Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
2013 కెఎఫ్ సిలో అలరించనున్న అందాల భామలు...
కింగ్ ఫిషర్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది అందాలు స్వేచ్చగా ఆరబోసే బికినీ భామలతో సర్వాంగ సుందరంగా రూపొందించే కేలండర్. ప్రతి ఏటా బికినీ భామల కేలండర్ రూపొందించడం విజయ్ మాల్యా ప్రత్యేకత. దశాబ్దకాలంగా ఇది నిర్విఘ్నంగా కొనసాగుతోంది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి క్యాలండర్ తయారు చేయడం ఆయన హాబీ. ఆ భామలతో భుజాలు భుజాలు కలిపి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఆయనకు మహా సరదా. ఈ విషయంలో విజయ్ మాల్యా కుమారుడు సిద్దార్థ మాల్యా తండ్రి లక్షణాలు పుణికిపుచ్చుకున్నాడు. ఆయన విలాసాలు తనయునికి బాగా అబ్బాయి. కింగ్ ఫిషర్ కేలండర్ 2013 అందాల భామలను ఈ ఏడాది ఆయనే ఎంపిక చేశారు.
విజయ్ మాల్యా యాజమాన్యంలోని యునైటెడ్ బ్రూబరీస్ గ్రూప్ 2003నుండి ఈ క్యాలెండర్ ను ప్రచురిస్తోంది. దాదాపు రెండు వందల మంది నుంచి వివిధ పరీక్షల ద్వారా 12మందిని ఎంపిక చేస్తారు. ఇందుకోసం కోట్ల రూపాయలను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తారు. మోడలింగ్, సినిమా రంగాలలోకి వెళ్లాలనుకునేవారికి కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వారు చాలా తేలికగా మోడలింగ్, చిత్రపరిశ్రమలో అడుగుపెట్టగలరు. వారిని వెతుక్కుంటూ అవకాశాలు వస్తాయి. సినీ, దర్శక, నిర్మాతలు కూడా ఈ కేలండర్ కు ఎంపికయ్యేవారి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కనపరుస్తారు. కత్రినా కైఫ్, దీపికా, యానగుప్తా, ఉజ్వల రౌత్, నర్గీస్ ఫాఖ్రి, లిసాహేడెన్, ఏంజెలా జాన్సన్ వంటి మోడల్స్, బాలీవుడ్ నటీమణులు ఈ క్యాలెండర్ ఎక్కిన వారే. ఈ భామల శరీరారకతులను వివిధ భంగిమలలో తమతమ కెమెరాలో బంధించడానికి పోటీపడతారు. వారి నైపుణ్యాన్ని క్రియేటివిటీని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారు. అవకాశాలు అందిపుచ్చుకోవడానికి వారికి ఇది ఒక వేదిక. తాజాగా 2013 కింగ్ ఫిషర్ క్యాలెండర్ కోసం కూడా అందమైన అమ్మాయిలు సిద్దమయ్యారు.

ఏశ్రా పటేల్: వదోదరాకు చెందిన గుజ్జు గర్ల్. ఈమె వయస్సు 24ఏళ్ళు. ఈమె ముంబాయ్ కు వచ్చినప్పుడు ఇంగ్లీషు అంతగా రాదు. అయినా కూడా ఆమె డ్రీమ్ నెరవేర్చుకోగల్గింది.

అనఘా సహమాతే: 24 ఏళ్ళ వయస్సు కలిగిన ఈమె ముంబాయ్ చి ముల్గీ.

ఇషితా వ్యాష్: మీకు గుర్తుందా ఈమె టెలివిజన్ ప్రోగ్రామ్ లో జాన్సీ కి రాణి పాత్రలో అద్భుతంగా నటించింది. ఆమె ఈమె. ఈమె 2013 సంవత్సరపు కింగ్ ఫిషర్ క్యాలెండర్ కు ఎంపిక అయ్యింది.

కాంచన్ టోమర్: కింగ్ ఫిషర్ కు సెలక్ట్ అయిన వారిలో చాలా యంగెస్ట్ గర్ల్ ఈమె.

లిన్ లైశ్రామ్: లిన్ లైశ్రామ్ మనిపూర్ గర్ల్. ఈమె వయస్సు 27ఏళ్ళు. ఈమె ఆల్రెడీ న్యూయార్క్ సిటీలో మోడల్ గా పనిచేస్తోంది.

నవీనా పెజటోనిక్: నవీనా పెజటోనిక్ పేరు చాలా విచిత్రంగా ఉంది కదూ. చూస్తుంటేనే తెలుస్తోంది. ఇది ఇండియన్ పేరు కాదు అని. అది అక్షరాల నిజం. ఎందుకంటే ఈమెది సెర్బియా దేశం.

నిఖితాషా మార్వా: ఈమె పుట్టింది అమెరికాలోనే అయినా ఇండియాలో ఉంటుందో. ఈమె 2009 మిస్స్ ఇండియా వర్డ్ వైడ్ లో ఎంపిక అయ్యింది.

రెబెకా: ఈ 23ఏళ్ళ గోవా బ్యూటీ మీద కింగ్ ఫిషర్ కళ్ళు పడ్డాయి. దాంతో 2013క్యాలెండర్ కు ఎంపిక అయ్యింది.

రునా లాహ: ఈమెది కోల్ కత్తా. ఈమె బికినీ మోడల్ ఎంపిక కోసం 30కేజీ బరువు కూడా తగ్గింది.

రుపాలి జంబూల్కర్: ఈ హాట్ బ్యూటీది నాగ్ పూర్. ఈమె వయస్సు 24ఏళ్ళు.

సుష్మిత సింఘా: ఈ రోల్ మోడల్ వయస్సు 23ఏళ్ళు. ఈమెది ముంబాయ్

నిబేదిత కర్మాకర్: మరో బ్యూటీ నిబేదిత కూడా ఈ కాంపిటీషన్ కు ఎంపికైంది.
2013 ఏడాది కేలండర్ భామల ఎంపిక కోసం ఎన్ డిటీవీ గుడ్ టైమ్స్ చానల్ లో నిర్వహించిన ‘హంట్ ఫర్ ది కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్స్ కార్యక్రమంలో సిద్దార్థ మాల్యా న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఆయనతో పాటు ప్రముఖ మోడల్ లిసా హేడన్, ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ అతుల్ కస్బేకర్ లు కూడా పాల్గొన్నారు. గోవా బీచ్ లో అందాల బామల హాట్ హాట్ ఫోజులు 12మంది భామల ఎంపిక కోసం పోటీ, స్టార్ హోటళ్లలో హంగామా. బికినీ దుస్తుల్లో అందగత్తెల ఒంపుసొంపులు, గిలిగింతలు పెట్టే ఫోజులు వారికి రకరకాల పోటీలు ప్రదర్శించారు. వారి భంగిమలను కెమెరాలలో బంధించడం ఫోటోగ్రాఫర్లకు ఒక ఛాలెంజ్. భామల అందచందాలు, హావభావాలు, బికినీ దుస్తుల్లో వారి ఒంపుసొంపులు సొగసులు ఆధారంగా మార్కుల వేస్తారు. అనేక పరీక్షలు నిర్వహించిన తర్వాత 12మంది సుందరాంగులను ఎంపిక చేశారు. వారి ఫోటోలతోనే ఈ కొత్త సవంత్సరం క్యాలెండర్ ముస్తాబవుతోంది.



Click it and Unblock the Notifications











