Latest Updates
-
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.?
దుర్గాష్టమి సందర్భంగా 5 ఫేమస్ బెంగాళీ శారీస్
స్త్రీ అంటే సౌందర్యం.. సుకుమారం. ఆ సౌందర్యం మరింత అందంగా కనిపించేది ఎప్పుడంటే స్త్రీ చీర కట్టుకొన్నప్పుడే.. ఆడవారి అందానికి వన్నె తెచ్చే వాటిలో చీరకట్టుని మించింది లేదు. నిండైన చీరకట్టు హుందాతనాన్ని తెస్తుంది. నలుగురిలో మెరిసేలా చేస్తుంది. సందర్భాన్ని బట్టి చీరను ఎంచుకోవడమే..మనదేశంలో అందమైన దుస్తుల గురించి చెప్పుకోవాలంటే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది చీరే. ఇది పాతబడటం అంటూ ఉండదు. నేటికీ సరికొత్త ప్యాషన్ల సరసన రారాణిలా నిలిచివుంది. శరీర ఆకృతికి తగినట్టుగా మలచబడి రూపొందినది చీర. మన దేశంలో చాలా విషయాల్లో కనిపించే భిన్నత్వంలో ఏకత్వం చీర విషయంలో అటుఇటుగా మారుతుంది. ఏకత్వంలో భిన్నత్వం అనిపించేట్టుగా చీరనే వివిధ రాష్ట్రాల్లో భిన్నరీతుల్లో కడుతుంటారు. ఎలా కట్టినా సొగసుగా కనిపించే చీర కట్టులోని పద్ధతుల గురించి
గుజరాత్, ఒరిస్సా, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో మహిళలు పైటను ముందుకు తీసుకువచ్చి కట్టుకుంటారు. సీదాపల్లాగా పిలువబడే ఈ కట్టు చాలా అందంగా కనబడుతుంది. ముఖ్యంగా బాగా రిచ్‌లుక్‌తో ఉండే పైటంచు ఉన్న చీరల్ని ఇలా కడితే మరింత శోభాయమానంగా ఉంటుంది. ఈ కట్టుకి, సాధారణ కట్టుకి ఉండే తేడా కుచ్చిళ్లు వ్యతిరేకదిశలో పెట్టటం, పైట వెనుక నుంచి కుడిభుజంమీదుగా ముందుకు రావటం. ఒక పక్క చెంగుని నడుము వద్ద దోపి మిగిలినది వదిలేస్తారు. అస్సాంలో చీరకట్టుని మేఖల ఛదార్ అంటారు. వీరు పొడుగ్గా ఉండే లంగా ధరిస్తారు. దీనికి చాలా పెద్ద అంచు ఉంటుంది. దీనిపైన జాకెట్టు ఆఫ్‌శారీ ధరిస్తారు. దక్షిణ భారతదేశంలో పెళ్లికాని అమ్మాయిలు ధరించే ఓణిలాంటిది ఇది.
తర్వాత సాధా వైట్ సారికి రెడ్ కలర్ బాడర్ ఉన్నటువంటివి బెంగాలీయులకు మరింత సాంప్రధాయ లుక్ ను అందిస్తుంది. బెంగాలీలు సాంప్రధాయ దుస్తులుగా ధరించే వాలి చాలా రకాలున్నాయి. వాటిలో టాంట్, ప్యూర్ సిల్క్, జమ్దాని, కాంతా స్టిచ్, ప్యూర్ కాటన్, ఢాకా, థంగాలి, ముర్షిదాబాద్ సిల్క్, శాంతిపూర్ కాటన్, ఫులిలా మరియు బాలూచారి సిల్క్, మరికొన్ని ఉన్నాయి.. మరి ఆ ఎవర్ గ్రీన్ సారీల గురించి పూర్తిగా తెలుసుకుందాం...

1. టంట్: పశ్చిమబెంగాల్ లో తయారయ్యే ఇది అందమైనటువంటి హాండ్ లూమ్ ప్రొడక్ట్. ఇది అక్కడి మహిళలందరూ అమితంగా ఇష్టపడుతారు. ఈ ట్రెడిషినల్ బెంగాలీ సారి, సారిమొత్తం మల్లెపువ్వులాంటి తెలుసు ఉండి, బాడర్ ఎరుపు రంగులో ఉంటుంది. అక్కడ ఉండే ప్రజలు ఈ సారీలను సాంప్రదాయ పండుగలకు మరియు దుర్గా పూజకు టంట్ శారీస్ ఎక్కువగా కట్టుకొని సంతోషిస్తారు.
2. ప్యూర్ సిల్క్: సిల్క్ సారీస్ అంటేనే భారతీయ మహిళలు అమితంగా ఇష్టపడుతారు. సిల్క్ అనే అద్భుతమైన పేరు చాలా మంది పడిపోతారు. ఎందుకంటే సిల్క్ శారీస్ అంత అందాన్ని, ఆకర్షణను ఇస్తుంది. సిల్క్ చీరలు ఖరీదు ఎక్కువగా ఉంటాయి.ప్యూర్ సిల్క్ లో కూడా చాలా వెరైటీలున్నాయి. అందులో కోరియల్, గరడ్, మస్లిన్, మూగ, కటన్ మరియు బలుఛారి సిల్క్. జర్దోసి వర్క్ చేసినటువంటి ప్యూర్ సిల్క్ శారీ మరియు బెనారస్ సిల్క్ ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రసిద్ది.
3. జందానీ: ఇది కాటన్ హాండ్ లూమ్ ఫ్యాబ్రిక్ మరియు వీటిని స్వచ్చమైన మలుచని వస్త్రంతో చేత్తో తయారు చేస్తారు. దీనికి చాలా టైం పడుతుంది. మరియు శ్రమ, శ్రామికులు కూడా ఎక్కువే. ఈ జందానీ చీర తయారవ్వడానికి కనీసం ఇక సంవత్సరం పడుతుంది . ఈ జందానీ చీరల్లో ఎక్కువగా ఇష్టపడే కాంబినేషన్స్ కాటన్ గోల్డ్ థ్రెడ్ తో తయారు చేసిన వైట్ అండ్ గ్రే. ఈ శారీలను చేనేత కార్మికులు చాలా క్లిష్టంగా తయారు చేస్తారు.
4. కాంతా స్టిచ్: కాంతస్టిచ్ ఎంబ్రాయిడరీ సారీ వీటిని ఎక్కుగా గ్రామీన ప్రాంతాల్లో ధరిస్తారు. ఈ ఎంబ్రాయిడరీ శారీస్ చాలా ప్రసిద్ది. కాంత శారీస్ మీద రోజు కార్యక్రమాలు, జంతు బొమ్మలు, దుస్తుల మీద పువ్వులు ఫ్యాబ్రియే చేయబడి ఉంటాయి. ఎంబ్రాయిడరీ సారి కొద్దిగా అలలులాగే మిరియు ముడతల రూపాన్ని కలిగిస్తుంది. ఏరా కాంత్ స్టిచ్ గతంలో ఉపయోగించే వారు అయితే ఇప్పుడు మళ్ళీ పెళ్ళి దుస్తుల తయారీలోనూ సాంప్రదాయ దుస్తుల తయారీలోనూ ఆల్ట్రామోడ్రన్ రూపకల్పనలో అందమైన మిశ్రమం కలిగి ఉన్నాయి.
5. కాటన్ శారీ: బెంగాళీ మహిళలు అమితంగా ఇష్టపడేది కాటన్ శారీస్. పశ్చిమ బెంగాల్ వాతావరణం బట్టి మహిళలు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్స్ సౌకర్యంగా ఉండే వస్త్రాలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అయితే వీటిని మెయింటైన్ చేయడం కొద్దిగా కష్టమైనప్పటికీ(ప్రతి సారీ గంజిపెట్టి, ఐరన్ చేయడంతో) వీటి అందం మాత్రం రెట్టింపే...బెంగాళ్ మహిళలకు కాటన్ శారీస్ మొదటి చాయిస్. తర్వాతే మరేదైనా...
2012 సంవత్సరంలో చాలా దుస్తుల అలంకరణలో విభిన్న రాకాలు ఉన్నాయి. రోజు రోజుకు ఫాషన్ రంగం ముందుంటోంది. అయితే చీర కట్టు, చీర అందం మాత్రం వన్నెతగ్గని పసిడిలా ఎప్పటికీ అలాగే నిలిచి ఉంటోంది. చీరకట్టులో పద్దతుల మారుతున్నా చీర అందం చీరదే చీర. అది ఈ సంవత్సరం జరిగిన ఫ్యాషన్ షోలను రేఖ, విద్యాబాలన్, రాణీ ముఖర్జీ, బిపాసాబసు కట్టిన చీర కట్టు చూస్తే కళ్ళు మిరుమిట్లు గొలిపాయి.



Click it and Unblock the Notifications