Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
సూపర్ స్టార్ రజనీ స్టైల్ లో ఆయనకాయనే సాటి...
రజనీకాంత్ స్టైల్ గురించి ... ఆయన సినిమాలు సాధించిన విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి సినిమాలో సరికొత్త అవతారంతో కనువిందుచేసే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీకాంత్ తలతిప్పినా, కన్ను కదిపినా, కాలు కదిపినా సంచలనమే. స్టైల్‌లో ఆయనకాయనే సాటి. సిగరెట్‌ను గాల్లోకి ఎగిరేసి పెదాలతో పట్టుకోవడం, దాన్ని అగ్గిపుల్లతో ఇంకా స్టైల్ గా వెలిగించుకోవడం లాంటి స్టైల్స్ ఇండియన్ స్క్రీన్‌పై మరెవ్వరికీ సాధ్యం కాదంటే అతిశయోక్తికాదు. కమల్ హాసన్‌లా ఆయనకు నేషనల్ అవార్డు రాకపోవచ్చు. కానీ ప్రేక్షకుల చప్పట్లు, ఈలలే ఆయనకు వేలకొద్ది నేషనల్ అవార్డులతో సమానం. దక్షిణ భారత చలన చిత్ర చరిత్రలో ఎన్టీఆర్, ఎమ్జీఆర్‌ల తరువాత అంతులేని అభిమాన జన సం దోహం ఉందంటే అది రజనీకాంత్ ఒక్కడికే. మరే నటుడికి కూడా ఇంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదంటే అతిశయోక్తి కాదు.
సూపర్ స్టార్ రజనీకాంత్ విషయంలో అనేక అతిశయోక్తులు ప్రచారంలో ఉంటాయి. ఆయన సినిమాలో ఫైట్లు, ఆయన స్టైల్ నుచూసి ఇంటర్నెట్ లో ప్రచారంలో ఉన్న ఫన్నీపోస్ట్ ల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. ఆయనను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ఒక అతీతమైన శక్తులున్న వ్యక్తిగా గుర్తిస్తుంటారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ పుట్టిన రోజుకు సంబంధించి మరో వింత ఒరిజినల్ గా రజనీకాంత్ పుట్టిన రోజు డిసెంబర్ 12. దానికి తోడు ఈ ఏడాదిని కూడా కలిపితే...12.12.12న రజనీ కాంత్ బర్త్ డే. ఈ రోజు అనగా 12-12-12న సూపర్ స్టార్ రజనీకాంత్ 63వ ఏట అడుగుపెట్టడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. మరి వారి ఫ్యాన్స్ తో పాటు బోల్డ్ స్కై టీమ్ కూడా రజనీకాంత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ... రజనీ బర్త్ డే గిప్ట్ గా కొన్ని పేమస్ స్టైల్స్ ను అందిస్తున్నాం.. చూసి ఆనందించండి...

స్ట్రిట్ పోలీస్ ఆఫీసర్: సాధారణ కూల్ పోలీస్ డ్రెస్ లో కంటే, కొద్దిగా పొడవైన మీసాలతో, గంబీరమైన పోలీస్ డ్రెస్ లో ఫర్ ఫెక్ట్ సీరియస్ లా ఎన్ఫోర్స్ మెంట్ ఆఫీసర్ గా గంభీరంగా కనబడుతున్నాడు.

రోమియో లుక్ తో: పెద్ద కళ్ళు, చిందవందరగా ఉన్నకురులు, దూరపు ఆలోచనతో కనబడే ఏ వ్యక్తి అయినా సరే వారిలో దాగున్న రోమియోను లుక్ ను కనబరిచేలా చేస్తాయి.

రౌడీ రజనీ: మిస్టర్ రాథోడ్ రౌడ్ రీసెంట్ గా వచ్చివెళ్ళింది. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఓరిజినల్ రౌడీ స్టార్. తలకు కట్టిన కలర్ ఫుల్ స్కార్ఫ్ మరియు ఫ్రెంచ్ కట్ లో గెడ్డం ఫర్ ఫెక్ట్ రౌడీ లుక్ ను అందిస్తోంది.

డీసెంట్ లుక్ తో: ఈ గెటప్ రజనీకాంత్ ను చాలా డీసెంట్ లుక్ తో కనబడుతున్నారు. అందమైన కళ్ళ అద్దాలు మరియు బెల్ బాటమ్ జీన్స్ ప్యాంట్స్ లో మంచి స్టైలీష్ గా డీసెంట్ గా ఉన్నారు.

పడయప్పా గెటప్: రజనీకాంత్ పడయప్పా అవతారంలో చాలా అద్భుతంగా ఉన్నాడు. రజనీకాంత్ కు ఇష్టమైన కలర్ తెలుపు, ఇష్టమైన డ్రెస్, వైట్ కుర్తాలో ట్రెడిషినల్ లుక్ తో అద్భుతంగా ఉన్నారు.

మంచి రోబో: రజనీ తీసిన ప్రతి సినిమాకు ఒక్కో ప్రత్యేకత ఉన్నా కూడా రోబో సినిమాతో సూపర్ హీరోగా ఎదిగిపోయారు. బ్యాక్ బ్రష్డ్ హెయిర్ మరియు రోజ్ లిప్స్ లో ఫ్రెండ్లీ సూపర్ హీరోను తలపిస్తున్నారు.

ఈవిల్ రోబోట్: రోబో సెకండ్ పార్ట్ లోని గెటప్ చాలా అద్భుతంగా ప్రదర్శించాడు. మంచిగా ఉన్న రోబో, ఒక రోగ్ గా మారిన వైనంలో తీసిన ఈ ఫోటోలో క్ర్యూ కట్ హెయిర్, డార్క్ గ్లాస్ తో ఫర్ ఫెక్ట్ రోగ్ లుక్ ఇస్తోంది.

సిల్వర్ హెయిర్ శివాజీ: శివాజీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకొన్నది. ఇందులో రజనీ హెయిర్ స్టైల్ సిల్వర్ కలర్,చాలా పాపులర్ అయినటువంటి హెయిర్ స్టైల్ అద్భుతంగా రజనీకి మ్యాచ్ అయ్యాయి.

దేశీ శివాజీ: శివాజీలో దేశీ లుక్ తో రజనీకాంత్ చాలా హాట్ గా కనిపిస్తున్నాడు. ఎక్కువ గడ్డంతో, పొడవాటి జుట్టుతో ఇంకా సాంప్రదాయ దుస్తుల్లో ఓ విభిన్న రూపంలో ప్రత్యేకంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.



Click it and Unblock the Notifications