For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రంజాన్ నెలలో ఉపవాసం యొక్క ప్రాముఖ్యత

రంజాన్ నెలలో ఉపవాసం యొక్క విశిష్టత ?

|

దాదాపు ప్రతి మతంలో ఈ ఉపవాసం అనే భావన ఉన్నది. ఉదాహరణకు,హిందూమతంలో దాదాపు ప్రతి సందర్భంలోనూ ఈ ఉపవాస ఉత్తరక్రియ ఉన్నది. అదేవిధంగా, క్రైస్తవ మతంలో కూడా 40 రోజుల వ్రతసమయంలో ఈ ఉపవాసాన్ని చేస్తారు. అయితే, ఇస్లాం మతంలో చేసే ఉపవాసం మిగిలిన మతాలలో చేసేదానికన్నా భిన్నమైనది. రంజాన్ ఉపవాసం అంటే ఆహారం తీసుకోకుండా ఉండటమే కాదు, వారి జీవితకాలంలో మానవులు చుట్టూ చెడ్డశక్తుల నుండి దూరంగా ఉండటం కూడా. రంజాన్ ఉపవాస దీక్ష ఒక నెల పాటు దీర్ఘంగా కొనసాగుతుంది.

రంజాన్ అంటే స్వతహాగా ఆహార పానీయాలను నిగ్రహించటం అని అర్థం. కానీ అతి ముఖ్యమైన విషయమేమిటంటే ఈ నిగ్రహం ప్రతికూలమైన అన్ని విషయాలకు దూరంగా ఉండాలి అని చెపుతుంది. ప్రతికూల విషయాలు అంటే వ్యసనాలు, సెక్స్ మరియు మానవజీవితం దుర్భరం చేసే ఏ విషయమైనా. రంజాన్ ఉపవాసాలు గాఢమైన దేవుని ప్రేమ కోసం పాటిస్తారు.

రంజాన్ ఉపవాసాలు 30 రోజుల పాటు కొనసాగుతుంది. ఇది చంద్రుడు మొదలు చూసిన దగ్గర నుండి పై నెల చంద్రుడిని చూసిన తరువాత ముగుస్తుంది. రంజాన్ నెలలో, ఒక వ్యక్తి రోజు ప్రారంభం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాస దీక్షలో ఉంటాడు. కేవలం ప్రార్థనలు తరువాత అతను / ఆమె ఆహార మొదటి ముద్ద ఆహారాన్ని తీసుకుంటారు.. రంజాన్ ఉపవాసం గొప్ప ప్రాముఖ్యత సంతరించుకోవటానికి అనేక కారణాలు ఉన్నాయి. రంజాన్ ఉపవాసాల యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం.

Significance Of Fasting During Ramzan

పవిత్ర ఖురాన్
పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని ప్రవక్త మహమ్మద్ రంజాన్ నెలలో వెల్లడి చేశారు. దేవుడు తన దూతగ మహమ్మద్ ప్రవక్తను ఎంచుకున్నాడు మరియు ఖురాన్ వంటి పవిత్ర గ్రంథాన్ని రచింపచేశాడు. రంజాన్ చివరి 10 రోజులు ప్రశస్తమైనవిగా భావిస్తారు ఎందుకంటె ప్రవక్త గ్రంథం పూర్తయిన సమయం లైలతుల్ ఖదర్ (పవర్ రాత్రి) అని నమ్ముతారు.

మహమ్మద్ ప్రవక్త జ్ఞానోదయం
మహమ్మద్ ప్రవక్త ఒక సెయింట్ గ జన్మించాడు. కానీ అతను పెరిగిన సమయంలో హింసలు ఎక్కువగా ఉండేవి. అతను, ప్రజలు జీవిస్తున్న విధానాలపట్ల మనస్తాపం చెందాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల విసుగుచెందినా ప్రవక్త అరణ్యములో తిరుగుతూ ఉండేవాడు. మౌంట్ స్పాక్ వద్ద తిరుగుతూ ఉన్న సమయంలో అతను ఉపవాసం ఉండి మరియు దేవుని ప్రార్ధిస్తూ, రోజులు మరియు రాత్రులు గడిపాడు. చివరగా, దేవుడు అతనిని లోకమంతటిని వెలుగు మార్గంలో నడిపించటానికి దూతగా ఎంచుకున్నాడు. దేవుడు ఎంపికచేసిన వ్యక్తి ద్వారా జ్ఞానం యొక్క నిజమైన కాంతి వ్యాప్తి చేయ సంకల్పించాడు. ప్రజలు అన్ని చెడ్డశక్తుల నుండి రంజాన్ సమయంలోదూరంగా ఉంటారు మరియు ఉపవాసాలు ఉంటారు.

ఉపవాసం వెనుక తర్కం
ప్రతి మతంలో ఉపవాసం అంటే దేవుని కొరకు అన్ని ప్రాపంచికసుఖాలు వదిలివేయటం అన్నది ఒక పద్ధతి. ఒక సాధారణ మనిషి ఎల్లప్పుడూ ప్రాపంచిక విధులతో కట్టివేయబడుతున్నాడు మరియు దేవుని కోసం సమయం వెచ్చించటానికి కూడా కష్టపడుతున్నాడు. ఉపవాసం అనేది ఒక తపస్సు వంటిది ఎందుకంటే ఒక వ్యక్తి ఆహారాన్ని త్యజించి, దేవునిపై పూర్తిగా దృష్టి పెట్టటం. రోజులో పగటిసమయంలో ఆహారం త్యజించి ఉపవాసం ఉన్న వ్యక్తి, ఆరోజు ప్రాపంచికంగా ఆ వ్యక్తీ మరణించినట్లుగా భావిస్తారు మరియు దేవుని ప్రార్ధిస్తూ పూర్తిగా లీనమవుతారు. . రాత్రి భోజనము తీసుకున్న వ్యక్తి, తన జీవనోపాధి కోసం తిన్నట్లుగా భావిస్తారు; బాహ్య ప్రపంచం నుండి తననుతాను మూసివేసుకోవడం మరియు అంతర్గత ఆధ్యాత్మిక ప్రపంచానికి దగ్గరవటం.

చంద్రుడిని జ్ఞానం యొక్క కాంతిగ భావిస్తారు. అందువలన, చంద్రుడు రంజాన్ ఉపవాస దీక్షలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాడు. రంజాన్ సమయం, మానవుడు ప్రాపంచిక ఆనందాలనుండి దూరంగా ఉండి తనలో ఆధ్యాత్మికశక్తిని నింపుకునే సమయం.. రంజాన్ ఉపవాసం దేవుని కోసం,మాత్రమె కాదు, ఇది ప్రతి వ్యక్తి స్వయంగా అజ్ఞానం చీకటి నుండి నిజమైన జ్ఞానం వెలుగులోకి తరలివెళ్ళటానికి ఒక గొప్ప మార్గం.

English summary

Significance Of Fasting During Ramzan

Fasting, as a concept, is present in almost every religion. Hinduism, for example, has the ritual of fast for almost every occasion. Similarly, Christianity also has the ritual of fasting during lent.
Desktop Bottom Promotion