For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అవమానాలే అవకాశాలుగా... ఆకాశమే హద్దుగా.. గఘన విహారం చేస్తున్న అజ్మీరా...

తొలి గిరిజన మహిళా పైలట్ గా అజ్మీరా బాబా గుర్తింపు పొందడం వెనుక కఠోర శ్రమ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

తన మేనత్తకు వీడ్కోలు చెప్పడానికి వెళ్లినప్పుడే... విమానం ఎక్కాలని కలలు కన్నది. అంతేకాదు ఆ విమానాన్ని కూడా నడపాలని.. తనకు, ఆకాశానికి ఏదో దగ్గర అనుబంధం ఉందని డిసైడ్ అయిపోయింది.

https://www.bbc.com/telugu/india-44474284?fbclid=IwAR3eVv2RVeKofuZY5vRSvU7rwPuzF8-aTlUuUlCswgTCqqjnNaciqwDA-SI

PC Curtosy

అంతే ఆరోజు నుండి విమానానికి సంబంధించిన రంగాల్లోనే పని చేయాలని నిర్ణయించుకుంది.

https://www.bbc.com/telugu/india-44474284?fbclid=IwAR3eVv2RVeKofuZY5vRSvU7rwPuzF8-aTlUuUlCswgTCqqjnNaciqwDA-SI

తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన అజ్మీర్ బాబీ చదివింది ఎంబీఏ అయినప్పటికీ, ఏవియేషన్ లో ఎయిర్ హోస్టెస్ గా.. ఏరోప్లేన్ పైలెట్ గా ఎలా మారింది అనే ఆసక్తికరమైన విషయాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం...

నా కల నెరవేర్చుకునేందుకు..

నా కల నెరవేర్చుకునేందుకు..

‘‘మా కుటుంబంలో, బంధువులలో ఎవరూ ఏవియేషన్ రంగంలో లేరు. అసలు మాకు దీని గురించి భరోసా ఇచ్చేవారు కూడా లేరు. దీంతో నాకు చాలా కష్టంగా అనిపించింది. దీంతో నా కలను నెరవేర్చుకునేందుకు చాలా శ్రమించాను. నాపై నేను పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ధైర్యంగా ముందుకెళ్లాను'' అని ఆమె చెప్పారు.

రిస్క్ తీసుకోవడం ఇష్టం..

రిస్క్ తీసుకోవడం ఇష్టం..

PC Curtosy

‘రిస్క్ తీసుకోవడం నాకు చాలా ఇష్టం. ఆడపిల్ల అనగానే ప్రభుత్వ ఉద్యోగాలు, టీచర్లు, డాక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వమని ఇళ్లలో ప్రోత్సహిస్తారు. అందుకే నేను మాత్రం అందరి కంటే భిన్నంగా అవ్వాలని ఆలోచించేదాన్ని' అని బాబీ అన్నారు.

ఫస్ట్ ఛాన్సులోనే ఉద్యోగం..

ఫస్ట్ ఛాన్సులోనే ఉద్యోగం..

ఎంబీఎ పూర్తి చేశాక కేబిన్ క్రూ సిబ్బంది కోసం ఒక ఎయిర్ లైన్స్ ఇచ్చిన ప్రకటనను చూసి దానికి దరఖాస్తు చేశా. లక్కీగా ఫస్ట్ ఛాన్సులోనే ఎయిర్ హోస్టుగా ఎంపికయ్యాను. అదే నా లక్ష్యాన్ని సాధించడంలో మొదటి మెట్టు అని వెల్లడించారు.

నమ్మకం ఉండాలి..

నమ్మకం ఉండాలి..

ఎయిర్ హోస్టెస్ అనగానే చాలా కుటుంబాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తాయి. ఈ రంగం ఎంచుకోవడానికి చాలా మంది ఒప్పుకోరు. కానీ తల్లిదండ్రులు తమ పిల్లలపై నమ్మకంగా ఉండాలని కోరారు.

ఎయిర్ హోస్ట్ గా పని చేస్తూనే..

ఎయిర్ హోస్ట్ గా పని చేస్తూనే..

ఎయిర్ హోస్ట్ గా పని చేస్తున్న సమయంలోనే పైలట్ ట్రైనింగుకు సెలెక్ట్ అయ్యాను. తొలిసారి ఆకాశంలోకి ఎగిరేటప్పుడు కిందకి చూస్తే చాలా భయం వేస్తుందని, కానీ ఆ భయం వదిలితేనే ట్రైనింగ్ పూర్తి చేయగలమని బాబీ చెబుతోంది.

ఆ క్షణం భయం..

ఆ క్షణం భయం..

ఒకసారి ట్రైనింగులో ఉన్న సమయంలో తన విమానం డోర్ కాస్త తెరచుకుంది. ఆ క్షణం నాకు చాలా భయం వేసిందని, భయపడితే తన కల నెరవేరదని, తనకి తానే చెప్పుకుని, పట్టుదలతో ట్రైనింగ్ పూర్తి చేశానని చెప్పారు.

ఆ తర్వాత ఆనందం..

ఆ తర్వాత ఆనందం..

ప్రతి విజయం వెనుక కచ్చితంగా కష్టం అనేది ఉంటుందని నేను నమ్ముతాను. కానీ ఆ కష్టం తర్వాత వచ్చే ఆనందం చాలా బాగుంటుందని బాబీ అన్నారు.

టాలెంట్ ఆపలేరు..

టాలెంట్ ఆపలేరు..

మనలోని టాలెంట్ ను ఎవ్వరూ అడ్డుకోలేరు. ఈ రంగంలోకి వచ్చినప్పుడు పెద్ద సమస్యలేమీ ఎదురుకానప్పటికీ, కొన్నిసార్లు మాత్రం కులం గురించి అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పారు. ‘‘ఎవరినైనా పని విషయంలో అడ్డుకోవచ్చు. అప్పుడు కాస్త కష్టంగా ఉంటుంది. కానీ టాలెండ్ ను మాత్రం ఎవ్వరూ ఆపలేరు''అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశార.

పేరేంట్స్, ఫ్రెండ్స్ ప్రోత్సాహం..

పేరేంట్స్, ఫ్రెండ్స్ ప్రోత్సాహం..

ఈ రంగంలోకి రావడానికి తన పేరేంట్స్, ఫ్రెండ్స్ చాలా ప్రోత్సహించారు. అంతేకాదు దివంగత నేత రాజశేఖరరెడ్డి, ప్రస్తుత సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ తనకు ఎంతో సహకారం అందించారని గుర్తు చేసుకున్నారు.

అందులో స్కిల్స్ ఉండాలి..

అందులో స్కిల్స్ ఉండాలి..

ఏవియేషన్ రంగంలోకి రావాలనుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో స్కిల్స్ కచ్చితంగా ఉండాలని చెప్పారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రతి మూడు నెలలకు ఒకసారి వివిధ సబ్జెక్టులతో పరీక్షలు నిర్వహిస్తుందని, పరీక్షలు పాసైన తర్వాత ఫ్లయింగ్ క్లబ్ లో చేరితే బాగుంటుందని, లేకపోతే ఫ్లయింగ్ లైసెన్స్ పోయే అవకాశాలు ఉంటాయని'' బాబీ చెప్పారు.

తనలాగా కావాలంటే..

తనలాగా కావాలంటే..

PC Curtosy

తనను ఆదర్శంగా తీసుకుని, ప్రస్తుతం చాలా మంది నా దగ్గరికి వచ్చి సలహాలు, సూచనలు అడుగుతున్నారని, ఇలాంటి వాటి వల్ల తనకు ఎంతో ఆనందం కలుగుతుందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తనలాగా పైలట్ కావాలనుకునే ఆడపిల్లలందరికీ తన సహకారం, ప్రోత్సహం ఎప్పుడూ ఉంటుందని చెప్పారు.

English summary

Interesting facts about 1st Tribal Telugu Pilot Azmeera Bobby

Here we talking about interesting facts about first tribal telugu pilot azmeera bobby. Read on.
Desktop Bottom Promotion