For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరణం సమీపించే ముందు ఈ సంకేతాలు వస్తాయి, అవి వచ్చాయంటే చావు దగ్గర పడ్డట్లే

మరణించే వారు తమ చుట్టూ ఉన్న వారందరికీ క్రమంగా దూరం అవుతూ ఉంటారు. ఎలాగో నేను కొన్నిరోజుల్లో చనిపోతున్నా నన్ను పట్టించుకునే వారు ఎవరూ ఉండరని అనుకుంటారు. నేను చచ్చినా నాతో పాటు వచ్చి వాళ్లు అయితే చావరు

|

మరణం సమీపించే ముందు కొన్ని రకాల సంకేతాలు వస్తాయి. ఆరోగ్యపరంగా మీరు కొన్ని రకాల ఇబ్బందులుపడతారు. మరణం సమీపించే ఆ మనిషిలో కొన్ని రకాల మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా ఎక్కువగా నిద్రపోయే అవకాశం ఉంటుంది. మెటాబాలిజం తగ్గిపోతుంది. దీంతో అలసట పెరిగిపోతుంది. ఎక్కువగా నిద్రపోవడం చావుకు ఒక సూచన. అయితే మీరు నిద్రను కంట్రోల్ లో ఉంచుకునేందుకు యాక్టివ్ ఉండేందుకు ప్రయత్నించాలి.

తక్కువగా తినడం, తాగడం

తక్కువగా తినడం, తాగడం

మరణం సమీపించే కొద్ది ఏదీ తినాలనిపించదు. ఏదీ తాగాలనిపించదు. అన్నింటిపై అనాసక్తి ఏర్పడుతుంది. అలాగే శక్తి కూడా తగ్గిపోతుంది. కొన్ని రోజులు అసలు ఏమీ తినకుండా తాగకుండానే బతికేస్తుంటారు. బాగా ఆకలివేసినట్లు ఉన్న కూడా ఏమీ తినకుండా బతికేస్తుంటారు. అయితే అలా చేయకుండా ఆకలి అయినప్పుడల్లా ఏదో ఒక తినడం మంచిది. అలాగే కొన్ని నీటిలో ఒక తడిగుడ్డను నానబెట్టి దాన్ని పెదాలపై అప్పుడప్పుడ ఉంచుకుంటూ ఉండాలి.

అందరికీ దూరం కావడం

అందరికీ దూరం కావడం

మరణించే వారు తమ చుట్టూ ఉన్న వారందరికీ క్రమంగా దూరం అవుతూ ఉంటారు. ఎలాగో నేను కొన్నిరోజుల్లో చనిపోతున్నా నన్ను పట్టించుకునే వారు ఎవరూ ఉండరని అనుకుంటారు. నేను చచ్చినా నాతో పాటు వచ్చి వాళ్లు అయితే చావరు కదా అని మనస్సులో ఏవేవో అనుకుంటూ ఉంటారు. దీంతో మనుషులకు క్రమంగా దూరం అవుతారు. అయితే ఆ సమయంలో వారికి ఆత్మీయులు మరింత దగ్గరై వారిలో ధైర్యం నింపాలి.

చాలా మార్పులు

చాలా మార్పులు

మరణం దగ్గరపడే కొద్దీ రక్తపోటు పెరుగుతుంది. అలాగే శ్వాసలో చాలా మార్పులు వస్తాయి. హృదయ స్పందనల్లో కూడా చాలా తేడా ఉంటుంది. మూత్రపిండాలు కూడా సరిగ్గా పనిచేయవు.

శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది

శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది

చావు దగ్గర పడే కొద్దీ రక్త ప్రసరణ కూడా తగ్గిపోతుంది. చేతులు, కాళ్లకు సంబంధించి రక్త ప్రసరణ బాగా తగ్గుతుంది. చర్మం మొత్తం పాలిపోతుంది. అలాగే బాడీలో టెంపరేచర్ పూర్తిగా తగ్గిపోతుంది.

కండరాలు బలహీనంగా మారడం

కండరాలు బలహీనంగా మారడం

మరణం దగ్గర పడే కొద్దీ కండరాలు బలహీనంగా మారుతాయి. ఎముకలు విరిగే పోయే అవకాశం ఉంది. ఇది కూడా మరణానికి సూచనగా చెప్పొచ్చు.

శ్వాస సమస్యలు

శ్వాస సమస్యలు

మరణించే ముందు శ్వాస సమస్యలు ఎక్కువ అవుతాయి. శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులుపడతారు. గాలి పీల్చుకోవాలన్నా , వదిలివేయాలన్నా కష్టంగా ఉంటుంది. ఇది కూడా మరణానికి ఒక సూచన.

గందరగోళంగా ఉంటుంది

గందరగోళంగా ఉంటుంది

మరణం సమీపించే కొద్ది మెదడు సరిగ్గా పని చేయడు. గందరగోళంగా ఉంటుంది. ఏవేవో ఆలోచనలతో ఉంటారు. ఒక్కదాన్ని కూడా సరిగ్గా ఆలోచించే శక్తి ఉండదు.

నొప్పి

నొప్పి

చావు దగ్గరపడే కొద్ది శరీరంలో అన్నిచోట్ల నొప్పి పెరుగుతుంది. అన్ని రకాల నొప్పులతో అల్లాడిపోతుంటారు. ఇవన్నీ కూడా మరణానికి సూచనలు.

English summary

These Are The Signs of Death Approaching

Life and death is a never-ending cycle. It is believed that the goal of life is death. However, death is never easy. Not only for the person in his/her last days but also for the loved ones around. Though inevitable, there are certain signs that can help you be prepared when the time of death arrives. No two people have the same dying experience, but some of these physical and emotional signs are seen in all.
Desktop Bottom Promotion