Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
నెట్ శారీలో న్యూ ఫ్యాషన్ ట్రెండ్ తో మెరిసిపోతున్న సెలబ్రిటీలు...!
పండగ, పార్టీ... సందర్భం ఏదైనా ఆకట్టుకునేవి డిజైనర్ చీరలే. చీర కట్టు మన సంప్రదాయం. అంతేకాకుండా ఇప్పుడు చీర అంటే ఫ్యాషన్‌గా కూడా మారింది. అందుకే- ఇప్పుడు ఆడ వారు కూడా ఏదో ఒక సందర్భంలో చీరకట్టి మన సంప్రదాయాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. చిన్న పిల్లలకు చీరల టైపు డ్రస్సులు వేస్తున్నారు. దాంతో పిల్లలు వాటిని చూసి చీరకట్టుపై ఇష్టం పెంచుకుంటున్నారు. నిజం చెప్పాలంటే చీరకట్టు స్త్రీకి గౌరవం తెస్తుంది. అయినా చీరకట్టులో ఉన్న సౌందర్యం డ్రస్సుల్లో ఎక్కడ ఉంటుంది చెప్పండి...?
చీరకట్టు భారతీయులకే పరిమితం. ఆరుగజాల చీరను వంటికి చుట్టుకోవడంతో సరిపెట్టుకోక దాన్ని అందంగా, ఆకర్షణీయంగా ఎలా కట్టుకోవాలో భారతీయ మహిళకు తెలిసినట్లుగా మరెవరికీ తెలియదేమో...! బెంగాలీ, మరాఠీ, తమిళనాడు, ఆంధ్రా.. ఇలా ప్రాంతాలు ఏవయినా, అక్కడి చీరకట్టు వేరయినా అందులోనూ ఓ అందం ఉంటుంది. అందుకే విదేశీయులు సైతం మన భారతీయ మహిళల చీరకట్టు పట్ల మోజుపడుతున్నారు. అందుకే ఇటీవలి కాలంలో చీరకట్టు సైతం కొత్త పుంతలు పోతోంది. ఫ్యాషన్ షోలలో కూడా చోటు దక్కించుకుంటోంది. ఈ అందాల భామల చీర కట్టు చీరకే కాదు, వారికి కూడా కొత్త అందాలను తెచ్చిపెడుతోంది కదూ..!

ఐశ్వర్య రాయ్: మెరిసిపోయే ఈ ఇండియన్ బ్యూటీ ఈ నెట్ శారీలో మరింత అందంగా మెరిసిపోతోంది. మెరూన్ రేషమ్ జెరీ మరియు శారీ బాడర్ మీద థ్రెడ్ వర్క్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. చీరకు తగ్గట్టు ఫుల్ స్లీవ్ తో ఎంబ్రాయిడర్ చేసి బ్లౌజ్ ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.

కరీనా కపూర్: కొత్తగా పెళ్ళైన పెళ్ళికూతరు కరీనా కపూర్ చీరలు కట్టడం అంటే చాలా ఇష్టం. ఈ బ్లాక్ కలర్ నెట్ చీర ఆమె జీరోసైజ్ కు ఫర్ ఫెక్ట్ గా కుదిరింది.

ప్రీతీ జింటా: జబ్ థక్ హై జాన్ ప్రీమియర్ షోలో అద్భుతమైనటువంటి ఎల్లో కలర్ లంగాఓనీ నెటెడ్ శారీ ఒక మెరుపులా అలా మెరిసిపోయింది.

రాణి ముఖర్జీ: రాణీ ముఖర్జీ ఈ లంగాఓనీ స్టైల్ లో బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ నెటెడ్ శారీలో అద్భుతంగా కనిపిస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజ్. ముత్యాల హారం, ముఖంలో పెద్దగా ఎర్రగా కనబడే బొట్టు మరింత ఆకర్షణీయంగా కనబడేలా చేస్తున్నాయి.

కత్రినా కైఫ్: బాలీవుడ్ క్యూట్ డాల్ కత్రినా కైఫ్ ఈ క్యూట్ ఆఫ్ వైట్ శారీలో మరింత క్యూట్ గా కనబడుతోంది. చీర బాడర్ లో గోల్డెన్ ఎంబ్రాయిడరీ, దానికి ఎరుపు జాకెట్ అద్భుతంగా మ్యాచ్ అయ్యింది.

బిపాషా బసు: బాలీవుడ్ బాంబ్ షెల్ బిపాషా బసు. ఈ పీచ్ కలర్ నెట్ శారీలో మరింత సెక్సీగా కనబడుతోంది. అందమైనటువంటి ఈ నెట్ శారీకి ఓ బికినీ టైప్ బ్లౌజ్ లో తన ఆకతికి, తన స్టైల్ కు తగ్గట్టు వేసుకొన్నది.

షెర్లిన్ చోప్రా: కాంట్రవెర్సీ క్యూట్ షెర్లిన్ చోప్రా ఓ డిఫరెంట్ లుల్ తో కనబడుతోంది...! బాటిల్ గ్రీన్ కలర్ శారీతో రెండ్ కలర్ పఫ్ స్లీవ్స్ బ్లౌజ్ చీర ధరించి చాలా అందంగా కనబడుతోంది.

దీపికా పడుకొనే: పొడగా ఉండే ఈ స్లిమ్ బాలీవుడ్ బ్యూటీ ట్రెడిషినల్ లుక్ తో అద్భుతంగా ఆకర్షనీయంగా కనబడుతోంది. పీచ్ కలర్ శారీలో చాలా బాగుంది. శారీ మీద వైట్ థ్రెడ్ వర్క్ చాలా క్లాసిక్ గా కనిపిస్తోంది.

జరీన్ ఖాన్: జరీన్ చేప కట్ లో కనిపించే ఈ లంగా ఓనీ శైలిలో వివిధ రంగులతో మిళితమైన ఈ శారీ లో చాలా క్యూట్ గా కనబడుతుందో.
ప్రస్తుతరం వారు చీర కట్టులో వివిధ రకాలను ఉపయోగిస్తూ.. అందంగా ఇతరులను ఆకర్షిస్తుంటారు. అంతే కాదు ప్రస్తుత ట్రెండ్ లో నెటెడ్ శారీలు బాగా ఫేమస్ అయ్యాయి. ఈ నెటెడ్ శారీలు విజిబుల్ గా ఉండి చీరవెనుకున్న అందాలు కనిపించి కనబడనీయకుండా ఎదుటి వారిని ఆకర్షిస్తుంటాయి. అందుకే ప్రస్తుత కాలంలో రెడ్ కార్పెట్ పై, షాషన్ షో, ఈవెంట్ షో, ఇంకా పెళ్ళిళ్లలో ఇటువంటి చీరల ఎక్కుగా దర్శనమిస్తున్నాయి. ఈ నెటెడ్ శారీలు ఇండియన్ స్టైల్ లో కట్టుకోవడం వల్ల మరింత సెక్సీగా కనబడుతారు. నెట్ శారీలు చూడటానికి అందంగా కనబడ్డా వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే నెట్ లా చాలా పలుచగా ఉండటం వల్ల ఏదైన తగులుకొన్నా చాలా సులభంగా చిరిగిపోయేందుకు అవకాశం ఉంది. కాబట్టి నెట్ శారీని ధరించి తర్వాత వాటిని తీసి భద్రగా మడిచి వార్డ్ రోబ్ లో భద్రపరచుకోవాలి. ముఖ్యంగా నెట్ శారీలోకి మీరు ధరించే ఆభరణాలు చాలా షార్ప్ గా ఉండకుండా చూసుకోవాలి. పొరపాటున ఏవైన నెట్ కు పట్టుకొన్న చిరిగిపోయే ప్రమాదం ఉంది.
మీకు నెట్ శారీ ధరించడం చాలా ఇష్టంగా ఉన్నా... అదీ ఇండియన్ స్టైల్ లో ఈ ట్రెండ్ కు సరిపోయే విధంగా ఎలా ధరించాలో ఇక్కడ కొందరు సెలబ్రెటీలు కట్టిన విధానం చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. దాంతో మీరు కూడా నెట్ శారీలో అందంగా.. ఆకర్షణీయంగా కనబడటానికి ప్రయత్నించవచ్చు...



Click it and Unblock the Notifications