Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
ఉగాది పండుగ ప్రాధాన్యత!
ఉగాది పండుగ ప్రాధాన్యత!

ఈ ఉగాది పండుగ రోజున అందరూ ఉదయం వేళ త్వరగా నిద్రలేచి తలంటు స్నానాలు చేస్తారు. కొత్త బట్టలు ధరిస్తారు. ఇంటి ముంగిట మామిడాకుల తోరణాలు కడతారు. ఇంటి ముందట ముగ్గులు వేసి ఆనిందిస్తారు. వసంత లక్ష్మిని స్వాగతిస్తారు. షడ్రుచులతో కూడిన ఉగాది ప్రసాదాన్ని పంచాంగానికి, దేవతలకు నైవేద్యం చేసి తమ భవిష్యత్ జీవితాలు ఆనందంగా సాగాలని కోరుతూ ఉగాది పచ్చడి తింటారు. వైద్య పరంగా ఈ పచ్చడి వ్యాధినిరోధక శక్తిని కలిగిస్తుందంటారు.
ఇక ఉదయంవేళ, లేదా సాయంత్రం సమయాలలో పంచాంగ శ్రవణం చేస్తారు. ఉగాది పండుగరోజున అందరూ కలిసి పండితులను ఆహ్వానించి వారిని సన్మానించి పంచాంగ శ్రవణం చేయటం కూడా చేస్తారు. ఆ నూతన సంవత్సరంలోని శుభాలను అశుభాలను తెలుసుకొని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని ఆచరించేందుకు మొదలుపెడతారు.
పంచాంగ శ్రవణం అంటే అయిదు అంగాలని అర్ధం చెపుతారు. ఇందులో తిధి, వార, నక్షత్ర, యోగం, కరణం అని అయిదు అంగాలుంటాయి. వరుసగా ఇవి మానవునికి సంపద, ఆయుష్షు, పాప ప్రక్షాళన, వ్యాధి నివారణ, గంగాస్నాన పుణ్యఫలం వస్తాయని విశ్వసిస్తారు. అందరికి ఆనందం కలిగించే ఈ ఉగాది ఆయురారోగ్యాలు, సంపదలు, సుఖవంత జీవనం అందించాలని ఆశిస్తూ, ఉగాది శుభాకాంక్షలు.



Click it and Unblock the Notifications
