మాయమైపోయి, అకస్మాత్తుగా సాధకుడే సమాధానం అవుతాడు.



Click it and Unblock the Notifications