Latest Updates
-
వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ఈ 'దేశీ' చిట్కాలు పాటించండి.. ఎండల నుంచి ఉపశమనం ఎలా? -
మండే ఎండలకు చెక్.. ఇంట్లో ఉండే పండ్లతోనే చల్లటి, క్రీమీ ఐస్ క్రీమ్ తయారీ! -
మీ చుట్టూ ఉన్న తేనె పూసిన కత్తులను ఎలా గుర్తించాలి? -
నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి.. డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
జిమ్ వద్దు, కఠిన డైట్ వద్దు..3 నెలల్లో 12 కిలోలు తగ్గిన డాక్టర్ సీక్రెట్ ఇదే! -
రవి యోగం, సిద్ధ యోగం కలయిక.. ఏప్రిల్ 26న ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
వేళ్లు కూడా నాకి నాకి తినే కొత్తిమీర పన్నీర్ కర్రీ..రోటీ, నాన్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
సండే స్పెషల్: పుల్లపుల్లగా, కారంకారంగా మామిడికాయ మటన్ కర్రీ.. టేస్ట్ కిర్రాక్! -
ఎండలు మండిపోతున్నాయా? వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు ఇవే! -
మోహినీ ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే పారణ సమయాలు, నియమాలు తప్పక తెలుసుకోండి!
దసరా స్పెషల్... దుర్గామాత వివిధ రూపాల్లో ..
దుర్గాపుజా మన ఇండియాలోని పశ్చిమ బెంగాల్ లో ఎక్కువగా.. చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొంటారు. ఈ దసరాను వారు సహజంగా దుర్గోత్సవ లేదా దుర్గా పూజ అని పిలుచుకొంటారు. బెంగాల్‌లో 9 రోజులపాటు, దుర్గాంబని ఆరాధించి, 10వ రోజున, సముద్రంలోనో, నదిలోనో, చెరువులోనో నిమజ్జనం చేస్తారు. బెంగాల్, అస్సామ్, ఒరిస్సాలలో, దుర్గామాతాని శక్తికి సంకేతంగా, కాళికగా కూడా కొలుస్తారని మనకి తెలిసిందే!
దుర్గపూజ అవగానే కలకత్తా నగరం మరో ఉత్సవం జరుపుకోవడానికి సన్నద్ధం అవుతుంది. అదే కాళీ పూజ. చెడును పారదోలే అమ్మవారిగా కాళీదేవిని పూజిస్తారు. ఒకచేత నరికిన తల పట్టుకుని మరో చేత ఖడ్గం దాల్చి భయంకరిగా కాళీమాతను చిత్రిస్తారు. కపాలాల మాల వేసుకుని శివుడి ఛాతీపై కాలిపై నిలబడి వున్నట్లు కాళీమాతను చిత్రిస్తారు. శుక్లపక్షం మొదటిరోజు అర్థరాత్రి సాధారణంగా కలకత్తాలో కాళీపూజ జరుపుతారు. ప్రతి ఇంట్లో దివ్వెలు, కొవ్వొత్తులు దేదీప్యమానంగా వెలుగుతాయి. పిల్లలు వివిధరకాల టపాకాయలు వెలిగించి వేడుకలు చేసుకుంటారు. నిజాని కలకత్తా కాళీపూజలో టపాకాయలు కాల్చడం ఒక ముఖ్యమైన ఘట్టం. కానీ కాళీపూజ రోజుల్లో శబ్దం చేసే టపాసులు కాల్చడం నిషిద్ధం. కాళీమాత-కాళీపూజ పురాణం భారతీయ సంస్కృతిలో ఓ ముఖ్యాంశం. అనంత విశ్వ చైతన్యానికి ప్రతీకగా శక్తి స్వరూపిణిగా ఆ అమ్మ మనముందుంది. ఆమెకు అనంత శక్తులున్నాయని హిందూ పురాణాలు ఘోషిస్తున్నాయి. కలకత్తాలో రెండు ప్రముఖ కాళీ ఆలయాలు దక్షిణేశ్వర్, కాళీఘాట్.
మా దుర్గను మహిశాషుర మర్ధినిగా పిలుచుకుంటారు. మహిశాషుర మర్ధిని, మహిశాషురున్ని సంహరించడం వల్ల వచ్చింది.రాక్షసుడు మహిషాసురుడిని కాళికా దేవీ సంహరించినందుకు గుర్తుగా మనం ఈ నవరాత్రి వేడుకలు జరుపుకుంటాం. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారతదేశంలో, అన్ని పండుగలూ జరుపుకునే పద్ధతులలో ఎన్నో వైవిధ్యాలు గోచరిస్తాయి. ఇక, దసరా పండుగల గురించి వేరే చెప్పాలా?

బ్లూ మూన్ బ్యూటీ: దుర్గాదేవి మహిశాషురున్ని 10వ రోజును సంహరిస్తుంది. రాత్రి సమయంలో సంహరించిదనడానికి ఇది ఒక నిదర్శనం. చీకట్లో మూన్ లైట్ లో బ్లూ కలర్ లో హైలైట్ అయ్యేవిధంగా ఈ విగ్రహాల్ని రూపొందించారు.

బంగారు వర్ణంలో: బంగారు వర్ణంలో దుర్గామా నాట్యం చేస్తున్న దృష్యం అద్భుతంగా రూపొందించబడినది. నరకాసురున్ని సంహరించే విధానం కూడా అద్భుతంగా రూపొందించారు.

మట్టితో తయారు చేసిన విగ్రహాలు: చూడటానికి చాలా షైనింగ్ తో మెరుస్తుంటాయి. మట్టి కలర్ ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.

విలేజ్ థీమ్: దుర్గా మాత్ర గ్రామదేవతలా అలంకరణ. చీర కట్టు బెంగాల్ ట్రెడిషన్ కు సూటబుల్ గా అలంకరణ అద్భుతంగా కనబడేట్లు ఉంది. దుర్గా మాత తన చేతిలో ఏనుగు తల ఉన్న బేబిని పట్టుకొన్నవిధానం చిన్న వినాయకున్ని తలపిస్తోంది.

దైవ విగ్రహం: దుర్గా దేవి ఈ విగ్రహం లో చాలా దివ్యంగా కనబడుతోంది . ఈ తెల్లని రంగులో 22చేతుల్లో అన్నింటిలో ఆయుధాలు కలిగి ప్రశాంతతకు చిహ్నంగా కనబడుతోంది.

శక్తిగా : ఈ దేవ విగ్రం పది చేతులతో మహిశాసురిణి సంహరించడానికి రెడీగా ఉన్న ఆకారం చూడటానికి చాలా డిఫరెంట్ గా శక్తివంతంగా కనబడుతోంది.

సాంప్రదాయ శిల్పం: ఇతర పురాతన శిల్పాలు, ఆలయాల వలె, ఈ దుర్గా విగ్రం వివిధ రకాల్లో క్లాసిక్ గా కనిపిస్తోంది.

వారియర్: దెయ్యాల రాజుపై దాడికి సిద్దంగా ఉన్న దుర్గను తలపిస్తోంది. పది ఆయుధాలతో కలిగి దుర్గా గణపతి, విశ్వకర్మ, సరస్వతి, లక్ష్మి రూపాలను కలిగి ఉన్నది.

బెంగాల్ బ్యూటీ: బెంగాల్ సాంప్రదాయ దుస్తులైన వైట్ శారీ, రెండ్ బాడర్ శారీ అలంకరణలో దుర్గా విగ్రహం అందంగా కనబడుతోంది. విగ్రహంలో కర్లీ లాంగ్ హెయిర్ ఫర్ ఫెక్ట్ గా ఉన్నాయి. మిగిలిన విగ్రహాలు కూడా సాంప్రదాయంగా దోతిలో చూడ చక్కగా ఉన్నాయి.

మహిశాసుర మర్ధిని: ఈ విగ్రహం దుర్గాదేవి తన త్రిశులతో దెయ్యాల రాజును చంపేవిధంగా చూపిస్తోంది. అక్కడున్న గణేషుడు, కార్తీక్ కళాత్మకంగా కనిపిస్తోంది.
కర్ణాటక రాష్ట్రంలో...కర్ణాటక రాష్ట్రంలో, ఆయుధపూజకి ప్రాముఖ్యత ఎక్కువ. దైనందిన జీవితంలో ఉపయోగించే, కంప్యూటర్స్, పుస్తకాలూ, శకటాలూ, వంటింటి సామాగ్రి కూడా ఈ పూజలలో చోటు చేసుకుంటాయి. రైతులు వ్యవసాయంలో ఉపయోగించే పనిముట్లని పూజిస్తారు. పరిశ్రమలలో యంత్రాలకి పూజలు జరుపుతారు.
తమిళనాడులో...తమిళనాడులో, నవరాత్రులలో మొదటి మూడు రోజులూ లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఆ తరువాత 3 రోజులపాటు సరస్వతీ పూజ జరుగుతుంది. చివరి మూడు నాళ్లూ, శక్తి(దుర్గ), ఇంటింటా, వాడవాడలా విహరిస్తుంది. గుజరాత్‌లో...గుజరాత్‌లో సాయంత్రాలూ, రాత్రులూ రమణీయమైన 'గర్జా' నృత్యరూపకాలతో కనువిందు చేస్తాయి. స్త్రీలు మట్టి ప్రమిదలలో వెలిగించిన దీపాల చుట్టూ, భక్తి గీతాలు పాడుతూ చప్పట్లు కొడుతూ, ప్రదక్షిణలు చేస్తారు.
పంజాబ్‌లో...పంజాబ్‌లో నవరాత్రులు ఉపవాసాల పర్వదినాలు. ఇంటిల్లిపాదీ ఉపవాసాలు చేసి, దైవనామ స్మరణ చేస్తూ రాత్రుళ్లు కూడా జాగరణ చేస్తారు. ఉత్తర భారతంలో...ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లి, హర్యానా, వంటి ఉత్తరాది రాష్ట్రాలలో, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో కూడా దశ-హరా సందర్భంగా శ్రీరాముడిని కొలుస్తారు. రామాయణంలోని కథలు ఇతివృత్తాలుగా, దసరా, 10 రోజులపాటూ, నాటికలనీ, నాటకాలనీ ప్రదర్శిస్తారు. వీటిని 'రామలీల'లని అంటారు. ఒరిస్సాలో విజయదశమి సందర్భంలో జరిగే దుర్గపూజ రెండురకాలు. శక్తిపీఠాలలో, 10 నుంచి 16 రోజులపాటు, నిత్యం షోడశోపచార పూజలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో, అనాదిగా, ఇంటింటా, విజయదశమి వైశిష్ట్యాన్ని సంతరించుకుంది. కొత్త కార్యక్రమాలూ, వ్యాపారాలూ, పరిశ్రమలూ చేపట్టడానికీ, వినూత్న వస్తు, వాహనాలు కొనడానికీ, విజయదశమి కోసమే వేచి ఉంటారు. మహారాష్ట్రలో శాలివాహన శక హైందవ పంచాగం ప్రకారం, ఆశ్వయుజ మాసంలో దశమి తిథినాడు అంటే 10వ రోజున, దశ-హరా జరుపుకుంటారు. ఏప్రదేశంలో ఎలా జరుపుకొన్నా దుర్గామాతను వివిధ రూపాల్లో మట్టితో తీర్చిదిద్దుతారు. అవి ఇంతకమునుపు మీరు చూసి ఉండరు అలాంటి ప్రతిమలు మీకోసం...



Click it and Unblock the Notifications