For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జెన్ గురువు రింజాయ్ గురించి ఓషో చెప్పిన కథ

|

Osho Story On Zen Master Rinzai
జెన్ గురువు రింజాయ్ గురించి ఓషో ఒక అందమైన కథ చెప్పారు.

రింజాయ్ తన గురువుగారితో కలిసి దాదాపు ఇరవై ఏళ్ళు జీవించాడు. ఒక రోజు రింజాయ్ వెళ్లి గురువు గారి కుర్చీ లో కూర్చున్నాడు. లోపలికి వచ్చిన గురువు గారు రింజాయ్ ను తన కుర్చీ మీద చూసి, నిశ్శబ్దంగా రింజాయ్ కుర్చీ మీద కూర్చున్నాడు.

వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి మాటలు జరగనప్పటికీ, సందేశం వెళ్ళనే వెళ్ళింది.

రినాయ్ గురువుగారిని అడిగాడు "మీరు బాధ పడలేదా? నేను మిమ్మల్ని అవమానించాను కదా? నేను మీ పట్ల కృతఘ్నత చూపానా?"

గురువు గారు నవ్వారు. "నువ్వు విద్యార్ధి నుంచి శిష్యుడిగా, శిష్యుడి నుంచి గురువుగా ఎదిగావు. నువ్వు నా పని పంచుకు౦టావని నేను సంతోషిస్తున్నాను. ఇప్పుడు నేను రోజూ రావక్కర్లేదు. ఇక్కడ నా పని చేయడానికి మరొకరు ఉన్నారని నాకు తెలుసు."

జ్ఞానోదయం పొందిన వారికి ఇది ఉదాహరణ!

English summary

Osho Story On Zen Master Rinzai | జెన్ గురువు రింజాయ్ గురించి ఓషో చెప్పిన కథ

A beautiful story narrated by Osho about Zen Master Rinzai. Rinzai lived with his master for almost twenty years. One day Rinzai went and occupied his master's seat. The master who walked into the room, seeing Rinzai on his sit, quietly occupied Rinzai's seat.
Story first published:Friday, September 21, 2012, 16:37 [IST]
Desktop Bottom Promotion