Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఉద్యోగస్తులకు ఆదర్శవంతమైన కార్యాలయం ఎలా?
ఉద్యోగస్తులకు అనుకూలమైన వాతావరణం ఆఫీస్ లో వుంటే, ఆ కంపెనీ అభివృద్ధి కూడా చెందుతుంది. వ్యక్తికి , వ్యక్తికి మధ్య బేధాభిప్రాయాలుంటాయి. అన్ని సౌకర్యాలు వున్న సరైన ఆఫీస్, ఉద్యోగస్తులు ఆసక్తితో పనిచేయటానికి ప్రోత్సహిస్తుంది. ఆఫీస్ లో ఉద్యోగస్తులకు అటువంటి వాతావరణం ఎలా కల్పించాలనేదానికి కొన్ని చిట్కాలు చూడండి.

స్నేహ పూరిత వాతావరణం - ప్రతివ్యక్తి కూడా స్నేహంగా, సహకారంతో, గౌరవంగా వుండే వారితో పనిచేయటానికి ప్రయత్నిస్తారు. స్నేహపూరిత వాతవరణం ఆఫీసులో పని మెరుగుపరుస్తుంది. మంచి సంబంధాలున్న యాజమాన్యం ఉద్యోగస్తులను ప్రోత్సహిస్తుంది. కొన్ని ఆఫీసులు తమ ఉద్యోగస్తుల పెంపుడు జంతువులను కూడా కార్యాలయంలోకి అనుమతిస్తాయి. గంటల తరబడి కూర్చునే వాతావరణంలో స్నేహ సంబంధాలుండాలి.
పనిలో సౌకర్యం - ఉద్యోగస్తులకు సౌకర్యాలు బాగుండాలి. సూపర్ వైజర్లనుండి తరచుగా జోక్యం లేదా ఆక్షేపణలు ఉద్యోగి సౌకర్యాన్ని భంగపరుస్తాయి. సరైన ఆదేశాలతో స్వేచ్ఛగా స్వతంత్రంగా పనిచేయటం ఆదర్శ పనితనం.
ఇంటీరియర్ అలంకరణ - ఆఫీసులో పనిచేసే చోట మంచి వెలుగు లేదా లైటింగ్, శుభ్రత, సౌకర్యవంతమైన ఫర్నిచర్ వంటివి ఉద్యోగి పనికిఆహ్లాదం కలిగించి ఉత్పాదకతను పెంచుతాయి. ఆ కారణంగానే బహుళ జాతి కంపెనీలు నేడు తమ ఆఫీస్ ఇంటీరియర్ అలంకరణను ఎంతో మెరుగుపరుస్తున్నాయి. లోపలి వాతావరణం సరిగా లేకుంటే ఉద్యోగస్తులు ప్రతిరోజూ పనికి రావటానికి ఇష్టపడరు. అవసరపడితే, కొన్ని పెయింటింగ్ లు, సమాచారం ఇచ్చే ఛార్టులు వంటివి పెట్టి సిబ్బందికి ఆఫీస్ పట్ల ఆసక్తి కలిగించాలి. అక్వేరియం వంటివి పెడితే కూడా అందంగా వుండటమే కాదు, సిబ్బందికి సంతోషం కలిగించి అధిక సమయం సౌకర్యంగా గడిపేలా చేస్తాయి.
శుభ్రత - ఆఫీస్ చుట్టు పక్కల, లోపల ఎంతో శుభ్రంగా వుండాలి. చెడు వాసనలు వుండరాదు. మురికి పట్టిన, అనారోగ్య పరిస్ధితులలో ఉద్యోగస్తులు రోగాలపాలు అవుతారు. కనుక కంపెనీలు పరిశుభ్రత, సిబ్బంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.
కొత్త ఆలోచనలా? ప్రశంసించండి - కంపెనీ యాజమాన్యం కొత్త ఐడియాలను ఆహ్వానించాలి. ఉద్యోగస్తులను ప్రోత్సహించాలి. ఈ రకమైన సరళత, ఉత్పాదకతలను పెంచుతుంది. అవసరమనుకుంటే, సిబ్బందికి అదనంగా క్రీడలు, ఇతర రంగాలలో కొన్ని కార్యకలాపాలను ప్రోత్సహించి వారిలోని సృజనాత్మకతను పెంచాలి.



Click it and Unblock the Notifications