సోషల్‌ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్‌ లుక్‌ మీరూ ట్రై చేశారా.?

వచ్చి వారం కూడా కాలేదు. కానీ సోషల్‌ మీడియాను తెగ షేక్‌ చేస్తోంది. ఏఐ పుణ్యమా అని ఇన్‌స్టాగ్రామ్‌ ఓపెన్‌ చేసినా, వాట్సప్‌ స్టేటస్‌లు చూసినా, ఫేస్‌బుక్‌, ఎక్స్‌ లాంటి ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కడ చూసినా ఒక్కటే వైరల్‌.. అదే 1980’s రెట్రో లుక్‌ ట్రెండ్‌. ఈ క్లాసిక్‌ లుక్‌ కోసం జనాలు ఎగబడి తమకు నచ్చిన లుక్‌ను ట్రై చేసి ముచ్చట తీర్చుకుంటున్నారు. ఈ రెట్రో మేనియా సంగతులేంటో చూద్దాం..

1980 s retro trend going viral in social media know how to do this

1980’s సినిమాలు చూస్తే అర్థమవుతుంది. ఆ సినిమాల్లో హీరో, హీరోయున్ల గెటప్‌, కట్టుబొట్టు, అప్పుడే కొత్తగా వచ్చిన హీరోయిన్స్‌ క్లాసిక్ కాస్ట్యూమ్స్‌ లుక్స్‌.. ఇవన్నీ మనల్ని మళ్లీ ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఆ కాలం నాటి కథలతో ఈ కాలంలో సినిమాలు చూపించాలంటే కాస్ట్యూమ్‌ డిజైనర్స్‌ తీసుకునే ప్రత్యేక శ్రద్ధ మనకు ఆ పనితనంలోనే కనిపిస్తుంది. ఆ లుక్‌ ట్రై చేయాలంటే ఎంత కష్టమో అందులోకి వెళ్తే కానీ అర్థం కాదు.

వాహనం ఏ రంగులో ఉన్నా.. టైరు మాత్రం నల్లగానే ఎందుకుంటుందో తెలుసా?వాహనం ఏ రంగులో ఉన్నా.. టైరు మాత్రం నల్లగానే ఎందుకుంటుందో తెలుసా?

కానీ ఏఐ వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఏ లుక్‌ ట్రై చేయాలన్నా సెకన్లలో పని అయిపోతుంది. జస్ట్‌ ప్రాంప్ట్‌ ఇస్తే మనకు నచ్చినట్లుగా మనల్ని మార్చుకోవచ్చు. మన బీరువాలో లేని చీరలు, డ్రెస్సులు, నగలు, గాజులు, చెప్పులు, మేకప్‌ ఇలా ఒకటేమిటి ఎంతో కొత్తగా మనల్ని మనం చూసుకోవచ్చు. ఈ ఏఐ ఫొటోలను సడెన్‌గా చూస్తే నిజంగానే మనమేనా అనే సందేహం తప్పనిసరిగా వస్తుంది. అయితే ఇప్పటివరకూ ప్రెజెంట్‌ జనరేషన్ థీమ్‌తోనే మన లుక్స్‌ ట్రై చేశాం. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. కాస్త వెనక్కి వెళ్తూ ఈనాటి సీనియర్‌ హీరోల అలనాటి గెటప్స్‌లోకి మారిపోతున్నాం.. అదే 1980’s రెట్రో లుక్‌ ట్రెండ్‌.

1980 s retro trend going viral in social media know how to do this

ఈ ట్రెండ్‌ కోసం బీరువాల్లో, అల్మారాల్లో పాత దుస్తుల కోసం వెతకాల్సిన పనిలేదు. చేతిలో ఉన్న స్మార్ట్‌ ఫోన్‌తో ఒక్క సెల్ఫీతో సెకన్లలో నలభై ఏళ్ల వెనక్కి వెళ్లిపోవచ్చు. ఆ కాలంలో ప్రత్యేకమైన హెయిర్‌స్టైల్స్, పెద్దగా ఉండే సన్‌గ్లాసెస్, కలర్‌ఫుల్‌గా ఉండే దుస్తులతో స్టూడియో పోర్ట్రెయిట్స్‌తో ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ మన ముచ్చట తీరుస్తోంది. ఇందుకోసం మీరు సింగిల్‌గా తీయాలనుకుంటే ChatGPTలో లేదా ఇతర ఏఐ టూల్స్‌లో మీకు నచ్చిన సెల్ఫీని అప్‌లోడ్‌ చేయవచ్చు. లేదా ఫ్యామిలీతో కావాలనుకుంటే వారితో సెల్ఫీ దిగి అప్‌లోడ్‌ చేయాలి. ఫేస్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, కళ్లు మార్చకుండా 1980’s ట్రెండ్‌కి మార్చాలని సూచిస్తే సెకన్లలో మీరు వింటేజ్‌ లుక్‌లోకి రీక్రియేట్‌ అయిపోతారు.

1980 s retro trend going viral in social media know how to do this

వైరల్‌ ట్రెండ్‌

80ల నాటి క్లాసిక్ లైఫ్‌స్టైల్, ఆ సినిమాల వైబ్స్, ఎనలాగ్ ఫోటోగ్రఫీపై ఈనాటి జనరేషన్‌కి ఉన్న మక్కువే ఈ ట్రెండ్‌ వైరల్‌ అవ్వడానికి కారణం. సాధారణ యూజర్ల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు సైతం తమ రెట్రో లుక్స్‌ను షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో క్రేజ్‌ సంపాదిస్తున్నారు.

పైసా లేదని పెళ్లిళ్లు చేసుకోరు, కానీ పిల్లల్ని కంటారు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా.?పైసా లేదని పెళ్లిళ్లు చేసుకోరు, కానీ పిల్లల్ని కంటారు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా.?

మీరూ ఈ వింటేజ్‌ లుక్‌ను ట్రై చేయాలంటే ఏదైనా ఏఐ టూల్‌లో స్పష్టమైన ఫొటోలను అప్‌లోడ్‌ చేసి మీకు నచ్చిన ప్రాంప్ట్‌ ఇవ్వండి. క్షణాల్లో ఆ కాలం నాటి లైటింగ్‌, బ్యాక్‌గ్రౌండ్‌, హెయిర్‌స్టైల్స్‌, కాస్ట్యూమ్స్‌, లొకేషన్స్‌తో రెట్రో లుక్‌లోకి మారిపోతారు.

Story first published: Thursday, September 10, 2026, 10:41 [IST]
Desktop Bottom Promotion