For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దొంగ గారి వ్యూహం..

|

The Burglar's Tactic
ఓ గజదొంగ కొడుకు తన తండ్రిని తమ వృత్తిలోని రహస్యాలు నేర్పమని అడిగాడు. పెద్ద దొంగ ఒప్పుకుని, ఆ రోజు రాత్రికి ఓ పెద్దింటికి దొంగతనానికి తీసుకువెళ్ళాడు. ఆ కుటుంబం అంతా రోజూలాగే యధావిథిగా పనులన్నింటిని ముగించుకొని, భోజన కర్యాక్రమాలు అయిపోయిన తర్వాత నిద్రకు ఉపక్రమించారు. వారు నిద్రపోతుండగా, తన కొడుకుని బట్టల అలమరా వున్న గదిలోకి తీసుకువెళ్ళాడు.

ఆ అలమరాలో నుంచి కొన్నిబట్టలు ఎత్తుకురమ్మని తన కుమారుడికి చెప్పాడు. కొడుకు అలా వెళ్ళగానే, తండ్రి ఆ గదికి తలుపులు వేసేసి, తాళం పెట్టాడు. తర్వాత బయటకు వెళ్లి వీధి వాకిలి పెద్దగా కొట్టి, కుటుంబం మేల్కొన్నాక ఎవరూ చూడక ముందే చల్లగా అక్కడినుంచి జారుకున్నాడు.

కొద్ది గంటల తర్వాత కొడుకు నీరసంగా, అలిసిపోయి ఇంటికి వచ్చాడు. "నాన్నా, నన్ను ఎందుకు లోపలుంచి తాళం పెట్టావ్" అని కోపంగా తండ్రిని అడిగాడు. "పట్టుబడతానేమోననే భయం అయింది. లేకున్నట్టైతే తప్పించుకో గలిగే వాడినే కాదు. నా తెలివితేటలన్నీ ఉపయోగించి బయటపడ్డాను" అన్నాడు.

దాంతో వృద్ధ దొంగ నవ్వి, "బాబూ, చొర కళలో తోలి పాఠం నేర్చుకున్నవురా" అన్నాడు.

English summary

The Burglar's Tactic | దొంగ గారి వ్యూహం..


 The son of a master thief asked his father to teach him the secrets of the trade. The old thief agreed and that night took his son to burglarize a large house. While the family was asleep, he silently led his young apprentice into a room that contained a clothes closet.
Story first published:Thursday, September 6, 2012, 16:58 [IST]
Desktop Bottom Promotion