Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
విదూషకుడే నయం !

అతనికి తన అధ్యయనంలో అంతు పట్టని ఒక విషయం తగిలింది. గురువు గారి దృష్టికి తీసుకువెళ్ళాడు. గురువు గారు ఆ ప్రశ్న వినగానే పగలబడి నవ్వుతూ వెళ్ళిపోయారు. గురువు గారి ప్రతిస్పందనతో ఈ సన్యాసి బాగా నొచ్చుకున్నాడు. ఆయన ప్రతిస్పందన ప్రభావం సన్యాసి మీద తరువాతి మూడు రోజుల దాకా వుండిపోయింది. అతను తిండి తినలేక పోయాడు, నిద్ర పట్టలేదు. మూడు రోజుల తర్వాత గురువు గారి దగ్గరకు వెళ్లి తను ఎంత బాధ పడ్డాడో చెప్పాడు.
ఇది విని గురువు గారు అన్నారు :"సన్యాసి, నీ సమస్య ఏమిటో నీకు ఖచ్చితంగా తెలుసా? నీ సమస్య ఏమిటంటే నువ్వు విదూషకుడి కంటే అధ్వాన్నమైన వాడివి"
సన్యాసి అవాక్కయ్యాడు "పూజ్య గురువుగారు, అంత మాట ఎలా అనగలిగారు? నేను విదూషకుడి కన్నా ఎలా అధ్వాన్నమైన వాడిని?"
గురువు గారు తన ఉద్దేశ్యాన్ని ఇలా వివరించారు "జనం నవ్వుతుంటే విదూషకుడు సంతోషిస్తాడు. నిన్ను చూడు. ఎదుటివాడు నవ్వాడని నువ్వు బాధ పడుతున్నావు. ఇప్పుడు చెప్పు, నువ్వు విదూషకుడి కంటే అధ్వాన్నమైన వాడివేగా?"



Click it and Unblock the Notifications