For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మాంసాహారాన్ని ఆ రోజుల్లో అస్సలు తినకూడదు, మన పూర్వీకులు తీసుకొచ్చిన అద్భుతమైన సంప్రదాయం

బాడీకి కావాల్సిన ఐరన్, విటమిన్ B12, ఇతర కీలకమైన పోషకాలన్నీ మాంసం తినడం ద్వారా అందుతాయి. అందువల్ల అప్పుడప్పుడు మాంసం తినాలిన మన పెద్దలు ఈ సంప్రదాయాన్ని పరిచయం చేశారు. కానీ రానురాను మనిషి రోజూ మాంసం త

|

చాలా మంది హిందువులు కొన్ని ప్రత్యేక రోజుల్లో మాంసం తినరు. చికెన్, మటన్, చేపలను అస్సలు ముట్టుకోరు. కొన్ని ప్రత్యేక రోజుల్లో కేవలం శాకాహారం మాత్రమే తింటారు. ముఖ్యంగా సోమవారం, గురువారం, శనివారం హిందువులు మాంసాన్ని ముట్టరు. అలాగే ప్రతి మాసంలో వచ్చే ఏకాదశి రోజు కూడా కొందరు మాంసాన్ని ముట్టరు. ఇక సంక్రాంతి, దసరా, సంకటి చతుర్తి , ఆంగార్కి చతుర్ధి, ఏకాదశి, గుడిపదవా, అక్షయత్రుతియ, దీపావళి నిర్వహించుకునే రోజుల్లోనూ హిందువులు మాంసాన్ని అస్సలు ముట్టరు.

మనదేశంలో చాలా మంది సంస్కృతి, సాంప్రదాయాలకు ఎక్కువ విలువనిస్తారు. మన పూర్వికుల నుంచి వారంలో కొన్ని రోజులు మాంసం తినకుండా ఉండే అలవాటు ఉంది. అందుకు కొన్ని కారణాలున్నాయి. వారం మొత్తం మాంసాహారమేతింటే ఈ భూమిపై జీవరాశి మనుగడ లేకుండా పోతుంది. అందుకే వారంలో కొన్ని ప్రత్యేక రోజుల్లో జంతువులను, పక్షులను చంపడం హిందువులు పాపం గా భావిస్తారు. ఆ రోజు మాంసం తినడం కూడా మంచిది కాదని భావిస్తారు. ఒకవేళ తింటే ఏదైనా అపశకునం జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతారు.

రోజూ మాంసం తినడానికి అలవాటు

రోజూ మాంసం తినడానికి అలవాటు

బాడీకి కావాల్సిన ఐరన్, విటమిన్ B12, ఇతర కీలకమైన పోషకాలన్నీ మాంసం తినడం ద్వారా అందుతాయి. అందువల్ల అప్పుడప్పుడు మాంసం తినాలిన మన పెద్దలు ఈ సంప్రదాయాన్ని పరిచయం చేశారు. కానీ రానురాను మనిషి రోజూ మాంసం తినడానికి అలవాటు పడ్డాడు. ప్రతి రోజూ నేను చికెన్ బిర్యానీ తిన్నానని గొప్పగా చెప్పుకునేదాకా వెళ్లాడు. అలా రోజూ మాంసం తినడం ఆరోగ్యానికి మంచిదికాదు.

రకరకాల రోగాలు

రకరకాల రోగాలు

రోజూ మాంసాహారం తినడం వల్ల పైల్స్ వస్తాయి. అలాగే మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయి. పెద్దపేగు కాన్సర్ కు గురయ్యే అవకాశం ఉంది. అలాగే రక్తపోటు, గుండెపోటు బారినపడే అవకాశం ఉంది. అందువల్ల హిందూమత్రం ప్రకారం కొన్ని ఆచారాలను సంప్రదాయాలను ఏర్పరిచారు. ఇలాగైనా రోజూ మాంసాహారం తినడం మానుకుంటారనే ఈ సంప్రదాయాన్ని తీసుకొచ్చారు మనపెద్దలు.

Most Read :2019లో మీకు వివాహం కానుందో లేదో ఇక్కడ తెలుసుకోండిMost Read :2019లో మీకు వివాహం కానుందో లేదో ఇక్కడ తెలుసుకోండి

దేవుణ్ని పూజించే వారు తినకూడదని

దేవుణ్ని పూజించే వారు తినకూడదని

సోమవారం రోజూ శివున్ని పూజించే వారు తినకూడదని నిర్ణయించారు. ఒకవేళ తింటే పాపం వస్తుందని భక్తుల నమ్మకం.అలాగే మంగళవారం హనుమంతుడిని నమ్మేవారు తినొద్దని సూచించారు. గురువారం దత్తాత్రేయ, సాయిబాబాలకు సంబంధించిన రోజు ఆ రోజు మాంసాన్ని ముట్టకూడదు. శనివారం హనుమండు, వెంకటేశ్వరస్వామిలకు సంబంధించిన రోజు అందువల్ల మాంసాన్ని ముట్టకూడదని మన పెద్దలు నిర్ణయించారు.

ఒక్కో రోజు ఒక్కో దేవుడు పేరుతో

ఒక్కో రోజు ఒక్కో దేవుడు పేరుతో

ఇలా ఒక్కో రోజు ఒక్కో దేవుడి పేరు చెప్పి మన పూర్వికులు మాంసాహారం తినడాన్ని కాస్త నియంత్రించగలిగారు. అదే ఆచారాన్ని తరాలతరబడి మనం పాటిస్తున్నాం. అయినా ఇప్పటికీ కొందరు రోజూ మాంసాహారం తింటూనే ఉన్నారు. అలా తింటే మనకే నష్టం వస్తుందని గమనించే మన పెద్దలు ఈ సంప్రదాయాన్ని తీసుకోచ్చారు. సో ఫ్రెండ్స్ మీరు కూడా కనీసం మీ ఇష్ట దైవానికి సంబంధించిన రోజైనా మాంసాన్ని ముట్టకుండా ఉండండి. దీని వెనకాల ఉన్న పరమార్థం అర్థం చేసుకోండి.

Most Read :కష్టాలు తీరాలన్నా, విదేశాలకు వెళ్లాలనుకున్నా అక్కడ విమానం బొమ్మ సమర్పిస్తే చాలుMost Read :కష్టాలు తీరాలన్నా, విదేశాలకు వెళ్లాలనుకున్నా అక్కడ విమానం బొమ్మ సమర్పిస్తే చాలు

English summary

Why Hindus Do Not Eat Non Vegetarian Food on Particular Day

Hindus do not eat non vegetarian food like chicken, meat or fish or any other Non Vegs on particular days, not limited but including: Mondays, Thursdays, and Saturdays of every week, many more auspicious days like Yekadashi, Sankranti, Dussera, Sankashti Chaturthi, Angarki Chaturthi, Ekadashi, Gudhipadwa, Akshaytrutiya, Diwali (all the days).Amongst these, the reason for not eating meat on some particular days excluding weekly days is purely religious.
Desktop Bottom Promotion