Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
85 ఏళ్ల చిరిగిన టీషర్ట్ ధర అన్ని లక్షలా.. స్పెషల్ ఏంటో తెలిస్తే మీరు కూడా కొనేస్తారు!
పాత వస్తువులు సాధారణంగానే చాలా ఖరీదు చేస్తాయి. యాంటిక్ వస్తువులను కొందరు కొన్ని లక్షలు వెచ్చించి కొంటుంటారు. మ్యూజియంలో ఉంచిన కొన్ని వస్తువులకు మాత్రం ధర ఆకాశాన్ని అంటుతుంది. ఒక్కోసారి ఆ వస్తువు ధర కోట్లలో కూడా ఉంటుంది. ఒక వస్తువు వయసు 30 నుంచి 40 సంవత్సరాలు ఉంటే దాని విలువ కచ్చితంగా లక్షలకు చేరుకుంటుంది. ఇలానే ఓ వ్యక్తి 85 సంవత్సరాల క్రితం నాటిది అంటే 1940వ సంవత్సరానికి చెందిన ఓ టీషర్ట్ అమ్మెందుకు ఆఫర్ ప్రకటించాడు. పూర్తిగా చిరిగిన ఆ టీషర్ట్ ధర ఎంత? ఎందుకు ఆయన అమ్మెందుకు ఆఫర్ ప్రకటించాడు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
టీషర్ట్ ధర ప్రత్యేకతలు
ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి 1940వ సంవత్సరానికి చెందిన ఓ టీషర్ట్‌ను తీసుకొచ్చాడు. ఆ టీషర్ట్ పూర్తిగా చినిగిపోయి ఉంది. అన్ని దశల్లో దానికి బొక్కలు ఉన్నాయి. ఇది అత్యంత పాతది కావడంతో పూర్తిగా నలిగిపోయింది. దీనికి ఆయన భారీగానే ధర చెప్పారు. ఆ చిరిగినా టీషర్ట్ ధర సరిగ్గా 2,500 డాలర్లు అని ప్రకటించాడు. అంటే భారతీయ కరెన్సీలో దాని ధర దాదాపు 2.14 లక్షల రూపాయలు. ఈ ధర విన్న వారు షాక్ అయ్యారు. 2.14 లక్షల రూపాయలతో స్టోర్‌లోని అన్ని బట్టలను కొనుగోలు చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. కానీ ఒక్క చిరిగిన టీ షర్టుకే ఇంత మొత్తం చెల్లించాల్సి రావడంతో జనం షాక్ అవుతున్నారు.

కొన్నా కూడా వేసుకోలేరు
ఈ టీషర్ట్‌ను 2.14 లక్షల రూపాయలతో కొన్నా కూడా వేసుకోలేకపోతారు. ఇంట్లోనే ఉంచుకొని దానిని చూస్తూ ఉండడం తప్ప ఇంకేమి చేయలేరు. అందుకే ఇంత ధర పెట్టి కొన్నా కూడా అది నిరుపయోగంగా మారుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. అసలు ఈ టీషర్ట్‌కు ఎందుకంత ధర అని అందరూ ప్రశ్నిస్తున్నారు.
అయితే ఈ టీషర్ట్ 85 సంవత్సరాల క్రితం నాటిది. ఇది దాని రూపం, దాని క్వాలిటీ కారణంగా అంత ధర పలకడం లేదు. కేవలం దాని వయసును బట్టి అంత ధర పలుకుతుంది. ఇది ఫుల్ స్లీవ్ స్వెట్ షర్ట్. ఎవరూ లేని పెద్ద ఇంట్లో ఈ టీ షర్ట్ దొరికినట్లు దాన్ని వేలం వేసిన వ్యక్తి ప్రకటించాడు. దాని ఆకారాన్ని చూస్తే ఎవరూ కూడా 10 రూపాయలకు కూడా దానిని కొనరు. కానీ అది 85 సంవత్సరాల క్రితం నాటిది కాబట్టి దానిని కొనేందుకు కొందరైనా వస్తారని ఆయన ఆశిస్తున్నాడు.



Click it and Unblock the Notifications