Latest Updates
-
బ్రోకోలీ నిజంగా క్యాన్సర్ ను తగ్గిస్తుందా? డాక్టర్ చెప్పిన ఈ సీక్రెట్ తెలుసుకోండి! -
డీప్‌ఫేక్ ఫోటోలతో వేధిస్తున్నారా? 2 గంటల్లోనే డిలీట్ చేయించే మార్గమిదే! -
కర్ణాటక స్పెషల్ కుకుంబర్ అవలక్కి..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్! -
ఎండల వేడిని తట్టుకోలేకపోతున్నారా? ఈ పానీయాలతో చల్లగా ఉండండి -
పారేసే తొక్కలతో అదిరిపోయే రుచి.. బీహారీ స్టైల్ పచ్చి అరటికాయ తొక్కల పచ్చడి! -
అక్షయ తృతీయ ఏప్రిల్ 19నా? 20నా? పూజకు, గోల్డ్ షాపింగ్ ముహూర్తాలు ఇవిగో! -
సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు: తక్కువ మార్కులు వచ్చాయని ఆందోళన చెందుతున్నారా? -
హోటల్ స్టైల్ ఫిష్ పులావ్.. మీ ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా ఇలా చేసేయండి! -
పవర్ ఫుల్ సీక్రెట్ చెప్పిన సమంత..ఇలా చేస్తే 21 రోజుల్లోనే ఈజీగా బరువు తగ్గొచ్చు! -
ఎండల తీవ్రతతో నీరసిస్తున్నారా? ఈ దేశీ పానీయాలతో చల్లబడండి!
Missile woman: కలాం అవార్డు అందుకున్న మిస్సైల్ ఉమన్ టెస్సీ థామస్.. ఆమె గురించి కొన్ని విషయాలు
టెస్సీ థామస్ కేవలం భారత్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన ప్రతిభను చాటి చెప్పింది. ఏపీజే అబ్దుల్ కలాం అవార్డును అందుకున్నారు.
Missile woman: రక్షణ రంగంలో పురుషలదే ఆధిపత్యం. అందులో క్షిపణుల విభాగం అంటే మగవారిదే అన్నట్టుగా ఉండేది కొన్ని రోజుల వరకు. అలాంటి క్షిపణుల విభాగంలో అడుగుపెట్టడమే కాదు.. ఇండియా మిసైల్ ఉమన్( భారత క్షిపణి మహిళ)గా పేరు పొందారు టెస్సీ థామస్. కేవలం భారత్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన ప్రతిభను చాటి చెప్పింది. ఈ సంవత్సరం, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) డైరెక్టర్ జనరల్ (ఏరో సిస్టమ్స్) డాక్టర్ టెస్సీ థామస్... ఏపీజే(APJ) అబ్దుల్ కలాం అవార్డును అందుకున్నారు. నూరుల్ ఇస్లాం యూనివర్సిటీ ఛాన్సలర్ ఎ.పి మజీద్ ఖాన్ నేతృత్వంలో NINS మెడిసిటీ సహకారంతో కమిటీ టెస్సీ థామస్ ను ఎంపిక చేశారు.

ఏమిటి ఈ APJ అబ్దుల్ కలాం అవార్డు?
కన్యాకుమారి జిల్లా కుమార కోవిల్ లోని నూరుల్ ఇస్లాం సెంటర్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అలాగే నూరుల్ ఇస్లాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ (నిమ్స్) మెడిసిటీ సంయుక్తంగా ఈ అవార్డును ఇస్తున్నాయి. 2019 నుండి APJ అబ్దుల్ కలాం అవార్డు ప్రదానం చేస్తున్నాయి. వివిధ ఉద్యోగ రంగాలలో ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేస్తాయి. ఇందుకోసం నూరుల్ ఇస్లాం యూనివర్సిటీ ఛాన్సలర్ ఎ.పి మజీద్ ఖాన్ నేతృత్వంలో కమిటీ పని చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులను సత్కరించడం కోసం ఈ అవార్డును నిర్వహిస్తున్నాయి.

అవార్డుగా ఏమిస్తారు?
జూలై 19న కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ నిమ్స్ మెడిసిటీ, నెయ్యర్టిన్ కరైలో అవార్డును అందజేశారు. విజేతకు స్మారక ట్రోఫీ, ప్రశంసా పత్రం అందిస్తారు. అలాగే రూ.1 లక్ష నగదు బహుమతిని అందజేస్తారు. భారత క్షిపణి కార్యక్రమానికి నాయకత్వం వహించిన తొలి మహిళా శాస్త్రవేత్త టెస్సీ థామస్ ఈ అవార్డు అందుకున్నారు.

డాక్టర్ టెస్సీ థామస్ ఎవరు?
* డాక్టర్ టెస్సీ థామస్ భారతీయ శాస్త్రవేత్త అలాగే ఏరోనాటికల్ సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్. టెస్సీ థామస్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో అగ్ని-IV క్షిపణి కార్యక్రమానికి మాజీ ప్రాజెక్ట్ డైరెక్టర్.
* క్షిపణి ప్రాజెక్టులో పాల్గొన్న భారతదేశంలో మొట్టమొదటి మహిళా శాస్త్రవేత్త టెస్సీ థామస్.
* ఆమె అనుబంధాలలో ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ (INAE), ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్-ఇండియా (IEI), అలాగే టాటా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (TAS) ఉన్నాయి.
* 2011లో టెస్సీ థామస్ మిషన్ అగ్ని IV కోసం ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ మిసైల్ విజయవంతంగా పరీక్షించబడింది.
* త్రిస్సూర్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత, ఆమె క్షిపణి సాంకేతికతలో పరిశోధనను కొనసాగించారు.

టెస్సీ థామస్ ఏం చదువుకున్నారు?
ఆమె ఇంజినీరింగ్ విద్య కేరళలో పూర్తయింది. పూణె నుండి ఎంటెక్ పూర్తి చేశారు. 1988లో DRDOలో చేరడానికి ముందు, టెస్సీ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్‌లో MBA పూర్తి చేశారు. దాని తర్వాత మిస్సైల్ గైడెన్స్‌లో PhD పొందారు. అనంతరం అగ్ని క్షిపణి కార్యక్రమంలో భాగమయ్యారు. APJ అబ్దుల్ కలాం తన రోల్ మోడల్ అని చెబుతారు టెస్సీ థామస్. అలాంటి వ్యక్తి కింద పని చేయడం ఎంతో గౌరవమని అంటారు టెస్సీ. డాక్టర్ టెస్సీ థామస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అకడమిక్స్ అండ్ మేనేజ్‌మెంట్-2012లో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్‌తో సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు.

డాక్టర్ టెస్సీ థామస్ గురించి మరికొంత
* టెస్సీ థామస్ 1963లో జన్మించారు.
* కేరళలోైని అలప్పుజా టెస్సీ థామస్ జన్మస్థలం.
* మదర్ థెరిసా గౌరవార్థం ఆమెకు టెస్సీ అనే పేరు పెట్టారు వారి తల్లిదండ్రులు.
* చిన్నతనంలో తుంబా రాకెట్ లాంచింగ్ స్టేషన్ సమీపంలో పెరిగారు టెస్సీ థామస్.
* లాంచింగ్ స్టేషన్ సమీపంలో పెరగడం వల్ల రాకెట్లు, క్షిపణుల పట్ల ఆమెకు ఆసక్తిని రేకెత్తించింది.
* టెస్సీ తండ్రి ఓ IFS అధికారి. టెస్సీ కూడా తండ్రిలాగే సివిల్ సర్వీసులో చేరుతుందని అనుకున్నారు. కానీ ఆమె మరో మార్గాన్ని ఎంచుకుని విజయవంతం అయ్యారు.

టెస్సీ థామస్ ఏయే ప్రాజెక్టుల్లో పని చేశారు?
టెస్సీ థామస్ గత 20 సంవత్సరాలుగా డిఫెన్స్ రంగంలో పనిచేస్తున్నారు. ఈ 20 ఏళ్ల కాలంలో ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించారు.
* టెస్సీ థామస్ అగ్ని-II క్షిపణి యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పని చేశారు.
* 3 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలు చేధించే అగ్ని-III క్షిపణి ప్రాజెక్ట్‌కి అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పని చేశారు.
* టెస్సీ థామస్ సాలిడ్ ప్రొపెల్లెంట్ సిస్టమ్స్‌లో నిపుణురాలు.



Click it and Unblock the Notifications











