Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
Womens day 2025: ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తి..వెండితెరపై మెరిసిపోతున్న తెలుగు హీరోయిన్
మహిళా దినోత్సవం సందర్భంగా బోల్డ్ స్కై తెలుగు ఒక కొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకొచ్చింది. చిన్న పల్లెటూరు ప్రాంతం నుంచి ఉన్నతస్థాయికి ఎదిగిన లేటెస్ట్ లాటెంట్ లను పరిచయం చేయడమే వేదికగా బోల్డ్ స్కై తెలుగు ముందుకొస్తుంది. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు అలుపుసొలుపులు దాటుకొని ఇప్పుడిప్పుడే కెరియర్ ప్రారంభిస్తూ సినీ ఇండస్ట్రీలో మంచిపేరు తెచ్చుకుంటున్నవారిలో యష్న మతులూరి ఒకరు. ఆమె సినీ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, యూట్యూబ్ తో మొదలై బిగ్ స్క్రీన్ పైకి వెళ్లే వరకు ఆమె జర్నీ ఎలా సాగింది, భవిష్యత్తుని ఆమె ఎలా డిజైన్ చేసుకుంది వంటి అనేక వివరాలను ఆమె మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం.
ఊరు, బ్యాక్ గ్రౌండ్
తాను పుట్టింది,పెరిగింది అంతా హైదరాబాద్ లోనే అని యష్న తెలిపింది. తన తల్లిదండ్రులది గుంటూరు జిల్లా అయినప్పటికీ వారు కొన్నేళ్ల క్రితమై హైదరాబాద్ లో స్థిరపడ్డారని,అలా తన స్కూలింగ్,కాలేజ్ మొత్తం భాగ్యనగరంలోనే జరిగినట్లు చెప్పింది. స్టాన్ లీ కాలేజ్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లు ఈ కుర్ర హీరోయిన్ చెప్పింది.

చిన్నప్పుడే ఆఫర్లు
తాను 3,4వ తరగతి చదువుతున్న సమయంలో చైల్డ్ ఆర్టిస్టుగా అవకాశాలు వచ్చాయని, అయితే తన తల్లి అంగీకరించకపోవడంతో వాటిని వదులుకోవాల్సివచ్చినట్లు యష్న చెప్పింది. మళ్లీ ఇప్పుడు అనుకోకుండా తన సొంత ఆసక్తితో తానే ఇండస్ట్రీలోకి వచ్చినట్లు తెలిపింది.
మొదట్లో తాను యూట్యబూట్ లో షార్ట్ ఫిలిమ్స్ తో నటించానని,తర్వాత నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలో నటించే అవకాశం లభించిందని, ఆ తర్వాత త్రిష మెయిన్ లీడ్ లో నటించిన బృంద అనే వెబ్ సీరిస్ లో తనకు త్రిష చెల్లిగా నటించే అవకాశమొచ్చినట్లు యష్న తెలిపింది.
మీరు ఎవరైనా సినీ ఇండస్ట్రీలో వారిలా ఎదగాలి అనే రోల్ మోడల్ హీరోయిన్ ఉన్నారా
తనకు త్రిష, జెనిలియా,శ్రేయా వంటి వారిని బాగా ఇష్టపడేదాన్నని, అయితే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తనకు జెనీలియాలా ఉండాలని ఇష్టమని తెలిపింది. జెనీలియా తన ఇన్స్పిరేషన్ అని యష్న తెలిపింది.
ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ఎన్ని
తాను ఏడు సినిమా,సిరీస్ లు రిలీజ్ కు రెడీగా ఉన్నాయని, అయితే ఆ ఏడింటిలో ఐదింటిలో తాను లీడ్ గానే నటించాను అని యష్న చెప్పింది. మిగతా 2 చాలా స్పెషల్ ప్రాజెక్ట్స్ అని తెలిపింది. ఒక దానికి మరో దానికి పోలిక లేని క్యారెకర్ట్స్ చేసినట్లు తెలిపింది. తనకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా అందులో నటించగలిగేలా ఉండాలనుకుంటానని,అదే సమయంలో వైవిధ్యమైన పాత్రలు తనకు లభిస్తున్నాయని తెలిపింది.
తెలుగమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయా
ఖచ్చితంగా ఉన్నాయని యష్న చెప్పింది. ఏదో సడెన్ గా వచ్చి తనకు అవకాశాలు అందరూ ఇచ్చేస్తారు అని అనుకోకూడదని, ఏదైతే బ్యాక్ గ్రైండ్ వర్క్ ఉంటదో అది చేయాలని,ముందు యాక్టింగ్ వంటి బేసిక్ విషయాలను నేర్చుకోవాలని తర్వాత అవకాశాలు వస్తాయని,ఓపికతో ఉండాలని యష్న చెప్పింది.
ఏ క్యారెక్టర్ అయినా చేస్తారా, తల్లిగా, అక్కగా ఇలా
తాను ఓ నటిగా ఏ పాత్రలో నటించడానికి అయినా ఇష్టపడతానని,తనకు ఎలాంటి బౌండరీస్ లేవని యష్న చెప్పింది.
డ్రీమ్ రోల్
తనకు పోకీరీలో ఇలియానా, ఆరెంజ్ లో ,బొమ్మరిల్లులో జెనీలియా చేసినటువంటి క్యారెక్టర్లు చేయాలని తనకు బాగా ఇష్టమని యష్న చెప్పింది.
ఆడవాళ్లు ఇంకా ఏ రంగంలో వెనుకబడ్డారు
ఖచ్చితంగా స్పోర్ట్స్ లో ఆడవాళ్లు వెనుకబడ్డారని, క్రీడా రంగంలో మహిళలు మరింత ఎదగాల్సి ఉందన్నారు.
డీ గ్లామర్ రోల్స్ కూడా చేస్తారా
అలాంటి పాత్రయే చేయాలని ఏమీ లేదు కానీ డీగ్లామర్ రోల్స్ చేయడం అనేది ఆ పాత్రను బట్టి ఆ సందర్భాన్ని బట్టి డిసైడ్ అవుతానని యష్న చెప్పింది.
బిగ్ బాస్ లో అవకాశం వస్తే వెళ్తారా
తనకు బిగ్ బాస్ లోకి వెళ్లాలన్న ఆలోచన ప్రస్తుతానికి లేదని యష్న చెప్పింది.
ఏ హీరోతో సినిమా చేయాలని ఉంది
తనకు అక్కినేని అఖిల్ తో సినిమా చేయాలని ఇష్టమని యష్న తెలిపింది.
తమిళ ఇండస్ట్రీ నుంచి అవకావం వస్తే వెళ్తారా
ఖచ్చితంగా వెళ్తాను. తమిళవాళ్లందరూ మన అవకాశాలు తీసుకుంటున్నప్పడు మనం ఎందుకు తమిళ ఇండస్ట్రీ నుంచి అవకాశం వస్తే వదులుకోవాలని యష్న చెప్పింది.
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఇచ్చే సందేశం
మనం ఇప్పడు 2025లో ఉన్నాం కాబట్టి మీ మీద మీరు నమ్మకం ఉంచి ఏ పనైనా చేయండి. మనం ఏ ఒత్తిడిని తీసుకోకుండా మనల్ని మనం బిల్డ్ చేసుకోవడమే కరెక్ట్ అని,అదే తాను నమ్ముతానని,అందరూ అదే చేయాలని యష్న తెలిపింద. పని ప్రదేశంలోనే లేక మరోచోటో ఒత్తిడులు ఉంటుంటాయని, అయితే వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదని, పాజిటివ్ గా మంచి రోజులు ముందున్నాయి అనే ఆలోచనతో ముందుకు సాగాలని చెప్పింది. బాధను కూడా ఎంజాయ్ చేయాలని యష్న చెప్నింది.
యష్న పెళ్లి ఎప్పుడు
తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఇష్టం లేదని యష్న చెప్పింది. తనకు డేట్ ఓకే.. కానీ పెళ్లి మీద ప్రస్తుతానికి ఇంట్రెస్ట్ లేదని యష్న చెప్పింది. సోషల్ మీడియా ద్వారా, బయట తనను చాలా మంది ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంటారని, అయితే వాటిని చూసి తాను ఎంజాయ్ చేస్తానని, కానీ ప్రేమ జోలికి వెళ్లేంత టైం తనకు ఇప్పడు లేదని, కెరీర్ మీదనే తన ఫోకస్ మొత్తం ఉన్నట్లు యష్న చెప్పింది.



Click it and Unblock the Notifications











