Latest Updates
-
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా..
Eid-e-Milad-un-Nabi 2022: మిలాద్ అన్-నబి చరిత్ర, ప్రాముఖ్యత
మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ అక్టోబర్ 8, 9వ తేదీల్లో జరుపుకుంటారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పండుగలా జరుపుకుంటారు. దీనిని బరావాఫత్ లేదా ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ అని కూడా అంటారు.
Eid-e-Milad-un-Nabi: ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ ఇస్లామిక్ క్యాలెండర్‌లోని మూడో నెలలోని 12వ రోజున వస్తుంది. దీనిని రబీయుల్ అవల్ అని పిలుస్తారు. ముస్లింల విశ్వాసం ప్రకారం మహ్మద్ ప్రవక్త రబీయుల్ అవల్ 12వ రోజున జన్మించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ అక్టోబర్ 8, 9వ తేదీల్లో జరుపుకుంటారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పండుగలా జరుపుకుంటారు. దీనిని బరావాఫత్ లేదా ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ అని కూడా అంటారు.

ఈద్ మిలాద్ ఉన్ నబీని ఇస్లామిక్ నెల రబీ ఉల్ అవ్వల్ (రబీ అల్-అవ్వల్) 12వ రోజున సున్నీ ముస్లిం సమాజం మరియు 17వ రోజున షియా సమాజం జరుపుకుంటారు. ఈ రోజును ఈద్-ఇ-మిలాద్ మరియు మౌలిద్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని సూచిస్తుంది. ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ముస్లింలు రాత్రంతా మసీదులలో ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఈ సందర్భంగా పలు చోట్ల ఊరేగింపులు కూడా నిర్వహిస్తారు. ఇళ్లలో వంటకాలు తయారు చేసి ఒకరికొకరు సోదరభావాన్ని చాటుకుంటారు.
విశ్వ ప్రవక్త తాను స్వతహాగా ఏదీ తెలియజేయరు. తాను అల్లాహ్ ద్వారా ఏది వినేవారో అదే తెలిపేవారు. దీనికి సాక్ష్యంగా అనేక దైవ గ్రంథాల్లో పొందుపరిచారు. మరో విశేషమేమిటంటే.. మహమ్మద్ ప్రవక్త(ఉమ్మి) ఏమీ చదువుకోలేదట. ఆయన కేవలం అల్లాహ్ తహ లా మహిమ పవిత్ర ఖురాన్ ను దైవవాణి రూపంలో ప్రవక్త అవతరింపజేసి తన శక్తిని సర్వ మానవాళికి తెలియజేశారు. అందుకే ఆ ప్రవక్త ప్రవచనాలు అందరి జీవనశైలికి హితోపదేశాలు అయ్యాయి.

మక్కాలో జననం..!
ముస్లింల సంప్రదాయం ప్రకారం ప్రవక్త జన్మించిన కారణంగా.. ఆయన జ్ణాపకార్థం ఈద్-ఎ-మిలాద్-ఉన్ పండుగను జరుపుకుంటారని 570లో రబీ ఉల్ అవ్వాల్ 12వ రోజు ప్రవక్త మక్కాలో జన్మించాడని చాలా మంది నమ్ముతారు. మిలాద్ ఉన్ నబి పండుగకే మరో పేరు కూడా ఉంది. దీన్నే మావ్లిద్ అన్ - నబీ అని కూడా అంటారు. అరబిక్ భాషలో ‘మావ్లిద్' అంటే జన్మనివ్వడం అని లేదా బిడ్డ పుట్టడం అని అర్థం. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మూడో నెల అయిన రబీ ఆల్-అవ్వాల్ నెలలో ఈ పండుగను జరుపుకుంటారు.

తొలిసారిగా ఎక్కడంటే..
మహమ్మద్ ప్రవక్త మరణించిన తర్వాత, ఆయన ఇంటి వారసులలో ఒకరు మక్కాను ప్రార్థన ప్రదేశంగా మార్చారు. 11వ శతాబ్దంలో ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబి వేడుకలు బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిని తొలి సారిగా ఈజిప్టు దేశంలో అధికారికంగా జరుపుకున్నారు. ఆ తర్వాత 12వ శతాబ్దంలో ఈజిప్టుతో పాటు సిరియా, మొరాకో, టర్కీ, స్పెయిన్ వంటి దేశాల్లో కూడా మిలాద్-ఉన్-నబి ఉత్సవాలు జరుపుకోవడం ప్రారంభించారు.

దానధర్మాలు..
మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా ముస్లింలు అందరూ తెల్లవారుజామునే నిద్ర లేచి మసీదులలో ప్రార్థనలు చేస్తారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత తమ సామర్థ్యం మేరకు పేదలకు దానధర్మాలు చేస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లోని కడపతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఈ పండుగను ముస్లిములతో పాటు హిందువులు కూడా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా అన్నదానాలు నిర్వహించడం ఈ పండుగ యొక్క ప్రత్యేకత. దీన్ని మతసామరస్యానికి ప్రతీకగా చెప్పొచ్చు.

ఈ ఏడాది ఎప్పుడు?
ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది మిలాద్ ఉన్ నబి అక్టోబర్ 8 అలాగే అక్టోబర్ 9వ తేదీన వస్తోంది.



Click it and Unblock the Notifications